పోలార్ వర్టెక్స్

 

  • పోలార్ వర్టెక్స్ ఆర్కిటిక్ ధృవ ప్రాంత వాతావరణం లోని ఒక లక్షణం.
  • ఇది ద్రువాల కేంద్రం చుట్టూ పశ్చిమం నుండి తూర్పు దిశకు ప్రవహించే చలి గాలుల సమూహం.
  • ఇవి భూమి చుట్టూ (ద్రువాల చుట్టూ) తిరుగుతూ ఒక కవచాన్ని ఏర్పరుస్తాయి. అంటార్కిటిక్ మరియు ఆర్కిటిక్ ధృవ కేంద్రంలో ఉండే అత్యంత చల్లని చలిగాలులను భూమధ్యరేఖ వైపుగా జారిపోకుండా ఈ కవచం అడ్డుకుంటుంది.


పోలార్ వర్టేక్స్ మీద వాతావరణ మార్పుల ప్రభావం:
  • పోలార్ వర్టేక్స్ పైన వాతావరణ మార్పుల ప్రభావం ముఖ్యంగా గ్లోబార్ వార్మింగ్ ప్రభావం చాలా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంతే కాకుండా, ప్లాస్టిక్ వినియోగం, ఆర్కిటిక్ సర్కిల్ ని రవాణా మార్గాలుగా వినియోగించడం వంటి కారణాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.
  • ఈ కారణాల వల్ల క్రమంగా ప్రతి వేసవి లోనూ ఆర్కిటిక్ ధృవ ప్రాంతంలోని మంచు వేగంగా కరిగిపోవడం జరుగుతోంది. ఆర్కిటిక్ మంచు  కరిగే కొందీ ఆర్కిటిక్ సముద్రం మరింత వెచ్చగా మారుతోంది. చలికాలంలో సముద్రం ఈ అదనపు వేడిని వాతావరణంలోకి నెట్టివేస్తుంది. ఫలితంగా పోలార్ వొర్టెక్స్ బలహీనపడుతోంది.
  • పోలార్ వర్టేక్స్ స్థిరంగా ఉన్నప్పుడు శీతల గాలులు నియంత్రణలో ఉంటాయి. కానీ, ఎప్పుడైతే పోలార్ వర్టేక్స్ స్తిరంగా లేనప్పుడు శీతల పవనాలు నియంత్రణ కోల్పోతాయి. ఫలితంగా ధృవ ప్రాంతంలోని తీవ్ర చలి గాలులు బలహీన పడిన కవచాన్ని దాటుకుని దక్షిణ వైపుగా ప్రయాణించి కెనడా, అమెరికాల మీదికి వస్తాయి. ఒక్కోసారి ఈ గాలుల సమూహం మధ్యకు చీలిపోయి రష్యా, తూర్పు యూరప్ దేశాల మీదికి సైతం వస్తాయి.
  • కిందికి వచ్చిన చలి వాతావరణం జెట్ స్ట్రీమ్ ను కూడా మరింత దక్షిణానికి నెట్టివేస్తుంది. దానితో దక్షిణ ప్రాంతాలు కూడా తీవ్రమైన చలి మంచుతో నిండిపోతాయి.
  • ఇటీవల ఉత్తర అమెరికాలో నెలకొన్న -50 డిగ్రీల అతి శీతల పరిస్తితులే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
     సహజంగా ఏర్పడిన ఇలాంటి రక్షణ కవచాలను వాతవరణ మార్పుల ద్వారా మనిషే నాశనం చేస్తు తను కూర్చున్న కొమ్మను తానె నరుక్కున్తున్నాడు. అందుకే వాతావరణ మార్పుపై అన్నిదేశాలు నియంత్రణ సాధించాల్సిన అవసరం చాలా ఉంది.