GEOGRAPHY PRACTICE BITS 4

 


  1. ఒయాసిస్‌ ఏర్పడటానికి కారణం?
    1) హిమానీనద ఉపసంహరణ
    2) వర్షపునీటి వల్ల ఎడారిలో గొయ్యి నిండటం
    3) ఎడారిలో భూతలం వరకూ జరిగే పవన క్రమక్షయం
    4) ఏదీకాదు
  2. ‘షాడుఫ్‌’ అంటే?
    1) నాగలి వంటి సాధనం
    2) ఎడారి ప్రాంతాల్లో నీటిపారుదలకు ఉపయోగించే జలయంత్రం
    3) ఒయాసిస్‌ చుట్టుపక్కల ఏర్పరుచుకొనే ఆవాసాలు
    4) ఏదీకాదు
  3. ‘సమశీతోష్ణ మండల గడ్డిభూములు’ ఏయే అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి?
    1) భూమధ్యరేఖకు ఇరువైపులా 400 నుంచి 550 అక్షాంశాలు
    2) భూమధ్యరేఖకు ఇరువైపులా 200 నుంచి 300 అక్షాంశాలు
    3) భూమధ్యరేఖకు ఇరువైపులా 300 నుంచి 400 అక్షాంశాలు
    4) భూమధ్యరేఖకు ఇరువైపులా 250 నుంచి 350 అక్షాంశాలు
  4. ‘కిర్‌గిజ్‌’ తెగ ఏ ప్రాంతంలో ఉన్నారు?
    1) ఆఫ్రికాలోని వెల్డ్‌ భూముల్లో
    2) ఆస్ట్రేలియాలోని డౌన్స్‌ భూముల్లో
    3) ఆసియాలోని స్టెప్పీ ప్రాంతం
    4) అమెరికాలోని ప్రయరీ భూముల్లో
  5. ప్రపంచ ధాన్యాగారాలు అని ఏ గడ్డిభూములను పిలుస్తారు?
    1) ఉష్ణమండల గడ్డిభూములు
    2) సమశీతోష్ణమండల గడ్డిభూములు
    3) టండ్రా మండల గడ్డిభూములు
    4) భూమధ్యరేఖ మండల గడ్డిభూములు
  6. దక్షిణాఫ్రికాలోని ‘విట్‌వాటర్స్‌ రాండ్‌ ’ దేనికి ప్రసిద్ధి?
    1) వజ్రాలు
    2) ఇనుపధాతువులు
    3) సహజవాయువులు
    4) బంగారం
  7. మధ్యధరా శీతోష్ణస్థితికి గల మరొక పేరు?
    1) వెచ్చని శీతాకాలపు,
    శీతల సమశీతోష్ణ మండలం
    2) తడి, వేసవి, వెచ్చని
    సమశీతోష్ణ మండలం
    3) శుష్క వేసవి,
    ఉపఅయనరేఖా మండలం
    4) ఏదీకాదు
  8. మధ్యధరామండలం శీతోష్ణస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం?
    1) శీతోష్ణస్థితిలో సంభవించే మార్పులు
    2) వ్యాపార పవన మేఖలలో ఉండటం
    3) ఇప్పటివరకు సరైన కారణం లేదు
    4) పవన మేఖల స్థానచలనం
  9. ఆసియా ఖండంలో మధ్యధరా శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాలేవి?
    1) ఇజ్రాయెల్‌ 2) సిరియా
    3) లెబనాన్‌ 4) పైవన్నీ
  10. మధ్యధరా ప్రాంతంలోని శీతాకాలంలో వర్షపాతం వేటినుంచి లభిస్తుంది?
    1) తిరోగమన పశ్చిమపవనాలు
    2) అపతీర పశ్చిమ పవనాలు
    3) తిరోగమన వ్యాపార పవనాలు
    4) పైవన్నీ
  11. ‘ఫాన్‌ వెచ్చని పవనం’ఏ మధ్యధరా దేశంలో వీస్తుంది?
    1) సిరాకో 2) మిస్ట్రల్‌
    3) బోరా 4) బెర్గ్స్‌
  12. ట్యూనా చేపలు ఎక్కువగా లభించే ప్రాంతం?
    1) ఆస్ట్రేలియా దక్షిణ తీరం
    2) కాలిఫోర్నియా
    3) లిబియా తీరం
    4) స్పెయిన్‌ తీరం
  13. ‘విటికల్చర్‌’ అంటే?
    1) ద్రాక్షాతోటల పెంపకం
    2) సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
    3) ఆలివ్‌నూనె తయారీ పద్ధతి
    4) ఏదీకాదు
  14. టండ్రా శీతోష్ణస్థితి కలిగి ఉన్న ప్రాంతాలు ఏవి?
    1) అలస్కా 2) గ్రీన్‌లాండ్‌
    3) సైబీరియా, స్కాండినేవియా
    4) పైవన్నీ
  15. ‘కయాక్‌’ లు లేక‘ఉమాయిక్‌’ లు అంటే ఏమిటి?
    1) టండ్రా ప్రాంతంలో నివసించే ఒక తెగ
    2) టండ్రా ప్రాంతంలోని
    ప్రజలు ఉపయోగించే పడవలు
    3) టండ్రా ప్రాంత ప్రజలు
    నివసించే గృహాలు
    4) టండ్రా ప్రాంత ప్రజలు
    ఉపయోగించే పనిముట్లు

1-4,     2-2,     3-1,    4-3,    5-2,

6-4,     7-3,     8-4,    9-4,    10-1

11-3,     12-2,     13-1,    14-4,    15-2