ECONOMY PRACTICE BITS 2

  1. జాతీయాదాయ వృద్ధిరేటు నుంచి జనాభా వృద్ధిరేటును తీసివేస్తే ఏం పొందవచ్చు?
    1) వ్యయార్హ ఆదాయ వృద్ధిరేటు
    2) నికర జాతీయోత్పత్తి వృద్ధిరేటు
    3) తలసరి ఆదాయ వృద్ధిరేటు
    4) వాస్తవిక ఆదాయ వృద్ధిరేటు
  2. హారడ్‌-డోమర్‌ నమూనాలో సమతులవృద్ధి దేనిపై ఆధారపడి ఉంటుంది?
    1) పొదుపు రేటు & జనాభా వృద్ధిరేటు
    2) వడ్డీరేట్లు & ద్రవ్యోల్బణం
    3) పొదుపు రేటు& ఉత్పత్తి మూలధన రేటు
    4) జాతీయాదాయం వృద్ధిరేటు & జనాభా వృద్ధిరేటు
  3. కింది వాటిలో అమర్త్యసేన్‌ రచన?
    1) ప్లానింగ్‌ అండ్‌ ద పూర్‌
    2) చాయిస్‌ ఎకనామిక్స్‌ అండ్‌ టెక్నిక్స్‌
    3) వెల్ఫేర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ టెక్నిక్స్‌
    4) ప్లాన్‌డ్‌ ఎకానమీ ఫర్‌ ఇండియా
  4. 1991 సంస్కరణల తరువాత అమలైన నూతన ఆర్థిక విధానంలో మన దేశం కింది వాటిలో దేనిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది?
    1) బ్యాంకింగ్‌ రంగం
    2) ఎగుమతులను ప్రోత్సహించడం
    3) దిగుమతి ప్రత్యామ్నాయాలు
    4) స్వయం సమృద్ధి సాధించడం
  5. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన కింది వ్యాఖ్యలను గమనించండి?
    ఎ. ఒక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన రేటును చెల్లించాలి
    బి. మహిళ, పురుష కూలీలకు సమాన వేతన రేటును చెల్లించాలి
    సి. ఈ పథక లబ్ధిదారుల్లో మూడో వంతు కూలీలు స్త్రీలై ఉండాలి
    డి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు మాత్రమే ఉపాధిని కల్పించాలి
    1) సి, డి, ఎ 2) డి, ఎ, బి
    3) ఎ, బి, సి 4) బి, సి, డి
  6. జతపర్చండి
    పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం
    ఎ. 9వ 1. భారీ పరిశ్రమల అభివృద్ధి
    బి. 8వ 2. పేదరిక నిర్మూలన
    సి. 5వ 3. సమ్మిళిత వృద్ధి
    డి. 2వ 4. మానవ వనరుల అభివృద్ధి
    1) ఎ-4, బి-2, సి-3, డి-1
    2) ఎ-1, బి-2, సి-4, డి-3
    3) ఎ-2, బి-3, సి-1, డి-4
    4) ఎ-3, బి-4, సి-2, డి-1
  7. జాతీయాదాయంపై గల కింది వివరణల్లో ఏది సరైనది?
    1) అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి
    2) రెండు సార్లు లెక్కించడం, బదిలీ చెల్లింపులు, అప్పులు, దిగుమతులు జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి
    3) జాతీయాదాయంలో అద్దెలు, పన్నులు, పింఛన్లు, సబ్సిడీలు భాగంగా ఉంటాయి
    4) ప్రభుత్వరంగ వ్యయం,
    ఎన్నికల వ్యయం, న్యాయవ్యవస్థ వ్యయం జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి
  8. జతపర్చండి
    ఎ. KVIC 1. 1980
    బి. CAPART 2. 1956
    సి. DIC 3. 1986
    1) ఎ- 2, బి-3, సి-1
    2) ఎ-2, బి-1, సి-3
    3) ఎ-1, బి-3, సి-2
    4) ఎ-3, బి-2, సి-1
  9. మాల్థస్‌ ప్రకారం ఆహార ధాన్యాల పెరుగుదల రేటు అంకగణిత శ్రేణిలో ఉంటే జనాభా పెరుగుదల రేటు ఏ శ్రేణిలో ఉంటుంది?
    1) అంకగణిత శ్రేణి
    2) స్థిరంగా ఉంటుంది
    3) హరాత్మక శ్రేణి
    4) గుణాత్మక శ్రేణి
  10. అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలకు సంబంధించి సరికానిది ఏది?
    1) జనాభా వృద్ధిరేటు తగ్గుతూ ఉంటుంది
    2) అవస్థాపనా సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి
    3) బ్యాంకింగ్‌ వ్యవస్థ విస్తరిస్తూ ఉంటుంది
    4) వ్యవసాయం మీద ఆధారపడిన జనాభా పెరుగుతూ ఉంటుంది

 

1-3,     2-3,     3-2,     4-2,     5-3, 

6-4,     7-1,     8-1,     9-4,     10-2