HISTORY PRACTICE BITS 4

 

1. కింది పేర్కొన్న పత్రికల్లో భారతదేశంలో ప్రచురించిన తొలి పత్రిక ఏది?
ఎ. బెంగాల్ గెజిట్ (1780)
బి. క్రాంతి
సి. బెంగాల్ గెజిట్ (1818)
డి. యుగాంతర్
సమాధానం: ఎ

2. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఐఎన్‌సీ అధ్యక్షుడు ఎవరు?
ఎ. మహాత్మా గాంధీ
బి. జవహర్‌లాల్ నెహ్రూ
సి. జె.బి.కృపలాని
డి. సర్ధార్ వల్లభాయ్ పటేల్
సమాధానం: సి

3. మహారాష్ట్రలో గణేశ్ ఉత్సవాలను ప్రారంభించింది?
ఎ. గోపాలకృష్ణ గోఖలే
బి. బాల గంగాధర్ తిలక్
సి. వి.డి. సావర్కర్
డి. లాలాలజపతి రాయ్
సమాధానం: బి

4. కింది వానిలో సరైనది ఏది?
ఎ. భారతదేశ కురువృద్ధుడు – దాదాబాయి నౌరోజీ
బి. దక్షిణ భారతదేశ కురువృద్ధుడు – సుబ్రహ్మణ్య అయ్యార్
సి. రాయలసీమ కురువృద్ధుడు – కల్లూరు సుబ్బారావు
డి. ఏదీకాదు
సమాధానం: డి

5. రెండో హార్డింజ్ ఎవరిని అత్యంత అపాయకరమైన కుట్రదారుడు అని పేర్కొన్నాడు?
ఎ. బాల గంగాధర్ తిలక్
బి. లాలా లజపతిరాయ్
సి. బిపిన్ చంద్రపాల్
డి. అరబిందో ఘోష్
సమాధానం: బి

6. స్వరాజ్యం ఒక మూలం, స్వదేశీ మరియు బహిష్కరణ దాని యొక్క శాఖలు అన్నది ఎవరు?
ఎ. బాల గంగాధర్ తిలక్
బి. అరబిందో ఘోష్
సి. బిపిన చంద్రపాల్
డి. లాలా లజపతిరాయ్
సమాధానం: ఎ

7. ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని రద్దు చేసింది?
ఎ. లిట్టన్
బి. రిప్పన్
సి. కానింగ్
డి. లార్డ్ మెయొ
సమాధానం: బి

8. కింది వాటిలో ఏ గ్రామాన్ని కలిపి కలకత్తా అని పిలుస్తారు?
ఎ. కాలికట్
బి. సుతనాటి
సి. గోవిందాపూర్
డి. పైవన్నీ
సమాధానం: డి

9. భారతదేశానికి వాస్కోడిగామా రెండోసారి ఎప్పుడు వచ్చారు?
ఎ. 1498
బి. 1502
సి. 1504
డి. 1506
సమాధానం: బి

10. కిందివారిలో ఎవరికి రెండో మైసూర్ యుద్ధంతో సంబంధం లేదు?
ఎ. వారెన్ హేస్టింగ్
బి. టిప్పు సుల్తాన్
సి. హైదర్ అలీ
డి. కారన్ వాలిస్
సమాధానం: డి