POLITY PRACTICE BITS 10

1. ఎవరి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) గుర్జారీ లాల్ నందా
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) అటల్ బిహారీ వాజ్‌పేయీ
సమాధానం: డి

2. రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి ఏ షెడ్యూల్‌లో పేర్కొన్నారు?
ఎ ) షెడ్యూల్ -1
బి ) షెడ్యూల్ -4
సి ) షెడ్యూల్ -10
డి ) షెడ్యూల్ -8
సమాధానం: బి

3. రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజీ’లో ఎవరు సభ్యులుగా ఉంటారు?
ఎ) పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు
బి) ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, ఎన్నికైన విధానసభ సభ్యులు
సి) పార్లమెంట్ సభ్యులు మాత్రమే
డి) ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది
సమాధానం: బి

4. కింద పేర్కొన్న వారిలో అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు?
ఎ) జాకీర్‌హుస్సేన్
బి) ఫకృద్దీన్ అలీ అహ్మద్
సి) వి.వి.గిరి
డి) నీలం సంజీవరెడ్డి
సమాధానం: ఎ

5. విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు ?
ఎ) జాకీర్ హుస్సేన్
బి) కె.ఆర్.నారాయణన్
సి) ఫకృద్దీన్ అలీ అహ్మద్
డి) నీలం సంజీవరెడ్డి
సమాధానం: బి

6. కింది వాటిలో సరైన వాక్యం ఏది ?
ఎ) అధికరణ -108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు
బి) అధికరణ -72 ప్రకారం నేరస్తులకు క్షమాభిక్ష పెట్టవచ్చు. శిక్ష తగ్గించవచ్చు
సి) అధికరణ -143 ప్రకారం – రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు
డి ) పైవన్నీ
సమాధానం: డి

7. కింది వారిలో ఎవరికి సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణయక ఓటు హక్కు ఉంటుంది?
ఎ) లోక్‌సభ స్పీకర్
బి) రాజ్యసభ చైర్మన్
సి) విధాన పరిషత్ అధ్యక్షులు
డి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
సమాధానం: బి

8. ఉప రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు తాత్కాలిక ఉప రాష్ట్రపతిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) రాజ్యసభ ఉపాధ్యక్షుడు
బి) లోకసభ స్పీకర్
సి) ప్యానెల్ స్పీకర్
డి) ఎవరూ కాదు
సమాధానం: డి

9. కింది వారిలో అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది?
ఎ) అటల్ బిహారీ వాజ్‌పేయీ
బి) చంద్రశేఖర్
సి) వి.పి.సింగ్
డి) దేవేగౌడ
సమాధానం: బి

10. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని – జవహర్ లాల్ నెహ్రూ
బి) మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని – పి.వి. నరసింహారావు
సి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడిపిన ప్రధాని – వాజ్ పేయీ
డి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి ప్రధాని – మొరార్జీ దేశాయ్
సమాధానం: సి