HISTORY PRACTICE BITS 9

1. బంకించంద్ర ఛటోపాధ్యాయ ‘ఆనంద్‌మఠ్’ను రచించిన సంవత్సరం?
ఎ. 1882
బి. 1885
సి. 1892
డి. 1895
సమాధానం: ఎ

2. సెప్టెంబర్ 2, 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారి ప్రతిపాదించింది?
ఎ. సైమన్ కమిషన్
బి. క్రిప్స్ మిషన్
సి. వేవెల్ ప్లాన్
డి. కేబినెట్ మిషన్ ప్లాన్
సమాధానం: డి

3. మహమ్మద్‌న్ ఆంగ్లో-ఓరియంటల్ ఢిఫెన్స్ అసోసియేషన్ (1893)ని ప్రారంభించింది?
ఎ. బద్రుద్దీన్ త్యాబ్జీ
బి. టి.బెక్
సి. ఎ.ఎస్.సామ్యూల్‌సన్
డి. సయ్యద్ అహ్మద్‌ఖాన్
సమాధానం: డి

4. కింది ఏ విషయమై పరిశోధన చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది?
ఎ. చౌరీచౌరా సంఘటన
బి. బర్దోలీ సత్యాగ్రహం
సి. జలియన్ వాలా బాగ్ దుర్ఘటన
డి. ఖిలాఫత్ ఆందోళన
సమాధానం: సి

5. ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించింది?
ఎ. గాంధీజీ
బి. అంబేద్కర్
సి. జ్యోతిబా పూలే
డి. ఇక్బాల్
సమాధానం: బి

6. డైరెక్ట్ యాక్షన్ డే/ ప్రత్యక్ష పోరాటం రోజు హిందూ, ముస్లింల కలహాల వల్ల అసాధారణ రక్తపాతం జరిగిన చోటు?
ఎ. ఢిల్లీ
బి. బాంబే
సి. ఢాకా
డి. కలకత్తా
సమాధానం: డి

7. కింది ఏ సంస్థలో మహాదేవ గోవిందరనడే సభ్యుడు?
ఎ. ఆర్య సమాజం
బి. ప్రార్థనా సమాజం
సి. ఇండియా లీగ్
డి. థియోసాఫికల్ సొసైటీ
సమాధానం: బి

8. కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చడానికి ప్రతిపాదించిన ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ. లార్డ్ హేస్టింగ్స్
బి. లార్డ్ కానింగ్
సి. లార్డ్ హార్డింజ్-2
డి. లార్డ్ కర్ణన్
సమాధానం: సి

9. రైతుల స్నేహితుడు అని ఎవరిని అంటారు?
ఎ. లార్డ్ రిప్పన్
బి. లిట్టన్
సి. లార్డ్ కానింగ్
డి. లార్డ్ కర్జన్
సమాధానం: ఎ

10. కింది వారిలో లోక‌హితవాది అని పిలువబడిని జాతీయ నాయకుడు ఎవరు?
ఎ. లాలా లజపతి రాయ్
బి. విష్ణుకృష్ణ చిప్లుంకర్
సి. గోపాల్ హరిదేశ్‌ముఖ్
డి. మోతీలాల్ నెహ్రూ
సమాధానం: సి