HISTORY PRACTICE BITS 11

1. అక్బర్ కాలంలో తోడర్‌మల్లు ప్రవేశపెట్టిన బందోబస్తుకు ప్రాతిపదిక ఏమిటి?
ఎ. షేర్‌షా రెవెన్యూ బందోబస్తు
బి. అల్లావుద్దీన్ ఖల్జీ రెవెన్యూ వ్యవస్థ
సి. రాజపుత్ర పాలకుల రైత్వారీ వ్యవస్థ
డి. పైవన్నీ
సమాధానం: ఎ

2. అతని ప్రసిద్ధ సంస్థలు, భావనాపరంగా మౌఖికమైనవీ కావు అని ఎలియట్, ఎవరిని ఉద్దేశించి పేర్కొన్నాడు?
ఎ. షేర్‌షా
బి. అక్బర్
సి. జహంగీర్
డి.షాజహాన్
సమాధానం: బి

3. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలోని నాలుగు శక్తివంతమైన దక్షిణ భారతదేశ రాజ్యాలలో ఒకటి కానిది ఏది?
ఎ. దేవగిరి యాదవ రాజ్యం
బి. కంచి పల్లవులు
సి. వరంగల్లు కాకతీయ సామ్రాజ్యం
డి. ద్వారసముద్రం హోయసలలు
సమాధానం: బి

4. భారతదేశంలో మొట్టమొదటి బంగారు నాణేలు జారీచేసిన వారెవరు?
ఎ. మౌర్యులు
బి. హర్యాంకులు
సి. ఇండో- బాక్ట్రియన్‌లు
డి. కుషాణులు
సమాధానం: డి

5. ధర్మ గంటను ఏర్పాటు చేసిన మొగల్ రాజు?
ఎ. అక్బర్
బి. జహంగీర్
సి. షాజహాన్
డి. ఔరంగజేబు
సమాధానం: బి

6. మొగల్ వాస్తు శిల్పంంలో పీత్రీదురా అంటే గట్టి, విలువైన రాళ్లను పొదిగే పని ఎవరి కాలంలో ప్రారంభమైంది?
ఎ. అక్బర్
బి. జహంగీర్ తొలి పాలనా కాలంలో
సి. జహంగీర్ పాలనాకాలం చివరలో
డి. షాజహాన్ కాలంలో
సమాధానం: సి

7. సతీసహగమనానికి అతి ప్రాచీన సాక్ష్యాధారం ఎందులో లభిస్తుది?
ఎ. నానాఘాట్ శాసనం
బి. ఎరాన్ శాసనం
సి. ముద్ర రాక్షసం
డి. హర్ష చరితం
సమాధానం: ఎ

8. ఇప్పటివరకు కనుగొన్న 1000కి పైగా సింధు నాగరికత స్థలాల్లో కేవలం ఆరింటిని మాత్రమే నగరాలుగా పరిగణించడమైంది. కింద పేర్కొన్న స్థలాల్లో వాటిలో ఒకటి కానిది ఏది?
ఎ. బన్వాలి
బి. రోపార్
సి. కాలిబంగన్
డి. లోథల్
సమాధానం: బి

9. కింది తెగలలో రుగ్వేదంలో పేర్కొనని తెగ ఏది?
ఎ. యదులు
బి. పాంచాలులు
సి. పురులు
డి. ద్రుహులు
సమాధానం: బి

10. గుప్తుల పరిపాలనలో ప్రధాన లక్షణం ఏది?
ఎ. ఎన్నో కొత్త పదవులను సృష్టించడం
బి. సువ్యవస్థితమైన ఉద్యోగస్వామ్యం
సి. వికేంద్రీకరణ
డి. కేంద్రీకరణ
సమాధానం: సి