HISTORY PRACTICE BITS 13

 1. కింది ఏ మతంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అజంతా, ఎల్లోరా గుహల సముదాయం సంబంధం కలిగి లేదు?
ఎ. బౌద్ధ
బి. హిందూ
సి. జైన
డి. పై మూడు మతాలతో సంబంధం కలిగి ఉంది
సమాధానం: డి

2. కింది వారిలో నాణేములు ఎవరి గురించి తెలుసుకోవడానికి అంతగా ఉపకరించవు?
ఎ. ఇండో గ్రీకులు
బి. కుషాణులు
సి. గుప్తులు
డి. ముస్లింలు
సమాధానం: డి

3. కింది వాటిలో శవపేటిక సమాధికి సంబంధించిన సాక్ష్యాధారం అందిస్తున్న ఏకైక సింధు నాగరికతకు చెందిన స్థలం ఏది?
ఎ. హరప్పా
బి. మొహంజదారో
సి. సుర్కటోడా
డి. అమ్రి
సమాధానం: ఎ

4. కింది వాటిలో గోపథ బ్రాహ్మణ అనేది దేనికి సంబంధించింది?
ఎ. రుగ్వేదం
బి. సామవేదం
సి. యజుర్వేదం
డి. అధర్వణవేదం
సమాధానం: డి

5. కింది దక్షిణ భారత రాజ్యాలలో, అశోకుడి శాసనాలలో ప్రస్తావించని రాజ్యం ఏది?
ఎ. చేర రాజ్యం
బి. పాండ్య రాజ్యం
సి. చోళ రాజ్యం
డి. శాతవాహన రాజ్యం
సమాధానం: డి

6. ఢిల్లీ సుల్తానుల కాలంలో సైనికాధిపతిని ఏమని పిలిచేవారు?
ఎ. బరీద్ -ఇ-ముమాత్
బి. దివాన్-ఇ-కోహి
సి. అరిజ్-ఇ-మాలిక్
డి. దివాన్-ఇ-రిసాలత్
సమాధానం: సి

7. తబ్‌కత్ -ఇ-నసిరి రచయిత ఎవరు?
ఎ. అల్ బెరూని
బి. మిన్హజ్ -ఉన్-సిరాజ్
సి. ఇబన్ బటూటా
డి. అబ్దుల్ హమీద్ జహారీ
సమాధానం: బి

8. ఖిలాఫత్ ఉద్యమానికి మహాత్మాగాంధీ ఎందుకు మద్దతు ఇచ్చారు?
ఎ. ఖలీఫా, భారతీయ విప్లవకారులకు ఆశ్రయమిచ్చినందుకు
బి. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారత ముస్లిములకు మద్దతు సంపాదించాలని గాంధీ భావించనందువల్ల ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు
సి. ఖలీఫా, భారత స్వాతంత్ర్య వ్యయాన్ని సమర్థించినందుకు
డి. ఖలీఫా, గాంధీజీ వ్యక్తిగత స్నేహితుడైనందుకు
సమాధానం: బి

9. కింది వాటిని చారిత్రక క్రమంలో ఉంచండి?
1. సురత్ ఉప్పు ఆందోళన
2. రమోసే తిరుగుబాటు
3. కచ్ తిరుగుబాటు
4. భిల్ తిరుగుబాటు
ఎ. డి, సి, బి, ఎ
బి. ఎ, బి, సి, డి
సి. బి, డి, ఎ, సి
డి. సి, ఎ, డి, బి
సమాధానం: ఎ

10. కింది వారిలో అతి ప్రాచీనమైన భౌతికవాద బోధకుడు ఎవరు?
ఎ. బుద్ధుడు
బి. మహావీరుడు
సి. అజిత కేశ కంబలిక
డి. మక్కలి గోసల పుత్ర
సమాధానం: ఎ