POLITY PRACTICE BITS 15

1. గవర్నర్‌లను నియమించేటప్పుడు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా సంప్రదించాలని సిఫారసు చేసింది ఎవరు?
ఎ. సర్కారియా కమిషన్
బి. రాజమన్నార్ కమిటీ
సి. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం
డి. ఏదీ కాదు
సమాధానం: ఎ

2. కిందివారిలో ఏయే కమిటీలు నిబంధన 356వ రద్దు చేయాలని సిఫారసు చేశారు?
1. రాజమన్నార్ కమిటీ
2. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ మెమొరాండం
ఎ. 1 మాత్రమే
బి. 2 మాత్రమే
సి. 1, 2
డి. ఏదీకాదు
సమాధానం: సి

3. భారత పౌరులకు రాజ్యాంగం ఎన్నిరకాల రిట్ల ద్వారా రక్షణ కల్పిస్తుంది?
ఎ. నాలుగు
బి. ఐదు
సి. ఆరు
డి. మూడు
సమాధానం: బి

4. కిందివానిలో ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కులపై ఆదేశ సూత్కాలకు ఆధిక్యత కలుగజేశారు?
ఎ. 42వ రాజ్యాంగ సవరణ
బి. 43వ రాజ్యాంగ సవరణ
సి. 44వ రాజ్యాంగ సవరణ
డి. 45వ రాజ్యాంగ సవరణ
సమాధానం: ఎ

5. కింది వానిలో ఏ దేశ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు లేవు?
ఎ. ఐర్లాండ్
బి. ఇండియా
సి. మయన్మార్
డి. అమెరికా
సమాధానం: డి

6. మనదేశంలో పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది?
ఎ. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
బి. ఆర్థిక మంత్రిత్వశాఖ
సి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ
డి. ప్రణాళికామండలి
సమాధానం: ఎ

7. కంటోన్మెంట్ బోర్డు ఎవరి ప్రత్యక్ష నియంత్రణలోకి వస్తుంది?
ఎ. రాష్ట్ర ప్రభుత్వం
బి. కేంద్ర పోలీస్ శాఖ
సి. రక్షణ మంత్కిత్వశాఖ
డి. హోంమంత్రిత్వా శాఖ
సమాధానం: సి

8. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయస్సు ఎంత?
ఎ. 18ఏండ్లు
బి. 20ఏండ్లు
సి. 21ఏండ్లు
డి. 25ఏండ్లు
సమాధానం: సి

9. ఎన్నో షెడ్యూల్‌లో రాష్ట్ర జాబితాలో అంగవైకల్యం అనే అంశాన్ని చేర్చడమైంది?
ఎ. 5వ షెడ్యూల్
బి. 6వ షెడ్యూల్
సి. 7వ షెడ్యూల్
డి. 8వ షెడ్యూల్
సమాధానం: సి

10. స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ. లార్డ్ రిప్పన్
బి. నెహ్రూ
సి. గాంధీ
డి. పటేల్
సమాధాన: ఎ