ఏక్‌భారత్‌ శ్రేష్ఠ్‌భారత్‌ - హర్యానా స్కూళ్లలో తెలంగాణ పండుగలు

 

          ఏక్‌భారత్‌ శ్రేష్ఠ్‌భారత్‌ కార్యమ్రంలో భాగంగా ఇతర రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకొనే అవకాశాన్ని విద్యాశాఖ విద్యార్థులకు కల్పించింది. పాఠశాలల్లో ఒక రాష్టం పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను మరో రాష్ట్రం నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం హర్యానా పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను విద్యార్థులకు నేర్పించనున్నారు. కానీ, కొవిడ్‌ నేపథ్యంలో వర్చువల్‌గా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. జాతీయ సమగ్రతను పెంపొందించడంలో భాగంగా రెండు రాష్ర్టాల నృత్యాలు, పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆటలు వంటివి విద్యార్థులకు పరస్పరం నేర్పించాలని సూచించారు.

తెలంగాణలో నిర్వహించేవి: దమాల్‌, దప్‌ డ్యాన్స్‌, ఫాగ్‌, గూమన్‌, జుమర్‌ డ్యాన్స్‌, లూర్‌, గుగ్గా డ్యాన్స్‌, కోరియా చుపియా నృత్యాలు, లోహ్రీ పండుగ, హర్యానా డే, పింజోర్‌ హెరిటేజ్‌ ఫెస్టివల్‌, బైసాకి ఉత్సవం, గంగూర్‌, గుగ్గానవమి, సురజ్‌ఖుండ్‌మేళా.

హర్యానాలో నిర్వహించేవి: పేరిణి శివతాండవం, ఒగ్గు కథ, చిందు భాగవతం, గుస్సాడీ నృత్యం, తోలుబొమ్మలాట, లంబాడ జానపదం, బుర్రకథ, బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతర, పీర్లపండుగ.