GEOGRAPHY PRACTICE BITS 14

1. భూఉపరితలంపై అధిక శాతంలో ఉన్న శిలలు ఏవి?
ఎ) అగ్నిశిలలు
బి) అవక్షేప శిలలు
సి) రూపాంతర శిలలు
డి) పరివర్తన శిలలు

2) భూపటలంలో అధిక శాతంలో ఉన్న శిలలు ఏది?
ఎ) అగ్నిశిలలు
ని) అవక్షేప శిలలు
సి) రూపాంతర శిలలు
డి) పరివర్తన శిలలు

3. బసాల్ట్ అనేది క్రింది వానిలో ఏ రకానికి చెందిన శిలలు?
ఎ) అగ్నిశిలలు
బి) అవక్షేప శిలలు
సి) రూపాంతర శిలలు
డి) పరివర్తన శిలలు

4. బొగ్గు, పెట్రోలియంలు క్రింది వానిలో ఏ వర్గానికి చెందుతాయి?
ఎ) అగ్నిశిలలు
బి) అవక్షేప శిలలు
సి) రూపొంతర శిలలు
డి) పరివర్తనశిలలు

5. నీస్, సిస్ట్, పొలరాయి, డైమండ్, గ్రాఫైట్లు క్రింది వానిలో ఏ వర్గానికి చెందుతాయి?
ఎ) అగ్నిశిలలు
బి) అవక్షేప శిలలు
సి) రూపాంతర శిలలు
డి ) పరివర్తన శిలలు

6. శిలాజాల లాక్షణిక రూపాలు అని క్రింది వానిలో వేటిని పిలుస్తారు?
ఎ) అగ్నిశిలలు
బి) అవక్షేప శిలలు
సి) రూపాంతర శిలలు
డి) పరివర్తనశిలలు

7. క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించుము?
ఎ) గ్రానైట్, బసాల్ట్, గాబ్రో
బి) పాలరాయి, నీస్, సోడియం క్లోరైడ్
సి) పాలరాయి , సోడియం క్లోరైడ్ , జింక్ సల్ఫేట్
డి) నీస్, పలకరాయి, గ్రాఫైట్

8. సిలికా అధికంగా ఉన్న శిలలను ఏమని పిలుస్తారు?
ఎ) ఆమ్ల శిలలు
బి) క్షారశిలలు
సి) రూపాంతర శిలలు
డి) పరివర్తన శిలలు

9. భూ అంతర్భాగంలో డోమ్ లేదా కలశ ఆకృతిలో ఉన్న రూపాంతరాలను ఏమని పిలుస్తారు?
ఎ) సిల్స్
బి) డైక్స్
సి) లాపోలిథ్
డి) బాతోలిథ్స్

10. క్రింది వానిలో రూపాంతర శిల కానిది ఏది?
ఎ) పాలరాయి
బి) ఇసుకరాయి
సి) పలకరాయి
డి) గ్రాఫైట్

జవాబులు
1)బి 2) ఎ 3) ఎ 4 ) బి 5) సి 6)బి 7) బి 8 ) ఎ 9 ) డి 10) బి