2021 వైద్యశాస్త్రంలో ఇద్దరి అమెరికన్లకు నోబెల్‌

 

           వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను అమెరికన్‌ పరిశోధకులను నోబెల్‌ బహుమతి వరించింది. డాక్టర్‌ డేవిడ్‌ జూలియస్‌, డా. అర్డెమ్‌ పటాపౌటియన్‌లుకు ఉమ్మడిగా నోబెల్‌ బహుమతి ప్రకటించారు. శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకు గాను వీరు ఎంపికయ్యారు. 

 

           ‘మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, చలి, స్పర్శ వంటి సంకేతాలు ఎలా ప్రారంభమవుతాయనే విషయాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు స్పష్టంగా వివరించాయి. ఈ ఆవిష్కరణలు ఎన్నో శరీరక వ్యవస్థలు, వ్యాధుల పరిస్థితులను తెలుసుకోవడంలో ఎంతో కీలకమైనవి’ అని నోబెల్‌ జ్యూరీ అభిప్రాయపడింది. రోజువారీ జీవితంలో ఈ అనుభూతులను చాలా తేలికగా తీసుకుంటాం.. కానీ, ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాలు ఎలా ప్రేరేపించబడతాయనే ప్రశ్నలకు తాజాగా ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారని నోబెల్‌ జ్యూరీ అభిప్రాయపడింది.

  • డేవిడ్‌ జూలియస్‌(David Julius) అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
  • అర్డెమ్‌ పటాపౌటియన్‌ కూడా కాలిఫోర్నియాలోని స్క్రిస్స్‌ రీసెర్చ్‌లో కేంద్రంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 
  • ఈ నోబెల్ పురస్కారం(Nobel Prize) కింద బంగారు పతకంతో పాటు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($ 1.14 మిలియన్లకు పైగా) నగదు బహమతిగా అందజేస్తారు.
  • డిసెంబరు 10న స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో ప్రధానం చేస్తారు.