GEOGRAPHY PRACTICE BITS 5

 

  1. టైగా ప్రాంతంలో ఎలాంటి శీతోష్ణస్థితి ఉంటుంది?
    1) దీర్ఘమైన శీతాకాలం
    2) దాదాపు 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉష్ణోగ్రత ఘనీభవన స్థానం. అంటే 00 కంటే తక్కువగా ఉండటం
    3) శీతాకాలంలో మంచు విపరీతంగా ఉంటుంది
    4) పైవన్నీ
  2. వలస రాజ్యస్థాపన జరగని ఆగ్నేయాసియా దేశం?
    1) ఇండోనేషియా 2) థాయిలాండ్‌
    3) లావోస్‌ 4) మలేషియా
  3. చైనాలోని తక్లమకాన్‌ ఏడారి పీఠభూమి ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది?
    1) కున్‌లున్‌- హిమాలయాలు
    2) కారకోరం- హిమాలయాలు
    3) జాగ్రోస్‌- ఎల్‌బ్రజ్‌
    4) టియాన్‌షాన్‌-కున్‌లున్‌
  4. గోల్డ్‌కోస్ట్‌ అని ఏ దేశ తీరాన్ని పిలుస్తారు?
    1) లైబీరియా 2) నైజీరియా
    3) ఘనా 4) ఐవరీ కోస్ట్‌
  5. ‘బెర్ముడా ట్రయాంగిల్ ఏయే ప్రాంతాల మధ్య ఉంది?
    1) బెర్ముడా దీవి, ఫ్లోరిడా, పోర్టోరికా దీవులు
    2) బెర్ముడా, జమైకా, పోర్టోరికా దీవులు
    3) బెర్ముడా, ఏంటలీస్‌, పోర్టోరికా
    4) బెర్ముడా, ఏంటలీస్‌, కరోలినా
  6. ప్రపంచంలో పొడవైన శాండ్‌బార్‌ (ఇసుకతిన్నె) ఏది?
    1) ఫండి 2) బఫిన్‌
    3) చెస్పాక్‌ 4) ఏదీకాదు
  7. ‘ఘోస్ట్‌ టౌన్‌’ అని దేనిని పిలుస్తారు?
    1) సావోపాలో 2) ఆరికా
    3) శాంటియాగో 4) లాపాస్‌
  8. యూరప్‌, ఆఫ్రికాను వేరుచేస్తున్న సముద్రం?
    1) మధ్యధరా 2) బాల్టిక్‌
    3) ఏడ్రియాటిక్‌ 4) నల్లసముద్రం
  9. ఐరోపా క్రీడామైదానంగా ఏ దేశాన్ని పిలుస్తారు?
    1) బోస్నియా 2) ఇటలీ
    3) స్విట్జర్లాండ్‌ 4) క్రియా
  10. ప్రపంచంలో అత్యంత పొడి ప్రాంతం?
    1) ఆరికా 2) అల్‌అజీజియా
    3) మృతలోయ 4) ఏదీకాదు
  11. కింబర్లి పీఠభూమి ఏ ఖండంలో ఉంది?
    1) ఆఫ్రికా 2) ఆసియా
    3) ఆస్ట్రేలియా 4) ఐరోపా
  12. ప్రపంచంలో కెల్లా లోతైన కందకం?
    1) ఉత్తర అమెరికా సముద్రం
    2) పసిఫిక్‌ సముద్రం
    3) అరేబియన్‌సముద్రం
    4) అట్లాంటిక్‌ సముద్రం
  13. కింది వాటిలో ఏది భూగోళానికి సంబంధించిన దానిని రుజువు చేయలేనిది?
    1) చంద్రుని ద్రవ్యరాశి సూర్యుని కంటే అధికమైనది
    2) చంద్రుని గురుత్వాకర్షణ శక్తి సూర్యుని కంటే భూమిపైనే ఎక్కువ
    3) చంద్రుని పోటు ఉత్పత్తిచేసే శక్తి సూర్యుని కంటే అధికమైనది
    4) ఏదీకాదు
  14. ఈతకొట్టడం ఏ నీటిలో తేలిక?
    1) నదీ జలాలు 2) కొలనులు
    3) సముద్ర జలాలు 4) కాలువలు
  15. సముద్రపు నీటిలో అధికంగా ఉండే లవణాలు వరుసగా?
    1) సోడియం క్లోరైడ్‌, మెగ్నీషియం క్లోరైడ్‌, మెగ్నీషియం సల్ఫేట్‌
    2) మెగ్నీషియం సల్ఫేట్‌, మెగ్నీషియం క్లోరైడ్‌, సోడియం క్లోరైడ్‌
    3) మెగ్నీషియం బ్రోమైడ్‌, మెగ్నీషియం క్లోరైడ్‌, సోడియం క్లోరైడ్‌
    4) ఏదీకాదు

1-4,     2-2,     3-4,    4-3,    5-1
6-3,     7-2,     8-1,    9-3,    10-1
11-3 ,     12-2,     13-1,    14-3,    15-1