HISTORY PRACTICE BITS 12

 1. గుప్తుల పూర్వకాలంలో మహాసేథి అనే వారు ఎవరు?
ఎ. హస్తకళల సమాఖ్య నాయకుడు
బి. వాణిజ్య సమాఖ్య అధ్యక్షుడు
సి. వ్యాపార బిడారుల నాయకుడు
డి. వ్యాపార నౌక కెప్టెన్
సమాధానం: బి

2. భారతదేశంలో చిస్తి శాఖను ఏర్పాటు చేసిన వారెవరు?
ఎ. నిజామ్-ఉద్-దిన్-ఔలియా
బి. ఫరీద్-ఉద్-దివ్‌గంజ్-ఇన్-షికార్
సి. షేక్ మౌలునుద్దీన్ చిస్తి
డి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి
సమాధానం: డి

3. ఏ విషయానికి సంబంధించి షాజహాన్ పాలనాకాలన్ని మధ్యయుగ భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు?
ఎ. సాహిత్య వికాసం
బి. సైనిక విజయాలు, రాజ్య విస్తరణ
సి. వాస్తుశిల్ప వికాసం
డి. ఆర్థికపరమైన సంపన్నత
సమాధానం: సి

4. సిక్కు గురువులలో ఎవరి నాయకత్వంలో సిక్కులు, రాజకీయ, సైనిక శక్తిగా రూపొందించారు?
ఎ. గురు తేజ్ బహదూర్
బి. గురు అర్జున్
సి. గురు గోవింద్ సింగ్
డి. గురు రామదాస్
సమాధానం: సి

5. కింద పేర్కొన్న అంశాల్లో దయానంద సరస్వతికి సంబంధించి తప్పు అంశం ఏది?
ఎ. ఈయన అవతారాల భావనను విశ్వసించారు
బి. ఆత్మ పునర్జన్మ పట్ల ఆయనకు విశ్వాసం ఉంది
సి. ఆయన కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు
డి. దేవుడు, సర్వవ్యాప్తి అనేది ఆయన విశ్వాసం
సమాధానం: ఎ

6. రుగ్వేద కాలానికి సంబంధించిన కింది అంశాలలో సరైన స్టేట్‌మెంట్ ఏది?
ఎ. వర్ణాల సహపంక్తి భోజనాన్ని అనుమతించడమైంది
బి. వర్ణాంతర వివాహాలను నిషేధించడమైంది
సి. వర్ణాలు, అనువంశికంగా ఉండేవి
డి. అస్పృశ్యత సర్వసాధారణంగా ఉండేది
సమాధానం: ఎ

7. చోళరాజు మొదటి రాజేంద్రుడు, బెంగాల్‌ను ముట్టడించినప్పుడు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న పాలరాజు ఎవరు?
ఎ. రామపాలుడు
బి. దేవపాలుడు
సి. మహిపాలుడు
డి. ధర్మపాలుడు
సమాధానం: సి

8. తంజావురులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన వారెవరు?
ఎ. మొదటి రాజరాజు
బి. అనంత వర్మ
సి. నరసింహ వర్మన్
డి. రెండో ఇంద్రుడు
సమాధానం: ఎ

9. బహమనీ వంశ స్థాపకుడు ఎవరు?
ఎ. ఇస్మాయిల్ ముఖ్
బి. అమీర్ -ఇ-సదా
సి. హసన్ గంగూ
డి. మహ్మద్‌షా-I
సమాధానం: సి

10. విజయనగర రాజ్య మూలాలను కదిలించిన యుద్ధం ఏది?
ఎ.రాయచూర్ యుద్ధం
బి. తళ్లికోట యుద్ధం
సి. తంజావూరు యుద్ధం
డి. శ్రీరంగపట్నం యుద్ధం
సమాధానం: బి