HISTORY PRACTICE BITS 14

 1. శాతవాహనుల కాలంనాటి సామంత రాజ్యాలను ఏమని పిలిచేవారు?
ఎ. జనపదాలు
బి. ఆహారాలు
సి. శ్రేణులు
డి. రాష్ట్రాలు
సమాధానం: ఎ

2. కింది వారిలో ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు రాజధానిని మార్చిన వారెవరు?
ఎ. సాలార్ జంగ్
బి. నిజాం అలీఖాన్
సి. సలాబత్ జంగ్
డి. సికిందర్ జా
సమాధానం: బి

3. ఇక్ష్వాకులలో తొలుతగా సంస్కృతాన్ని శాసనాలలో వాడినది ఎవరు?
ఎ. శాంతి శ్రీ
బి. శ్రీ శాంతమూలుడు
సి. ఎహుబల శాంతమూలుడు
డి. రుద్ర పురుషదత్తుడు
సమాధానం: సి

4. అఖిల భారత ఆర్య మహా సమ్మేళనం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ. 1937
బి. 1938
సి. 1939
డి. 1940
సమాధానం: బి

5. బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు
ఎ. రెండో మాధవ వర్మ
బి. ఇంద్రవర్మ
సి. మూడో మాధవ వర్మ
డి. గోవింద వర్మ
సమాధానం: డి

6. గోల్కొండ రాజ్యాన్ని మొగలులు జయించిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా దక్కన్‌ను పాలించింది?
ఎ. అసఫ్‌జాహీలు
బి. మొగలులు
సి. కుతుబ్‌షాహీలు
డి. బహదూర్ షా
సమాధానం: ఎ

7. కింది వారిలో ముదిగొండ చాళుక్యుల గురించి తెలియజేసే శాసనం ఏది?
ఎ. కొరవి శాసనం
బి. మాగల్లు చెరువు శాసనం
సి. గూడురు శాసనం
డి. పైవన్నీ
సమాధానం: డి

8. నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం అధ్యక్షుడు ఎవరు?
ఎ. ఆర్. రాజగోపాలరెడ్డి
బి. టేకుమాల రంగారావు
సి. కె.వి.రంగారెడ్డి
డి. మందముల నరసింగరావు
సమాధానం: ఎ

9. వేములవాడ చాళుక్యులు పోషించిన మతం
ఎ. హిందూ మతం
బి. జైన మతం
సి. వీరశైవ మతం
డి. పైవన్నీ
సమాధానం: డి

10. తెలంగాణ ప్రాంతంలో దళితుల కోసం మొదటిసారిగా ఉద్యమం చేసిన వ్యక్తి?
ఎ. భాగ్యరెడ్డి వర్మ
బి. అంబేద్కర్
సి. గాంధీ
డి. రావి నారాయణరెడ్డి
సమాధానం: ఎ