POLITY PRACTICE BITS 13

1. మహిళా సాధికారక సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు?
ఎ. 1998
బి. 1999
సి. 2000
డి. 2001
సమాధానం: డి

2. కాకా సాహెబ్ కాలేల్కర్ కమిటీ ఎన్ని కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించింది?
ఎ. 2599
బి. 2399
సి. 3543
డి. 3743
సమాధానం: బి

3. ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం-1989 అమలుకు అవసరమైన నిబంధనలను ఎవరు రూపొందిస్తారు?
ఎ. కేంద్ర ప్రభుత్వం
బి. రాష్ట్రపతి
సి. న్యాయశాఖ మంత్రి
డి. సంబంధిత మంత్రిత్వా శాఖ
సమాధానం: ఎ

4. ఏ కమిషన్ సిఫారసుల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల క్రమబద్ధీకరణ) ఆర్డినెన్స్ జారీ చేశారు?
ఎ. రామచంద్రారెడ్డి కమిషన్
బి. జయప్రకాష్ నారాయణ్ కమిషన్
సి. జస్టిస్ పున్నయ్య కమిషన్
డి. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్
సమాధానం: డి

5. ఏ కేసులో ఓబీసీ క్రిమిలేయర్‌ను ప్రస్తావించారు?
ఎ. అశోక్ కుమార్ ఠాకూర్
బి. ఇందిరా సహాని
సి. బాలాజీ
డి. మోహిన్‌జైన్
సమాధానం: బి

6. జాతీయ వెనుకబడిన తరగతుల మొదటి చైర్మన్ ఎవరు?
ఎ. జస్టిస్ వి.ఈశ్వరయ్య
బి. జస్టిస్ ఎస్.రత్నవేల్ పాండ్యన్
సి. జస్టిస్ ఆర్.ఎన్.ప్రసాద్
డి. జస్టిస్ రాం సూరత్ సింగ్
సమాధానం: సి

7. ఏ సంవత్సరంలో గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ శాఖను వేరు చేశారు?
ఎ. 2004
బి. 2005
సి. 1990
డి. 2010
సమాధానం: ఎ

8. మన దేశంలో నల్లధనం ఎన్ని లక్షల కోట్లు ఉందని అసోచాం అంచనా వేసింది?
ఎ. రూ.70లక్షల కోట్లు
బి. రూ.90లక్షల కోట్లు
సి. రూ.110లక్షల కోట్లు
డి. రూ.120లక్షల కోట్లు
సమాధానం: డి

9. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు?
ఎ. 78వ
బి. 80వ
సి. 82వ
డి. 84వ
సమాధానం: డి

10. లోక్‌‌పాల్ అనేది ఒక
ఎ. క్రిమినల్ న్యాయవ్యవస్థ
బి. సివిల్ న్యాయవ్యవస్థ
సి. పాక్షిక న్యాయవ్యవస్థ
డి. ఏదీకాదు
సమాధానం: సి