ఆర్థిక సర్వే 2021-22 ముఖ్యాంశాలు (Press Information Bureau)

          కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను 31.01.2022 పార్లమెంటుకు సమర్పించారు. ఆర్ధ్ ఐ క సర్వే ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఆర్థిక వ్యవస్థ స్థితి:

  • భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 7.3 శాతానికి తగ్గిన తర్వాత 2021-22లో (మొదటి ముందస్తు అంచనాల ప్రకారం) వాస్తవ పరంగా 9.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు.
  • జిడిపి 2022-23 లో వాస్తవ పరంగా 8-8.5 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ·        
  • ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మద్దతు అందించడానికి ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉన్న ప్రైవేట్ రంగ పెట్టుబడులను  అంది పుచ్చుకోవడానికి రాబోయే సంవత్సరం సిద్ధంగా ఉంది.
  • 2022-23 సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు తాజా
  • అంచనాలు  8.7, 7.5 శాతాలు గా ఉన్నాయి.
  • ఐఎంఎఫ్ తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్, భారతదేశ వాస్తవ జిడిపి 2021-22 , 2022-23 లో 9 శాతం,  2023-2024 లో 7.1 శాతం వద్ద పెరుగుతుందని అంచనా వేసింది, ఇది భారత్ ను మొత్తం మూడు సంవత్సరాలపాటు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చేస్తుంది.
  • వ్యవసాయం , దాని అనుబంధ రంగాలు 3.9 శాతం పెరుగుతాయని అంచనా; 2021-22 లో పరిశ్రమ 11.8 శాతం , సేవల రంగం 8.2 శాతం పెరగవచ్చు.
  • డిమాండ్ వైపు, 2021-22 లో వినియోగం 7.0 శాతం పెరుగుతుందని అంచనా, గ్రాస్ ఫిక్సిడ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జిఎఫ్ సిఎఫ్) 15 శాతం, ఎగుమతులు 16.5 శాతం , దిగుమతులు 2021-22 లో 29.4 శాతం పెరుగుతాయని అంచనా
  • 2022-23 సవాళ్లను ఎదుర్కోవడానికి భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితి లో ఉన్నట్టు స్థూల ఆర్థిక స్థిరత్వ సూచికలు సూచిస్తున్నాయి.
  • అధిక విదేశీ మారక నిల్వలు, స్థిరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెరుగుతున్న ఎగుమతి ఆదాయాలు కలసి 2022-23 లో సంభావ్య ప్రపంచ లిక్విడిటీ ట్యాపరింగ్ కు వ్యతిరేకంగా తగినంత బఫర్ ను అందిస్తాయి. 
  • ఆరోగ్య ప్రభావం మరింత తీవ్రంగా ఉన్నప్పటికీ, "రెండవవేవ్ " ఆర్థిక ప్రభావం 2020-21 లో పూర్తి లాక్ డౌన్ దశలో కంటే  చాలా తక్కువగా ఉంది.
  • మహమ్మారి కి భారతదేశ ప్రత్యేక ప్రతిస్పందన లో సమాజంలోని నిస్సహాయ వర్గాలు ,వ్యాపార రంగంపై ప్రభావాన్ని తగ్గించడానికి భద్రతా వలలు ఉన్నాయి, నిరంతర దీర్ఘకాలిక విస్తరణ కోసం అభివృద్ధి, సరఫరా పరమైన సంస్కరణల పై మూలధన వ్యయం గణనీయంగా పెంచింది.
  • ప్రభుత్వ సరళమైన , బహుళ విధ ప్రతిస్పందన పాక్షికంగా ఫీడ్ బ్యాక్-లూప్ లను ఉపయోగించే "చురుకైన" ఫ్రేమ్ వర్క్, తీవ్రమైన అనిశ్చితి వాతావరణంలో ఎనభై హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లను (హెచ్ ఎఫ్ ఐలు) ఉపయోగించడం పై ఆధారపడి ఉంది. .

 

ఆర్థిక పరిణామాలు:

  • కేంద్ర ప్రభుత్వ (ఏప్రిల్ నుంచి నవంబర్, 2021) ఆదాయ రసీదులు 2021-22 బడ్జెట్ అంచనా (2020-21 తాత్కాలిక వాస్తవాల్లో) లలో 9.6 శాతం వృద్ధిని అంచనా వేయడంతో 67.2 శాతం (వై ఓ వై) పెరిగాయి.
  • స్థూల పన్ను ఆదాయం ఏప్రిల్ నుండి నవంబర్, 2021 వరకు వై ఓ వై పరంగా 50 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది.  2019-2020 పూర్వ మహమ్మారి స్థాయిలతో పోలిస్తే ఈ పని తీరు బలంగా ఉంది.  
  • ఏప్రిల్-నవంబర్ 2021 సమయంలో, కాపెక్స్ మౌలిక సదుపాయాల-ఇంటెన్సివ్ రంగాలపై దృష్టి సారించి 13.5 శాతం (వై ఓ వై) పెరిగింది.
  • స్థిరమైన ఆదాయ సేకరణ , లక్షిత వ్యయ విధానం ఏప్రిల్ నుండి నవంబర్, 2021 వరకు ఆర్థిక లోటును బిఈలో 46.2 శాతంగా అదుపు చేసింది.
  • కోవిడ్-19 కారణంగా పెరిగిన రుణాలతో, కేంద్ర ప్రభుత్వ రుణం 2019-20 లో జిడిపిలో 49.1 శాతం నుండి 2020-21 లో జిడిపిలో 59.3 శాతానికి పెరిగింది, కానీ ఆర్థిక వ్యవస్థ రికవరీతో తగ్గుదల బాట పడుతుందని భావిస్తున్నారు.

 

బాహ్య రంగాలు:

  • భారతదేశ వాణిజ్య ఎగుమతులు, దిగుమతులు బలంగా పుంజుకున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ కు ముందు స్థాయిలను అధిగమించాయి.
  • పర్యాటక ఆదాయాలు తగ్గినప్పటికీ ,రసీదులు మరియు చెల్లింపులు రెండూ మహమ్మారి ముందునాటి స్థాయిలను దాటడంతో నికర సేవల్లో గణనీయమైన వేగం ఉంది.
  • విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, నికర బాహ్య వాణిజ్య రుణాల పునరుద్ధరణ, అధిక బ్యాంకింగ్ మూలధనం ,అదనపు ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (ఎస్ డిఆర్) కేటాయింపు కారణంగా 2021-22 మొదటి అర్ధభాగంలో నికర మూలధన ప్రవాహాలు 65.6 బిలియన్ డాలర్ల వద్ద అధికంగా ఉన్నాయి.
  • భారతదేశ బాహ్య రుణం సెప్టెంబర్ 2021 చివరినాటికి 593.1 బిలియన్ డాలర్లకు పెరిగింది, ఇది ఒక సంవత్సరం క్రితం 556.8 బిలియన్ డాలర్లు ఉంది. ఇది అధిక వాణిజ్య రుణాలతో పాటు. ఐఎంఎఫ్ అదనపు ఎస్ డి ఆర్ కేటాయింపును ప్రతిబింబిస్తుంది,
  • విదేశీ మారక నిల్వలు 2021-22 మొదటి అర్ధభాగంలో 600 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటాయి.  డిసెంబర్ 31, 2021 నాటికి 633.6 బిలియన్ డాలర్లను తాకాయి
  • 2021 నవంబర్ చివరి నాటికి, చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఫారెక్స్ నిల్వల హోల్డర్ గా భారతదేశం నిలిచింది.

 

ద్రవ్య నిర్వహణ -ఆర్థిక మధ్యవర్తిత్వం:

వ్యవస్థలో లిక్విడిటీ మిగులులో ఉంది

*రెపో రేటును 2021-22 లో 4 శాతం వద్ద కొనసాగించారు.

*  తదుపరి లిక్విడిటీని అందించడం కోసం జి-సెక్ అక్విజిషన్ ప్రోగ్రామ్ , స్పెషల్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ వంటి వివిధ చర్యలను ఆర్ బి ఐ చేపట్టింది.

మహమ్మారి వల్ల ఆర్థిక నష్టం వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మెరుగైన స్థితి కి చేరింది:       

* వై ఓ వై బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 2021-22 లో ఏప్రిల్ 2021 లో 5.3 శాతం నుండి 31 డిసెంబర్ 2021 నాటికి 9.2 శాతానికి క్రమంగా పుంజుకుంది.

*షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్ సిబిలు) స్థూల నిరర్థక అడ్వాన్సెస్ నిష్పత్తి 2017-18 చివరినాటికి 11.2 శాతం నుండి సెప్టెంబర్, 2021 చివరినాటికి 6.9 శాతానికి తగ్గింది.

*ఇదే కాలంలో నికర నిరర్థక అడ్వాన్సెస్ నిష్పత్తి 6 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది.

*ఎస్ సిబిల రిస్క్ వెయిటెడ్ అసెట్ నిష్పత్తి కి మూలధనం 2013-14 లో 13 శాతం నుండి సెప్టెంబర్ 2021 చివరినాటికి 16.54 శాతానికి పెరిగింది.

* ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ సెప్టెంబర్ 2021 తో ముగిసే కాలానికి సానుకూలంగా కొనసాగింది.

క్యాపిటల్ మార్కెట్ లకు అసాధారణ సంవత్సరం:

*2021 ఏప్రిల్-నవంబర్ లో 75 ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) ఇష్యూల ద్వారా రూ.89,066 కోట్లు సేకరించారు.ఇది గత దశాబ్దంలో ఏ సంవత్సరం తో పోల్చినాచాలా ఎక్కువ.

*సెన్సెక్స్ ,నిఫ్టీ అక్టోబర్ 18, 2021 న 61,766, 18,477 వద్ద గరిష్టస్థాయికి చేరుకున్నాయి.

* ప్రధాన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో, భారతీయ మార్కెట్లు ఏప్రిల్-డిసెంబర్ 2021 లో సహచరులను అధిగమించాయి.

 

ధరలు -ద్రవ్యోల్బణం:

2021-22 (ఏప్రిల్-డిసెంబర్) లో 6.6 శాతం ఉన్న సిపిఐ-కంబైన్డ్ ద్రవ్యోల్బణం 2021-22 ఇదే కాలం లో 5.2 శాతానికి చేరింది.

*ఆహార ద్రవ్యోల్బణం సడలించడం రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి దారితీసింది.

*ఆహార ద్రవ్యోల్బణం 2021-22 (ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు) లో సగటున 2.9 శాతం కనిష్టంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 9.1 శాతం ఉంది.

*సమర్థవంతమైన సరఫరా దిశ యాజమాన్యం సంవత్సరంలో చాలా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణలో ఉంచింది.

*పప్పుధాన్యాలు ,వంటనూనెల ధరల పెరుగుదలను నియంత్రించడానికి సానుకూల చర్యలు తీసుకున్నారు.

*సెంట్రల్ ఎక్సైజ్ తగ్గింపు , చాలా రాష్ట్రాలు విలువ ఆధారిత పన్నులో కోతలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి సహాయపడ్డాయి.

టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారంగా టోకు ద్రవ్యోల్బణం 2021-22 (ఏప్రిల్ నుంచి డిసెంబర్) సమయంలో 12.5 శాతానికి పెరిగింది. ఇందుకు కారణాలు:

*గత సంవత్సరంలో తక్కువ బేస్,

*ఆర్థిక కార్యకలాపాల్లో వేగం

*ముడి చమురు ,ఇతర దిగుమతి ఇన్ పుట్  ల అంతర్జాతీయ ధరలు గణనీయంగా పెరగడం

*అధిక రవాణా ఖర్చులు

సిపిఐ-సి ,డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం మధ్య వ్యత్యాసం:

*ఈ వ్యత్యాసం మే 2020 లో 9.6 శాతం తారాస్థాయి పాయింట్లకు చేరుకుంది.

*అయితే, ఈ ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్ 2021 లో టోకు ద్రవ్యోల్బణం కంటే 8.0 శాతం పాయింట్లు పడిపోవడంతో వ్యత్యాసం తిరోగమనం లో ఉంది.

ఈ భిన్నత్వాన్ని దిగువ పేర్కొన్న కారణాల ద్వారా వివరించవచ్చు:అవి

*బేస్ ఎఫెక్ట్ వల్ల తేడాలు,

*రెండు సూచీల పరిధి ,కవరేజీలో తేడా,

*ధర వసూళ్లు

*కవర్ చేసిన ఐటమ్ లు

*కమోడిటీ బరువుల్లో తేడా, ఇంకా 

* దిగుమతి చేసుకున్న ఇన్‌పుట్‌ల ద్వారా కాస్ట్-పుష్ ద్రవ్యోల్బణానికి డబ్ల్యుపిఐ మరింత సున్నితంగా ఉంటుంది.

*డబ్ల్యుపిఐలో బేస్ ప్రభావం క్రమంగా క్షీణించడంతో, సిపిఐ-సి ,డబ్ల్యుపిఐలో వ్యత్యాసం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

 

స్థిరాభివృద్ధి మరియు జలవాయు పరివర్తన:

· నీతి ఆయోగ్ ఎస్ డిజి ఇండియా ఇండెక్స్ ఎండ్ డాశ్ బోర్డు లో భారతదేశం యొక్క మొత్తం మీద స్కోరు 2020-21వ సంత్సరం లో 66 కు మెరుగు పడింది. ఈ స్కోరు 2019-20వ సంత్సరం లో 60 గాను, 2018-19వ సంవత్సరం లో 57 గాను ఉంది.

· ఫ్రంట్ రనర్స్ రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య (65 నుంచి 99 స్కోరు చేసినవి) 2020-21వ సంవత్సరం లో 22 కు పెరిగింది. ఈ సంఖ్య 2019-20 వ సంవత్సరం లో 10 గా ఉంది.

· నార్థ్-ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ ఎస్ డిజి ఇండెక్స్ 2021-22 లో భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతాల లో 64 జిల్లాలు నీతి ఆయోగ్ ఫ్రంట్ రనర్స్ గాను, 39 జిల్లా లు పెర్ ఫార్మర్స్ గాను నమోదు అయ్యాయి.

· ప్రపంచం లో అతి పెద్ద అటవీ ప్రాంతాన్ని కలిగిన పదో దేశం గా భారతదేశం ఉంది.

· 2010వ సంవత్సరం మొదలుకొని 2020వ సంవత్సరం మధ్య కాలం లో అటవీ ప్రాంతాన్ని పెంచుకోవడం లో భారతదేశం ప్రపంచవ్యాప్తం గా మూడో స్థానం లో నిలచింది.

· 2020వ సంవత్సరం లో భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం లో 24 శాతం మేరకు అడవులు విస్తరించాయి; ఇది ప్రపంచం లోని మొత్తం వన ప్రాంతం లో 2 శాతం గా లెక్క కు వచ్చింది.

· 2021వ సంవత్సరం ఆగస్టు లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ అమెండ్ మెంట్ రూల్స్, 2021 ని నోటిఫై చేయడమైంది. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ను 2022వ సంవత్సరం కల్లా దూరం చేయాలి అనేది దీని ఉద్దేశ్యం గా ఉంది.

· అంతేకాకుండా, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కు సంబంధించిన డ్రాఫ్ట్ రెగ్యులేశన్ ఆన్ ఎక్స్ టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబులిటీ ని నోటిఫై చేయడమైంది.

· గంగా నది ప్రాంతం మరియు ఆ నది ఉప నదుల వెంబడి నెలకొన్న గ్రాస్ లీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ (జిపిఐ స్) యొక్క కాంప్లయన్స్ స్టేటస్ 2017వ సంవత్సరం లో 39 శాతం గా ఉన్నది కాస్తా 2020వ సంవత్సరం లో 81శాతాని కి మెరుగైంది.

· తత్ఫలితం గా కాలుష్య పదార్థాల ప్రవాహాల లో తగ్గింపు అనేది 2017వ సంవత్సరం లో రోజు కు 349.13 మిలియన్ లీటర్ లు (ఎమ్ఎల్ డి) గా ఉండగా ఇది 2020 వ సంవత్సరం లో 280.20 ఎమ్ఎల్ డి కి పరిమితమైంది.

· ఉద్గారాల పరం గా మరింత క్షీణత దిశ గా 2030వ సంవత్సరాని కల్లా మహత్తర లక్ష్యాల ను సాధించనున్నట్లు 2021వ సంవత్సరం నవంబర్ లో గ్లాస్ గో లో జరిగిన 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి 26) లో ప్రధాన మంత్రి చేసిన జాతీయ ప్రకటన లో పేర్కొనడం జరిగింది.

· ఎల్ఐఎఫ్ఇ’ (లైఫ్ స్టైల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్) పేరు తో ఒక ఉద్యమాన్ని ప్రారంభించవలసిన అవసరం ఏర్పడింది. మతి లేనటువంటి మరియు విధ్వంస కారకమైనటువంటి వినియోగాని కి బదులు బుద్ధియుక్త మరియు ఉద్దేశ్య భరిత ఉపయోగం వైపునకు మళ్ళాలని దీని ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.

 

వ్యవసాయం మరియు ఆహార నిర్వహణ

 

· గడచిన రెండు సంవత్సరాల లో వ్యవసాయ రంగం లో ఉత్సాహపూరిత వృద్ధి నమోదైంది. దేశం లో యొక్క గ్రాస్ వేల్యూ యాడెడ్ (జివిఎ) లో వ్యవసాయ రంగం గణనీయం గా 18.8 శాతం (2021-22) పెరుగుదల ను చూపించింది. ఇది 2020-21 లో 3.6 శాతం వృద్ధి ని నమోదు చేయగా 2021-22 లో 3.9 శాతం వృద్ధి ఉంది.

· పంటల వివిధీకరణ ను ప్రోత్సహించడం కోసం కనీస సమర్ధన ధర (మినిమం సపోర్ట్ ప్రైస్- ఎమ్ఎస్ పి) విధానాన్ని అమలు చేయడం జరుగుతోంది.

· పంటల ఉత్పత్తుల నుంచి అందిన నికర వసూళ్ళు తాజా సిట్యుయేశన్ అసిస్ మెంట్ సర్వే (ఎస్ఎఎస్) ప్రకారం 22.6 శాతం మేర పెరిగాయి.

· పశుపోషణ, పాడి రంగం, చేపల పెంపకం సహా సంబంధి రంగాలు అధిక వృద్ధి ని చూపుతున్న రంగాలు గా నిలకడ గా రాణిస్తున్నాయి. అంతేకాకుండా, ఇవి వ్యవసాయ రంగం లో మొత్తం మీద వృద్ధి కి ప్రధాన చోదక శక్తులు గా ఉన్నాయి.

· పశు గణం రంగం 2019-20వ సంవత్సరం తో ముగుస్తున్న గడచిన అయిదేళ్ళ కాలం లో 8.15 శాతం సిఎజిఆర్ లెక్క న వృద్ధి చెందింది. ఈ రంగం వ్యావసాయిక కుటుంబాల సమూహాల కు నిలకడ తో కూడినటువంటి ఆదాయ మార్గం గా లెక్క కు వచ్చింది. వారు నెలసరి సగటు న సంపాదించే ఆదాయం లో దాదాపుగా 15 శాతం పశుగణం రంగం నుంచి అందింది.

· మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం, తక్కువ ఖర్చు లో రవాణా, ఇంకా సూక్ష్మ ఆహార వాణిజ్య సంస్థల వ్యవస్థీకరణ కు సమర్ధనల వంటి వేరు వేరు చర్యల ద్వారా ఫూడ్ ప్రోసెసింగ్ కు మార్గాన్ని ప్రభుత్వం సుగమం చేస్తున్నది.

· ప్రపంచం లోకెల్లా అతి భారీ ఆహార నిర్వహణ కార్యక్రమాల సరసన చేరిన ఒక కార్యక్రమాన్ని భారతదేశం ప్రస్తుతం నిర్వహిస్తున్నది.

· పిఎమ్ గరీబ్ కళ్యాణ్ యోజన (పిఎమ్ జికెవై) వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఆహార భద్రత సంబంధి నెట్ వర్క్ కవరేజి ని మరింత గా విస్తరింప చేసింది.

 

పరిశ్రమ మరియు మౌలిక సదుపాయాల కల్పన:

· పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 2020 ఏప్రిల్-నవంబర్ లో (-)15.3 శాతం గా ఉన్నది కాస్తా, 2021 ఏప్రిల్ మొదలుకొని నవంబర్ మధ్య కాలానికి వచ్చే సరికి 17.4 శాతాని కి (వైఒవై)వృద్ధి చెందింది.

· ఇండియన్ రైల్ వే స్ కు పెట్టుబడి రూపేణా వ్యయం 2009-14వ సంవత్సర మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదిక న సరాసరి 45,980 కోట్ల రూపాయలు గా ఉండగా 2020-21 లో 1,55,181 కోట్ల రూపాయల కు పెరిగింది. దీనిని మరింత గా పెంచి 2021-22 లో 2,15,058 కోట్ల రూపాయల కు చేర్చాలని సంకల్పించడమైంది. 2014వ సంవత్సరం స్థాయి తో పోలిస్తే ఇది అయిదు రెట్లు అధికం.

· ఒక రోజు లో రహదారి నిర్మాణం స్థాయి 2020-21వ సంవత్సరం లో గణనీయం గా 36.5 కి.మీ. కి పెరిగింది. 2019-20వ సంవత్సరం లో నమోదైన రోజు కు 28 కిమీ లతో పోల్చి చూసినప్పుడు దీనిలో పెరుగుదల 30.4 శాతం గా ఉంది.

· పెద్ద కంపెనీ ల నెట్ ప్రాఫిట్ టు సేల్ రేశియో అనేది 2021-22 ఆర్థిక సంవత్సరం లో జూలై-సెప్టెంబర్ త్రైమాసికం లో మునుపు ఎన్నడూ లేనంత అధికం గా 10.6 శాతాని కి చేరుకొంది. మహమ్మారి ప్రబలినప్పటి కీ ఈ నిష్పత్తి చోటు చేసుకొన్నట్లు ఆర్ బిఐ అధ్యయనం పేర్కొంది.

· ఉత్పత్తి కి ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకాన్ని ప్రవేశ పెట్టడం తో అటు భౌతికం గా, ఇటు డిజిటల్ మాధ్యమం పరం గా కూడాను మౌలిక సదుపాయాల కల్పన కు పెద్ద ఉత్తేజాన్ని అందించినట్లయింది. దీనికి తోడు రవాణా ఖర్చుల లో తగ్గింపు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుల సైతం ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకొనే వేగాన్ని బలపరచనున్నాయి.

సేవలు:

· సేవల రంగం యొక్క జివిఎ 2021-22 ఆర్థిక సంవత్సరం లో జులై-సెప్టెంబర్ త్రైమాసికం లో మహమ్మారి కి పూర్వం ఉన్న స్థాయి ని మించి పోయింది; ఏమైనా వ్యాపారం, రవాణా తదితర కాంటాక్ట్ ఇంటెన్సివ్ సెక్టర్ ల యొక్క జివిఎ ఇప్పటికీ మహమ్మారి కి పూర్వం ఉన్నటువంటి స్థాయి కంటే తక్కువ గానే ఉంటోంది.

· సేవల రంగం మొత్తంమీద జివిఎ 2021-22వ సంవత్సరం లో 8.2 శాతం మేరకు వృద్ధి చెందవచ్చన్న అంచనా ఉంది.

· 2021 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలం లో రైళ్ళ ద్వారా జరిగేటటువంటి సరకు రవాణా మహమ్మారి కన్నా క్రితం స్థాయి ని అధిగమించింది. మరో పక్క వాయు మార్గ సరకు రవాణా, ఇంకా ఓడరేవుల లో నౌకల రాక పోక లు దాదాపుగా మహమ్మారి కి పూర్వపు స్థాయి ల వద్ద కు చేరుకొన్నాయి. దేశీయ వాయు మార్గ రాక పోక లు, రైళ్ళ లో ప్రయాణికుల ప్రయాణం అనేవి క్రమం గా పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలు ఫస్ట్ వేవ్ తో పోల్చి చూసినప్పుడు సెకండ్ వేవ్ తాలూకు ప్రభావం మరింత ఎక్కువ గా ఉందని సూచిస్తున్నది.

· 2021-22 ప్రథమార్థం లో సేవ ల రంగం 16.7 బిలియన్ యుఎస్ డాలర్ కు పైగా ఎఫ్ డిఐ ని అందుకొన్నది. ఈ మొత్తం భారతదేశం లోకి తరలి వచ్చిన మొత్తం ఎఫ్ డిఐ లో సుమారు గా 54 శాతాని కి సమానం గా ఉంది.

· ఐటి-బిపిఎమ్ సేవల సంబంధి ఆదాయం 2020-21వ సంవత్సరం లో 194 బిలియన్ యుఎస్ డాలర్ స్థాయి ని అందుకొంది; ఈ కాలం లో 1.38 లక్షల మంది ఉద్యోగులు కొత్త గా ఈ రంగాల లోకి ప్రవేశించారు.

· ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రధాన సంస్కరణల లో ఐటి-బిపిఒ రంగం లో టెలికం సంబంధి నియమావళి ని తొలగించడం తో పాటు అంతరిక్ష రంగం తలుపుల ను ప్రైవేటు సంస్థ ల కోసం తెరవడం వంటివి కూడా ఒక భాగం గా ఉన్నాయి

· సేవ ల రంగం ఎగుమతులు 2020-21 జనవరి-మార్చి త్రైమాసికం లో మహమ్మారి కి పూర్వం ఉన్న స్థాయి ని అధిగమించాయి. అవి 2021-22 వ సంవత్సరం ప్రథమార్థం లో 21.6 శాతం మేరకు వృద్ధి చెందాయి. సాఫ్ట్ వేర్ మరియు ఐటి సేవల సంబంధి ఎగుమతుల కు ప్రపంచ వ్యాప్తం గా డిమాండు ఉండటం ఈ పరిస్థితి కి దారి తీసింది.

· ప్రపంచం లో స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ లో యుఎస్ మరియు చైనా ల తరువాత మూడో అతి పెద్ద దేశం గా భారతదేశం నిలచింది. కొత్త గా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్స్ సంఖ్య 2016-17 లో 733 గా ఉన్నది కాస్తా 2021-22 వ సంవత్సరం లో 14,000 కు పైబడి వృద్ధి చెందాయి.

· 44 భారతదేశ స్టార్ట్-అప్స్ 2021వ సంవత్సరం లో యూనికార్న్ హోదా ను సాధించాయి. దీనితో యూనికార్న్ స్ మొత్తం సంఖ్య 83 కు చేరింది. ఈ యూనికార్స్ స్ లో చాలా వరకు సేవ ల రంగం లో పని చేస్తున్నాయి.

 

సోశల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మరియు ఉపాధి:

· 2022 వ సంవత్సరం జనవరి 16వ తేదీ నాటి కి 157.94 కోట్ల కోవిడ్-19 టీకా మందు డోజుల ను ప్రజలకు ఇప్పించడమైంది; దీనిలో 91.39 కోట్ల ఒకటో డోజు, అలాగే 66.05 కోట్ల రెండో డోజు లు ఉన్నాయి.

· ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ తో ఉపాధి సూచిక లు 2020-21 ఆఖరు త్రైమాసికం లో మహమ్మారి పూర్వ స్థాయిల ను తిరిగి అందుకొన్నాయి.

· పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎఫ్ఎల్ఎస్) త్రైమాసికం వారీ సమాచారాన్ని బట్టి చూస్తే 2021 మార్చి నెల చివరి నాటికి మహమ్మారి వల్ల ప్రభావితం అయిన పట్టణ రంగం లో ఉపాధి కల్పన దాదాపు గా మహమ్మారి కి పూర్వ స్థాయి ని అందుకొన్నది.

· ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) సమాచారం ప్రకారం ఉద్యోగాల వ్యవస్థీకరణ కోవిడ్ సెకండ్ వేవ్ లో కూడా కొనసాగింది; ఉద్యోగాల వ్యవస్థీకరణ పైన కోవిడ్ తాలూకు ప్రతికూల ప్రభావం కోవిడ్ ఫస్ట్ వేవ్ కంటే కూడా ఎంతో తక్కువ గా ఉండింది.

· ఆరోగ్యం, విద్య, ఇంకా ఇతర సామాజిక సేవల పై కేంద్రం మరియు రాష్ట్రాలు చేసిన వ్యయం జిడిపి లో నిష్పత్తి ప్రకారం చూసినట్లయితే 2014-15 లోని 6.2 శాతం స్థాయి నుంచి 2021-22 (బిఇ)లో 8.6 శాతాని కి పెరిగింది.

· నేశనల్ ఫ్యామిలీ హెల్థ్ సర్వే-5 లో పేర్కొన్న ప్రకారం:

Ø టోటల్ ఫర్టిలిటీ రేటు (టిఎఫ్ఆర్) 2015-16 లో 2.2 గా ఉండగా, 2019-21 లో 2 కు దిగి వచ్చింది.

Ø శిశు మరణాల రేటు (ఐఎమ్ఆర్), అండర్ ఫైవ్ మోర్టలిటీ రేటు మరియు ఇన్స్ టిట్యూశనల్ బర్థ్ స్ అనేవి 2015-16 తో పోల్చినప్పుడు 2019-21 లో మెరుగయ్యాయి.

 

· జల్ జీవన్ మిశన్ (జెజెఎమ్) లో భాగం గా 83 జిల్లా లు హర్ ఘర్ జల్’ (‘ఇంటింటికీ నీరు’) జిల్లాలు గా మారాయి

· మహమ్మారి ప్రాబల్య కాలం లో గ్రామీణ ప్రాంతాల లో అసంఘటిత శ్రమికుల కు మిగులు నిలవల ను కల్పించడం కోసం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్ఎన్ఆర్ఇజిఎస్) కు నిధుల కేటాయింపు ను పెంచడం జరిగింది.