బ్రిక్స్ కూటమి - ప‌ద‌మూడ‌వ స‌మావేశం 2021

లక్ష్యం: బ్రిక్స్ దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం.
  • బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్‌మన్, సచ్చ్ అనే ఆర్థికవేత్తలు ఉపయోగించారు.
  • బ్రిక్ కూటమి 2032 నాటికి జీ-8 కూటమిని అధిగమిస్తుందని అంచనా.
  • బ్రిక్ స్థాపించిన సంవత్సరం-2009
  • సభ్యదేశాలు ఐదు- బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా
  • బ్రిక్స్ అనేది ఈ ఐదు దేశాల సంయుక్త కూటమి. ఈ కూటమి మొదట బ్రిక్‌గా ఏర్పడింది.
  • 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్ కూటమిగా రూపాంతరం చెందింది.
  • బ్రిక్స్ కూటమి అంతర్జాతీయ స్వతంత్ర సమాఖ్య..

 


 

  1. బ్రిక్ మొదటి సమావేశం 2009 జూన్‌లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్‌లో జరిగింది.
  2. రెండో సమావేశం బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో 2010 ఏప్రిల్‌లో జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్ కాస్తా బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది.
  3. మూడో సమావేశం చైనాలోని సన్యాలో 2011 ఏప్రిల్‌లో జరిగింది.
  4. నాలుగో సమావేశం న్యూఢిల్లీలో 2012 మార్చిలో జరిగింది.
  5. ఐదో సమావేశం దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో 2013 మార్చిలో జరిగింది.
  6. ఆరో సమావేశం బ్రెజిల్‌లోని ఫోర్ట్‌లెజాలో 2014 జూలైలో జరిగింది. ఈ సమావేశంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు.
  7. ఏడో సమావేశం రష్యాలోని ఉఫాలో 2015 జూలైలో జరిగింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, కంటింజెన్సీ రిజర్వులను ఏర్పాటు చేశారు.
  8. ఎనిమిదో సమావేశం గోవాలో 2016 అక్టోబర్‌లో జరిగింది.
  9. తొమ్మిదో సమావేశం చైనాలోని జియోమెన్ నగరంలో 2017 సెప్టెంబర్‌లో జరిగింది.
  10. 10 - SOUTH AFRICA
  11. 11 - BRAZIL
  12. 12 - RUSSIA

 


13. ప‌ద‌మూడ‌వ స‌మావేశం సెప్టెంబ‌ర్‌ 2021 భార‌త‌దేశంలో జ‌రిగింది.

థీమ్‌:  ‘‘ఇంట్రా బ్రిక్స్‌ కోఆపరేషన్‌ ఫర్‌ కంటిన్యుటీ, కన్సాలిడేషన్, కన్సెస్‌’’ ( ఉజ్వల భవిష్యత్తు కోసం బలమైన భాగస్వామ్యం).

  • బ్రెజిల్ అధ్యక్షుడు – బోల్సనారో
  • రష్యా అధ్యక్షుడు – వ్లాదిమిర్ పుతిన్
  • ఇండియా ప్రధాని- నరేంద్రమోదీ
  • చైనా అధ్యక్షుడు – జీ జిన్ పింగ్
  • దక్షిణాఫ్రికా అధ్యక్షుడు-  రమఫోసా 

ప్రత్యేక ఆహ్వాన దేశాలు

  • ఈజిప్టు, కెన్యా, తజకిస్థాన్, మెక్సికో, థాయ్‌లాండ్
  • ప్రస్తుతం ప్రపంచంలోనే ఆర్థికంగా, వైశాల్యపరంగా అత్యంత శక్తిమంతమైన కూటమి బ్రిక్స్.


డిక్లరేషన్‌ విడుదల...

     బ్రిక్స్‌ సదస్సు చివరలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడి డిక్లరేషన్‌ విడుదల చేశాయి. అఫ్గాన్‌లో పరిస్థితులు శాంతియుతంగా ముగియాలని డిక్లరేషన్‌లో కోరాయి. ఐరాస నిబంధనల మేరకు రూపొందించి సీసీఐటీ అమలు చేయాలని కోరాయి. బ్రిక్స్‌ దేశాల భద్రతా సంస్థలు రూపొందించిన కౌంటర్‌ టెర్రరిజం యాక్షన్‌ ప్లాన్‌ను సభ్యదేశాలు ఆమోదించాయి.

జలవనరుల మంత్రుల తొలి సమావేశం...

     బ్రిక్స్‌ దేశాలు రూపొందించుకున్న కౌంటర్‌ టెర్రరిజం యాక్షన్‌ ప్లాన్‌కు ఆమోదం లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఐదు దేశాల కస్టమ్స్‌ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యం సులభతరంమవుతోందన్నారు. తాజా సమావేశం బ్రిక్స్‌ చరిత్రలో తొలి డిజిటల్‌ సదస్సని గుర్తు చేశారు. 2021, నవంబర్‌లో బ్రిక్స్‌ దేశాల జలవనరుల మంత్రుల తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. బ్రిక్స్‌ చైర్మన్‌గా ప్రస్తుతం భారత్‌ వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

 

 

14. 14 - CHINA