1) భారత్-చైనా యుద్ధం
– ప్రారంభం- 1962, అక్టోబర్ 20
-ముగింపు- 1962, నవంబర్ 21
– కారణం- జమ్ముకశ్మీర్ (ప్రస్తుత లఢక్)లోని ఆక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ దురాక్రమణ చేయడం.
-ఫలితం- చైనా సైన్యం విజయం. ఆక్సాయ్‌చిన్ ఆక్రమణ. ఈ యుద్ధం తరువాత రెండు
దేశాల మధ్య ఊహాజనిత సరిహద్దు రేఖగా వాస్తవాధీన రేఖ (Line of Actual
Control)ను ఏర్పాటు చేశారు.
2) నాథులా వివాదం
-దీనినే భారత్, చైనా యుద్ధం-1967 అని పిలుస్తారు.
– 1967, ఆగస్ట్ లో చైనా సైన్యం నాథులా పాస్ వద్ద చొరబడింది. దీంతో ఘర్షణ
ప్రారంభమై 1967, సెప్టెంబర్ 15 వరకు కొనసాగింది. సుమారు 400 మంది చైనా
సైనికులు ఈ ఘర్షణలో చనిపోయారు.
-ఇది చైనాకు పెద్ద ఎదురుదెబ్బ.
3) చో లా వివాదం
-చో లా పాస్ సిక్కిం రాష్ట్రాన్ని చైనాలోని టిబెట్ ప్రాంతంలో కలుపుతుంది.
– 1967, అక్టోబర్ 1న చైనా దళాలు చో లా కనుమ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా క్లెయిమ్ చేసి ఘర్షణలకు దిగింది.
– ఈ సంఘటనలో 83 మంది భారత సైనికులు చనిపోయారు.
4) అరుణాచల్‌ప్రదేశ్ వివాదం-1987
-1986లో అరుణాచల్‌ప్రదేశ్‌కు భారత్ రాష్ట్రహోదా ఇచ్చినప్పుడు చైనా నిరసన వ్యక్తం చేసింది.
– అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగం అని వాదిస్తూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని
సమ్‌డోరాంగ్ చు లోయలోకి ప్రవేశించి హెలిప్యాడ్‌లు, శాశ్వత నిర్మాణాలు
నిర్మించడం ప్రారంభించింది.
-ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి భారతసైన్యం ‘ఆపరేషన్ ఫాల్కన్ (Ope ration Falcon)ను ప్రారంభించింది.
-చైనా సైన్యం వెనక్కి తగ్గేంతవరకు భారతసైన్యం సరిహద్దుల్లోనే మోహరించింది.
-ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మొదటి అధికారిక సమావేశం జరిగింది.
-చర్చలకు రెండు దేశాలూ అంగీకరించాయి.
– ఈ ఘటన 1993 ఒప్పందానికి దారితీసింది.
1993 ఒప్పందం
-అప్పటి భారత ప్రధాని పీవీ నర్సింహారావు, చైనా అధ్యక్షుడు లీ పెంగ్‌ల మధ్య 1993, సెప్టెంబర్ 7న ‘సరిహద్దు శాంతి, ప్రశాంతత ఒప్పందం (Border Peace and Tranquility Agreement)’ జరిగింది.
-ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌ఏసీ పశ్చిమ, తూర్పు, మధ్య సెక్టార్ల కచ్చితమైన స్థానాలు గుర్తించారు.
-ఇరుపక్షాలు 15,000 మంది కంటే ఎక్కువ మందితో సైనిక విన్యాసాలు నిర్వహించకూడదు.
భారత్-చైనా ఒప్పందం-1996
– అప్పటి చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది.
-ఇది చైనా అధ్యక్షుడి తొలి భారత పర్యటన.
-ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మ్యాపుల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది.
5) డెప్సాంగ్ ఘర్షణలు (Depsang Disputes) -2013
-ఈ ఘర్షణలు లఢక్ ప్రాంతంలోని దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీవో) వద్ద జరిగాయి.
– 2013, ఏప్రిల్ 15న డీబీవో సమీపంలోని రాఖీనులా ప్రాంతం వద్ద శాశ్వత శిబిరాలను చైనా సైన్యం నిర్మించడంతో ఘర్షణలు జరిగాయి.
6) చుమార్ ఘర్షణ (Chumar Dispute)- 2014
-చుమార్ ప్రాంతం వద్ద చైనా ఒక హైవేను నిర్మించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది.
-భారత్ తీవ్రంగా ప్రతిఘటించడంతో చైనా హైవే నిర్మాణాన్ని నిలిపివేసింది.
7) డోక్లాం ఘర్షణ (Doklam Dispute)- 2017
– డోక్లాం అనేది భూటాన్‌లోని ఒక పీఠభూమి ప్రాంతం.
-ఇది భారత్, చైనా, భూటాన్‌లకు అత్యం త వ్యూహాత్మక ప్రదేశం.
-ఇది భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే సిలిగురి ప్రాంతం (Chicken Neck)ను రక్షించే ప్రధాన భూభాగం.
-చైనా ప్రతిష్ఠాత్మక వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా, డోక్లాం మీదుగా రోడ్డు నిర్మాణాలను చేపట్టింది చైనా.
-దీంతో భారత్ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో 73 రోజుల పాటు ప్రతిష్టంభన జరిగింది.
8) 2020- గల్వాన్ లోయ, పాంగాంగ్ త్సో సరస్సు ఘర్షణలు (Galwan Valley Disputes)
-పాంగాంగ్ త్సో సరస్సు (గల్వాన్ లోయ) వద్ద ఇరుదేశాల సైనికులు పరస్పరం ఘర్షణలకు దిగడంతో (2020, మే 5) యుద్ధ వాతావరణం నెలకొంది.
– భారత సైనికులు 20 మంది, చైనా సైనికులు 40 మంది మరణించినట్లు అంచనా.
-2020, జూన్ 16 వరకు ఈ ఘర్షణలు కొనసాగాయి.
9) అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా నామకరణం
-2020, డిసెంబర్ 30న అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా తమ పేర్లను పెట్టింది.
– అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగమంటూ, దానిని ‘జన్‌గ్నాన్’ పేరుతో పిలుస్తున్నట్లు చైనా వాదిస్తుంది.
– ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలున్నాయి. అవి.. 1) సెంగ్కెజాంగ్ 2)
దాగ్లుంగ్ జాంగ్, 3) మునిగాంగ్ 4) డుడింగ్, 5) మిగ్‌పెయిన్
6) గోలింగ్, 7) డంబా 8) మెజాగ్
-నాలుగు పర్వతాలకు వామో రి, డు రి, లన్‌జుబ్ రి, కున్‌మింగ్ జింగ్ పెంగ్ అని పేర్లు పెట్టింది.
– రెండు నదులకు జెన్‌యోగ్మీ, దులైని అని, ఒక పర్వత మార్గానికి ‘సె లా’ అని పేరు పెట్టింది.
-గతంలో 2017లోనూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు తమ పేర్లను పెట్టింది చైనా.