స్వభావం
– భారత ఆర్థిక సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ, అర్ధన్యాయ వ్యవస్థ (Quosi Federal)
– ఇది ఒక సలహా సంస్థ (Advisory Boards)
-భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కాబట్టి సమాఖ్యలో ఆర్థిక వనరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయాలి.
-ప్రభుత్వ ఆదాయ వనరుల విషయంలో కేంద్రం.. రాష్ట్రాల మధ్య (Verticle),
రాష్ట్రాలు-రాష్ట్రాల మధ్య (Horizontal) అనేక వ్యత్యాసాలు ఉన్నాయి.
-వీటిని దృష్టిలో ఉంచుకొని వనరులను పునః పంపిణీ చేయడానికి రాజ్యాంగ నిర్మాతలు ‘ఆర్థిక సంఘాన్ని’ ఏర్పాటు చేశారు.
-ప్రపంచంలో ఏ సమాఖ్య వ్యవస్థలోనూ ఇలాంటి అధికారాలతో ఏర్పడిన మరో సంస్థ లేదు.
-ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని రాజ్యాంగంలో
ఎక్కడా పేర్కొనలేదు. కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం నిర్ణయం
తీసుకోవచ్చు.
-సాధారణంగా ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేస్తారు. ఆర్థిక సంఘం సిఫారసు లను
అమలు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించే అధికారం రాష్ట్రాలతో పాటు మరెవరికీ
లేదు.
ఆర్థిక సంఘం నిర్మాణం
– ఆర్థిక సంఘం బహుళ సభ్యసంఘం.
– దీనిలో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరి నియామకానికి సంబంధిం
చిన అర్హతలు, ఎంపిక చేసే విధానాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది.
-పార్లమెంట్ ఆర్థిక సంఘ చట్టం (ఇతర నిబంధనలు)-1951 (Finance Co mmission Miscellaneous Provi sions) Act-1951)ని రూపొందించింది.
-దీనిలో ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యుల నియామకం, అర్హతలు, అనర్హతలు, పదవీకాలం, అధికారాలు లాంటి అంశాలను పేర్కొన్నారు.
రాజ్యాంగ హోదా
– రాజ్యాంగంలోని XIIవ భాగంలో 280 నుంచి 281 వరకు ఉన్న నిబంధనలు ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం, విధులు, సిఫారసులను సమర్పించడం లాంటి అంశాలను వివరిస్తుంది.
నియామకం-అర్హతలు
-ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
-అవసరమని భావించినప్పుడు రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇది ఒక తాత్కాలిక సంస్థ.
ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా ప్రజావ్యవహారాల్లో అనుభవం ఉన్నవారిని నియమిస్తారు.
పలు రంగాలకు చెందిన నలుగురిని సభ్యు లుగా నియమిస్తారు.
ఎ) హైకోర్ట్ న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి నియామకానికి అర్హతగల వ్యక్తి.
బి) ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, అకౌంట్ల నిర్వహణలో ప్రత్యేక అనుభవం ఉన్న వ్యక్తి.
సి) ఆర్థిక వ్యవహారాలు, పాలనా నిర్వహణ లో విస్తృత అనుభవం ఉన్న వ్యక్తి.
డి) అర్థశాస్త్రంలో ప్రత్యేక అనుభవం ఉన్న వ్యక్తి.
పదవీకాలం
– ఆర్థిక సంఘం శాశ్వత సంస్థ కాదు. కాబట్టి దీనికి నిర్ణీత పదవీకాలం ఉండదు.
-ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యులు నియా మక పత్రంలో రాష్ట్రపతి ప్రత్యేకంగా పేర్కొన్న కాలం వరకు విధులను నిర్వహిస్తారు.
– నిర్దేశించిన కాల పరిమితిలోపల నివేదికను సమర్పించాలి.
-ఒకసారి ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తిని తిరిగి ఆ పదవిలో నియమించవచ్చు.
-ఆర్థిక సంఘం సభ్యుడు రాజీనామా చేయా లంటే తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి పేరుమీద రాసి రాష్ట్రపతికి సమర్పించాలి.
-ఆర్థిక సంఘంలోని సభ్యులు పూర్తికాలం లేదా పాక్షిక కాలం రాష్ట్రపతి కోరిన విధంగా విధులను నిర్వహిస్తారు.
-ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యుల జీతభత్యా లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ప్రత్యేక అధికారాలు
-భారత ఆర్థిక సంఘం అర్ధ న్యాయ సంస్థ. కాబట్టి విధి నిర్వహణలో సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు దీనికి ఉంటాయి.
-భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి లేదా సంస్థనైనా సాక్ష్యంగా తన ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీచేయ గలరు.
-తనకు కావాల్సిన పత్రాలను (Docume nts) సమర్పించాలని ఆదేశించగలరు.
-ప్రభుత్వ రికార్డులు ఇవ్వాలని ఏ కోర్టును లేదా ప్రభుత్వ కార్యాలయాన్నయినా కోరవచ్చు.
విధులు
-రాజ్యాంగంలోని నిబంధన 280 (3) ప్రకారం కింది అంశాలకు సంబంధించి తగిన సూచనలు చేయాలి.
1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ అయ్యే లేదా పంపిణీ చేయాల్సిన
పన్నుల (డివిజబుల్ పూల్) నికర రాబడులను, కేంద్రం, రాష్ట్రాలకు
కేటాయించడానికి అను సరించాల్సిన మార్గదర్శక సూత్రాలను సిఫారసు చేయడం.
2) భారత సంఘటిత నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు
ఇవ్వాల్సిన సహాయక గ్రాంటులను ఇవ్వడానికి తగిన నియమాలను సూచించడం (275వ
రాజ్యాంగ నిబంధన
3) రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాల్లోని
పంచాయతీ ల ఆర్థిక వనరులను పెంచేందుకు తగిన సిఫారసులు చేయడం (73వ రాజ్యాంగ
సవరణ చట్టం)
4) రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాల్లోని మున్సిపాలిటీలకు
మరిన్ని ఆర్థిక వనరులను అందజేయడానికి, రాష్ట్ర సంఘటిత నిధిని పెంచడానికి
అవసరమైన చర్యలను సూచించడం (74వ రాజ్యాంగ సవరణ చట్టం)
5) భారత దేశ ఆర్థిక, స్థిరత్వ సాధన కోసం రాష్ట్రపతి కోరిన అంశంపై తగిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను రూపొందిం చడం
-15వ ఆర్థిక సంఘం 2020-21 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర నివేదికను ఇస్తూ 41 శాతం వాటాను రాష్ట్రాలకు సిఫారసు చేసింది.
-తాజాగా రానున్న 5 ఏండ్లకు కూడా 41 శాతం వాటాను సిఫారసు చేసింది. దీని
ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ. 42.2 లక్షల కోట్లను రాష్ట్రాలకు పంచనుంది.
-మొత్తం రాష్ట్రాలకు రూ. 2,94,514 కోట్లను రెవెన్యూ లోటు గ్రాంటుగా సిఫారసు చేసింది.
15వ ఆర్థిక సంఘం
ఆర్థిక సంఘం చైర్మన్ ఏర్పాటైన ఏడాది కాలం
1 కేసీ నియోగి 1951 -1952-57
2 కే సంతానం 1956 – 1957-62
3 ఏకే చందా 1960 1962-66
4 రాజమన్నార్ 1964 1966-69
5 మహావీర్ త్యాగి 1968 1969-74
6 కే బ్రహ్మానంద రెడ్డి 1973 1974-79
7 జేఎం షేలత్ 1977 1979-84
8 వైబీ చవాన్ 1982 1984-89
9 ఎన్‌కేపీ సాల్వే 1987 1989-95
10 కేసీ పంత్ 1992 1995-2000
11 ఏఎం ఖుస్రో 1998 2000-05
12 సీ రంగరాజన్ 2002 2005-10
13 కే విజయ్, ఎల్ కేల్కర్ 2007 2010-15
14 వైవీ రెడ్డి 2013 2015-20
15 ఎన్‌కే సింగ్ 2017 2021-26