HISTORY PRACTICE BITS 2

 

1. రెండో ఆంగ్ల-మరాఠా యుద్ధం ఏ ఒప్పందం ద్వారా ముగిసిపోయింది?
ఎ. వడాగాం ఒప్పందం
బి. డియోగం ఒప్పందం
సి. పుణె ఒప్పందం
డి. నాగ్‌పూర్ ఒప్పందం
సమాధానం: బి

2. బ్రిటీష్ వారికి ఫరూక్ సియార్ బంగారు ఫర్మాన్ ఏ సంవత్సరంలో ఇచ్చాడు?
ఎ. 1717
బి. 1719
సి. 1732
డి. 1740
సమాధానం: ఎ

3. ఎపిక్యూరియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎవరిని అంటారు?
ఎ. వల్లభాచార్యుడు
బి. శంకరాచార్య
సి. మధ్వాచార్య
డి. రామానుజాచార్య
సమాధానం: ఎ

4. విజయనగరాన్ని పాలించిన నాలుగు వంశాల వరుస క్రమాన్ని తెలుపండి?
ఎ. సంగమ, తుళువ, సాళువ, అరవీటి
బి. సంగమ, అరవీటి, తుళువ, సాళువ
సి. సాళువ, సంగమ, తుళువ, అరవీటి
డి. సంగమ, సాళువ, తుళువ, అరవీటి
సమాధానం: డి

5. దక్షిణ సముద్రాదీశ్వర అనే బిరుదు ఎవరికి కలదు?
ఎ. దేవరాయులు-2
బి. దేవరాయులు-1
సి. లక్కన
డి. హరిహరాయులు-1
సమాధానం: సి

6. భారతదేశంలో సితార్, తబలాను ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ. తాన్‌సేన్
బి. అమీర్ ఖుస్రో
సి. అల్బెరూని
డి. ఫిరదౌసి
సమాధానం: బి

7. ఏ మొగల్ చక్రవర్తి కాలంలో చిత్రలేఖనం అత్యధికంగా అభివృద్ధి చెందింది?
ఎ. షాజహాన్
బి. అక్బర్
సి. జహంగీర్
డి. హమయున్
సమాధానం: సి

8. భారతదేశంలో ఏ మొగల్ చక్రవర్తి కాలంలో పొగాకును ప్రవేశపెట్టబడి, ఏ మొగల్ చక్రవర్తి కాలంలో నిషేధించబడింది?
ఎ. షాజహాన్ – జహంగీర్
బి. అక్బర్- షాజహాన్
సి. బాబర్ – హుమయున్
డి. అక్బర్ – జహంగీర్
సమాధానం: డి

9. ఆగ్రా పట్టణ నిర్మాత?
ఎ. అక్బర్
బి. సికిందర్ లోడి
సి. షాజహాన్
డి. ఇబ్రహింఖాన్ లోడి
సమాధానం: బి

10. హరప్పా నాగరికతలో కోట, రక్షణగోడ లేని ఏకైక పట్టణం ఏది?
ఎ. చన్హుదారో
బి. లోథాల్
సి. మొహంజోదారో
డి. కాళీభంగన్
సమాధానం: బి