HISTORY PRACTICE BITS 17

 1. రాగి వస్తువులు ఎక్కువగా లభించిన తామ్రశిలాయుగ స్థావరమేది?
ఎ. ఇనాంగాన్
బి. అహర్
సి. గిలుండ్
డి. నెవాసా

2. ప్రపంచంలో మొట్టమొదటగా ఇనుము ఎక్కడ కనుగొన్నారు?
ఎ. ఆసియా
బి. యూరప్
సి. ఈజిప్టు
డి. యురేషియా

3. ప్రాచీన శిలాయుగంలో మానవుడు పనిముట్లకు ఉపయోగించిన రాయి?
ఎ. చలవరాయి
బి. క్వార్ట్‌జైట్
సి. గ్రానైట్
డి. సున్నపురాయి

4. ద్రావిడులు ఏ జాతికి చెందినవారు?
ఎ. మెడిటేరియన్
బి. నార్డిక్‌లు
సి. మంగోలాయిడ్‌లు
డి. నీగ్రిటోలు

5. భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ ఏ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది?
ఎ. క్రీ.పూ. 2, 3వ శతాబ్దంలో
బి. క్రీ.పూ. 5, 6వ శతాబ్దంలో
సి. క్రీ.పూ. 6వ శతాబ్దంలో
డి. క్రీ.శ. 12, 13వ శతాబ్దంలో

6. ఢిల్లీ సుల్తానుల కాలంలో దివాన్ ఇ ఇన్షా శాఖ దేనికి సంబంధించిన విభాగం?
ఎ. మత సంబంధ విషయాలను చూసేది
బి. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల బట్వాడా
సి. రాజగృహ సంబంధ వ్యవహారాలను చూసేది
డి. ప్రజా పనుల విభాగం

7. ప్రాచీన స్మారక భవనాల పరిరక్షణ చట్టాన్ని చేసిన గవర్నర్ జనరల్?
ఎ. మింటో
బి. మౌంట్ బాటన్
సి. కర్జన్
డి. లిన్ లిథ్‌గో

8. సింధు లోయ ప్రజలు తగరాన్ని ఎక్కడ నుంచి తెప్పించుకునేవారు?
ఎ. ఆఫ్ఘనిస్థాన్
బి. ఖేత్రి గనులు
సి. గుజరాత్
డి. మెసొపొటేమియా

9. రుగ్వేద కాలం నాటి ఆర్యుల భౌగోళిక విజ్ఞానం, కింది ప్రాంతాల్లో దేనిని దాటి విస్తరించలేదు?
ఎ. బిహార్
బి. సట్లెజ్
సి. యమున
డి. సింధు

10. మలివేద కాలంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించిన దేవత ఎవరు?
ఎ. ఇంద్రుడు
బి. ప్రజాపతి
సి. పశుపతి మహాదేవుడు
డి. అగ్ని

జవాబులు
1-2,2-4,3-2,4-1,5-2,

6-2,7-3,8-1,9-3,10-2.