HISTORY PRACTICE BITS 5

 

1. కింది వారిలో క్విట్ ఇండియా ఉద్యమంతో సంబంధం లేనివారు?
ఎ. అరుణ అసఫ్ అలీ
బి. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్
సి. ఉషా మెహతా
డి. విజయలక్ష్మీ పండిట్
సమాధానం: డి

2. కింది వారిలో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనవారు?
ఎ. అంబేద్కర్, జిన్నా
బి. అంబ్కేర్, గాంధీ
సి. అబుల్ కలాం ఆజాద్
డి. జిన్నా, గాంధీ
సమాధానం: డి

3. కింది ఏ ఉద్యమంతో గాంధీజీకి సంబంధం లేదు?
ఎ. వందేమాతరం
బి. ఖేదా ఉద్యమం
సి. ఖిలాఫత్ ఉద్యమం
డి. చంపారన్ ఉద్యమం
సమాధానం: ఎ

4. ముందు భారతీయులం ఆ తర్వాతే ముస్లిలం అనే నినాదాన్ని ఇచ్చినవారు?
ఎ. జిన్నా
బి. షౌకత్ అలీ
సి. అబుల్ కలాం ఆజాద్
డి. లియాఖత్ అలీ
సమాధానం: ఎ

5. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఎన్నేండ్లు ఉన్నారు?
ఎ. 21
బి. 22
సి. 23
డి. 24
సమాధానం: బి

6. ఖిలాఫత్ ఉద్యమంతోపాటు ప్రారంభమైన ఉద్యమం ఏది?
ఎ. స్వదేశీ ఉద్యమం
బి. క్విట్ ఇండియా ఉద్యమం
సి. సహాయ నిరాకరణ ఉద్యమం
డి. ఖేదా ఉద్యమం
సమాధానం: సి

7. స్వరాజ్ పార్టీ లక్ష్యం ఏమి?
ఎ. చట్టసభలలో ప్రవేశించడం
బి. ఎన్నికలను బహిష్కరించడం
సి. ప్రభుత్వాన్ని కూలగొట్టడం
డి. ఏదీకాదు
సమాధానం: ఎ

8. ఏఐటీయూసీ ఏర్పాటును ఏ కాంగ్రెస్ సమావేశంలో సమర్థించారు?
ఎ. లాహోర్ సమావేశం
బి. ఫైజ్‌పూర్ సమావేశం
సి. గయా సమావేశం
డి. కలకత్తా సమావేశం
సమాధానం: సి

9. కింది వాటిలో ఏది సరైన జత కాదు?
ఎ. కుకి తిరుబాటు – మణిపూర్
బి. ఖాసిస్ తిరుగుబాటు – మేఘాలయ
సి. భుగాన్ తిరుగుబాటు – ఒడిశా
డి. ముండా తిరుగుబాటు – అసోం
సమాధానం: డి

10. 1857 తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని ఎవరు పేర్కొన్నారు?
ఎ. వి.డి.సావర్కర్
బి. ఆర్‌.సి.మజుందార్
సి. బికాజి కామా
డి.టేలర్
సమాధానం: ఎ