HISTORY PRACTICE BITS 18

 1. భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏది?
ఎ. సాంచీ
బి. సారనాథ్
సి. కౌశాంబి
డి. రాజగృహం
సమాధానం: ఎ

2. నిజాం ఉల్ ముల్క్ మహారాష్ట్రులతో చేసుకున్న సంధి
ఎ. ముషిగావ్ సంధి
బి. వార్నా సంధి
సి. దురారీ సరాయి సంధి
డి. పైవన్నీ
సమాధానం: డి

3. అనాది తెగల ఆచారమైన మాతృదేవతారాధన, నాగపూజ ఎవరి కాలంలో కనిపిస్తున్నది?
ఎ. శాతవాహనులు
బి. పల్లవులు
సి. ఇక్ష్వాకులు
డి. ఎవరూ కాదు
సమాధానం: సి

4. హైదరాబాద్‌లో ఆర్యసమాజ శాఖ అధ్యక్షులు ఎవరు?
ఎ. కామత్ ప్రసాద్ జీ మిశ్రా
బి. లక్ష్మణ్ దాస్ జీ
సి. స్వామి రామానంద తీర్థ
డి. పండిత సోమ్‌నాథ
సమాధానం: ఎ

5. తెలంగాణలో విష్ణుకుండినుల చరిత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలుగా నిలిచిన శాసనాలు లభ్యమైన ప్రదేశం ఏది?
ఎ. తుమ్మల గూడెం(నల్లగొండ జిల్లా)
బి. కీసర (రంగారెడ్డి జిల్లా)
సి. కోటిలింగాల (కరీంనగర్ జిల్లా)
డి. కొండాపురం (మెదక్ జిల్లా)
సమాధానం: ఎ

6. నిజాం రాష్ట్ర సంస్కార మహాసభలు ఏ సంవత్సరంలో జరిగాయి?
ఎ. 1920
బి. 1921
సి. 1922
డి. 1923
సమాధానం: బి

7. కొరవి సీమకు గల మరోపేరు?
ఎ. పల్లవనాడు
బి. విసరునాడు
సి. సబ్బినాడు
డి. ఏదీకాదు
సమాధానం: బి

8. దక్కన్ కేసరి పత్రిక ఏ సంవత్సరంలో వెలువడింది?
ఎ. 1935
బి. 1936
సి. 1937
డి. 1938
సమాధానం: ఎ

9. వేములవాడ చాళుక్యలలో ప్రసిద్ధుడు ఎవరు?
ఎ. రెండో అరికేసరి
బి. బద్దెగుడు
సి. మొదటి అరికేసరి
డి. యుద్ధమల్లుడు
సమాధానం: ఎ

10. సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ. హైదరాబాద్
బి. సికింద్రాబాద్
సి. వరంగల్
డి. సూర్యాపేట
సమాధానం: బి