స్వామి దయానంద సరస్వతి

 

 


        1824 ఫిబ్రవరి 12 తేదీన గుజరాత్ లోని టంకారాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన దయానంద సరస్వతి తొలి పేరు మూల్ శంకర్. హిందూ కేలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో ఆయన జన్మదిన వేడుక జరుగుతుంది. కుటుంబం సంపన్నమైనది కావడంతో ఆయన ప్రారంభ జీవితం ఎంతో సౌకర్యవంతంగా సాగింది. 20 సంవత్సరాల పాటు ఆయన దేవాలయాలు, ప్రారనా ్థ ్థలాలు, పవిత్ర స్థలాల సందర్శనకు దేశం అంతటా తిరిగారు. తనలోని అనుమానాల నివృత్తి కోసం ఆయన పర్వతాలు, అడవుల్లో ఉన్న ఎందరో యోగులను కలిశారు, కానీ, ఎవరి నుంచి సంతృప్తికరమైన సమాధానం పొందలేకపోయారు. చివరికి ఆయన మధురలో స్వామి విరాజానందను కలిశారు. మూల్ శంకర్ ఆయన శిష్యుడుగా చేరారు. వేదాల నుంచి నేరుగా అధ్యయనం చేయాలని విరాజానంద ఆయనను ఆదేశించారు. అధ్యయనం సందర్భంగా జీవితం, మరణంపై గల అనుమానాలన్నింటికీ ఆయన సమాధానం చెప్పారు. మూల్ శంకర్ కు వైదిక జ్ఞానాన్ని సమాజంలో ప్రచారం చేసే బాధ్యత స్వామి విరాజానంద అప్పగించారు. అతనికి రిషి దయానందగా నామకరణం చేశారు.

         1875 ఏప్రిల్ లో ముంబైలో దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించారు. అది ఒక హిందూ సంస్కరణోద్యమం. ఊహాత్మకమైన విశ్వాసాల నుంచి బయటపడాలన్నది సమాజం ధ్యేయం. వేదాల శక్తి అపారమైనదని ఆయన భావించేవారు. తత్వశాస్ర్తానికి కర్మ సిద్ధాంతం, పునరన్మ, బ్రహ్మచర ్జ ్యం, సన్యాసం అనే నాలుగు మూలస్తంభాలను ఆయన అందించారు.

        1876లో తొలిసారిగా స్వరాజ్య పిలుపు ఇచ్చింది ఆయనే అని చెబుతారు. తర్వాత లోకమాన్య తిలక్ పిలుపును ముందుకు నడిపించారు. సత్యార్ ప్రకాశ్ గు థ్ రించి రాస్ ఆయన భక్ తూ తిజ్ఞానంతో పాటు సమాజంలో నైతిక విలువల పెంపునకు, సంఘ సంస్కరణకు ప్రాధాన్యం ఇచ్చారు. కపటత్వం, ఆగ్రహం, క్రూరత్వం, మహిళలపై దురాగతాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. మతంలో మూఢనమ్మకాలు, దురాచారాలు, కపట వైఖరిని వ్యతిరేకించిన ఆయన వాసవ మత ్త స్వభావాన్ని ఆవిష్కరించారు.

         స్వామి దయానంద సరస్వతి మత చైతన్యం రగిలించడమే కాదు దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తం చేయడానికి జాతీయ తిరుగుబాటుకు కూడా తన వంతు సహకారం అందించారు. ఆర్య సమాజం ద్వారా సామాజిక సంస్కరణల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అస్పృశ్యత, సతి, బాల్య వివాహాలు, నరబలి, మత సంకుచిత వాదం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశారు. వితంతు పునర్వివాహం, మత స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి మద్దతు పలికారు.

         స్వామి దయానంద సరస్వతి 1883లో జోధ్ పూర్ మహారాజు వద్దకు వెళ్లారని చెబుతారు. స్వామి దయానంద సరస్వతి నుంచి స్ఫూర్తి పొందిన రాజా యశ్వంత్ సింగ్ ఒక రాజనర్తకితో తనకు గల సంబంధం తెగతెంపులు చేసుకున్నారు. దాంతో ఆగ్రహం చెందిన రాజనర్తకి వంటవానితో కలిసి కుట్ర చేసి స్వామీజీకి అందించిన ఆహారంలో గాజుముక్కలు కలిపింది. కారణంగా స్వామీజీ ఆరోగ్యం క్షీణించి 1883 అక్టోబర్ 30 తేదీన మరణించారు.