వివిధ రసాయనాల ఉపయోగాలు

 

  • ఐరన్ ఆక్సైడ్ -  టేపు రికార్డర్ టేపుపై పూత కోసం
  • హైపో - దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్‌ను తొలగించడానికి
  • సల్ఫర్ - రబ్బరును వల్కనైజ్ చేసి సాగే గుణాన్ని పెంచడానికి
  • సోడియం బై కార్బొనేట్ - ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి
  • టెఫ్లాన్ - పదార్థాలు అంటకోకుండా గిన్నెలకు పూతపూయడానికి
  • మిథైల్ ఆల్కహాల్ - శుద్ధ ఆల్కహాల్‌ను తాగకుండా నిరోధించడానిక
  • సోడియం కార్బొనేట్ - నీటిలో శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి
  • కాల్షియం హైడ్రాక్సైడ్ - నీటిలో తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి
  • పొటాష్ ఆలం - గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు, మురికి నీటిని తేర్చి స్వచ్ఛంగా మార్చడానికి
  • సోడియం హైపోక్లోరైట్ - దుస్తులపై కాఫీ మరకలు తొలగించడానికి
  • సోడియం పెంటథాల్ - నిజ నిర్ధారణ పరీక్ష కోసం
  • సోడియం హైడ్రాక్సైడ్ - నూలును మెర్సిరైజ్ చేసి తెల్లగా మార్చడానికి
  • సోడియం ఫ్లోరైడ్ - దంతాల్లో పింగాణి ఏర్పడేందుకు
  • రసరాజం - బంగారాన్ని కరిగించడానికి
  • సిలికాజెల్ - మందు సీసాల్లో తేమను గ్రహించడానికి
  • ఆగ్జాలిక్ ఆమ్లం/ నిమ్మరసం - వస్త్రాలపై తుప్పు, సిరా మరకల్ని తొలగించడానికి
  • కార్బన్ డై ఆక్సైడ్ - మంటల్ని ఆర్పడానికి
  • కాల్షియం హైడ్రాక్సైడ్ - ఇళ్ళకు వెల్లవేసేందుకు
  • పొటాషియం డైక్రోమేట్ - మద్యం తాగిన డ్రైవర్‌ని గుర్తించడానికి
  • గ్రాఫైట్ - భారీ యంత్రాల్లో మృదుత్వం కోసం కందెనగా వాడటానికి
  • ఇథిలీన్ - పచ్చి కాయల్ని పండించడానికి
  • ద్రవ నైట్రోజన్ - పశువుల వీర్యాన్ని నిల్వ చేయడానికి
  •  హైడ్రోజన్ పెరాక్సైడ్ - సిల్కు, ఉన్ని వస్త్రాలను విరంజనం చేయడానికి
  • ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్ - పచ్చళ్లను దీర్ఘకాలం నిల్వ చేయడానికి
  •  భారజలం - అణురియాక్టర్లలో న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి
  •  ఇథిలీన్ గ్త్లెకాల్, గ్లిజరాల్ - కారు కార్బొరేటర్‌లో యాంటిఫ్రీజ్‌గా
  • ఎసిటిలీన్ - ఆక్సిజన్‌తో పాటు గ్యాస్ వెల్డింగ్‌లో మంటకోసం
  •  నిన్‌హైడ్రిన్ - కాగితంపై వేలిముద్రలను స్పష్టంగా గుర్తించడానికి
  •  సబ్బుద్రావణం - నీటి కాఠిన్యాన్ని గుర్తించడానికి
  •  ఓజోన్ - మినరల్ వాటర్ తయారీలో బ్యాక్టీరియాను చంపేందుకు
  •  సిల్వర్ అయోడైడ్ - కృత్రిమ వర్షాలకోసం, మేఘమథనం చేయడానికి
  •  ఫ్రియాన్ - రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణకు
  •  ఫినాల్ ఫార్మాల్డిహైడ్ - టెలిఫోన్ పెట్టెల తయారీకి
  •  బ్లీచింగ్ పౌడర్ - తాగే నీటిలో బ్యాక్టీరియాను చంపడానికి
  •  అనార్ధ్ర కాపర్ సల్ఫేట్ - పదార్థాల్లో తేమను గుర్తించడానిక
  • గ్లిజరిన్ - సబ్బు తయారీలో
  •  క్లోరాల్ హైడ్రేట్ - కల్తీ కల్లులో నురగకు కార్బన్ బ్లాక్ - నల్లని ప్రింట్ సిరా తయారీకి
  • హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం - గాజుపై అక్షరాల్ని రాయడానికి
  • సిట్రనెల్లాల్ - శీతల పానియాల్లో నిమ్మవాసనకు
  • క్లోరోఫాం - మత్తు ఇవ్వడానికి/ స్పృహ లేకుండా చేయడానికిపొటాషియం స్టియరేట్ - షేవింగ్ సబ్బులో నురగ ఏర్పరచడానికి.