ECONOMY PRACTICE BITS 5

  1. ఒక దేశంలో విదేశీ మారక నిల్వల రాకను పెంచేది?
    1) ధనాత్మక మూలధన ఖాతా
    2)ధనాత్మక చాలక ఖాతా (Current A/c)
    3) ధనాత్మక చెల్లింపుల శేషం (BOP)
    4) ధనాత్మక దృశ్య ఖాతా
  2. ఆర్థిక సంస్కరణల్లో నిర్మాణాత్మక సర్దుబాటు ఏ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది?
    1) సామర్థ్యం పెంపు
    2) ఉత్పత్తి, ధరలపై నియంత్రణ తొలగింపు
    3) అంతర్జాతీయ పోటీకి అనుమతి
    4) పైవన్నీ
  3. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఎప్పుడు జాతీయం చేశారు?
    1) 1935 2) 1949
    3) 1947 4) 1955
  4. లారెంజ్‌రేఖ దేనిని కొలిచేందుకు ఉపయోగపడుతుంది?
    1) వెనుకబాటుతనం 2) పేదరికం
    3) అసమానతలు 4) నిరుద్యోగిత
  5. శ్రామికులకు పనిదొరుకుతుంది కానీ వారి శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించబడవు. కింది వాటిలో ఇటువంటి స్థితిని ఏమంటారు?
    1) రుతు సంబంధ నిరుద్యోగిత
    2) సంప్రదాయ నిరుద్యోగిత
    3) అల్ప నిరుద్యోగిత
    4) బహిరంగ నిరుద్యోగిత
  6. బ్యాంకుల రిజర్వులకు, పరపతి సృష్టికి ఎటువంటి సంబంధం ఉంటుంది?
    1) అనులోమానుపాత సంబంధం
    2) విలోమానుపాత సంబంధం
    3) సంబంధం ఉండదు
    4) పరపతి గుణకం మీద ఆధారపడతాయి
  7. నూతన వ్యవసాయ విధానంతో కింది వాటిలో జరిగిన పరిణామం ఏది?
    ఎ. భూసారం పెరిగింది
    బి. వ్యవసాయ వ్యయం పెరిగింది
    సి. భూసారం తగ్గింది
    డి. వ్యవసాయ వ్యయం తగ్గింది
    1) బి, సి 2) ఎ, డి 3) సి, డి 4) ఎ, బి
  8. జాతీయాదాయాన్ని లెక్కించడంలో సమస్య కానిది?
    1) నల్లధనం 2) అంతర్గత ఆదాయం
    3) ఆధార సంవత్సరాన్ని పరిగణించడం
    4) తుది వస్తువులను నిర్ణయించడం
  9. పొదుపు నిష్పత్తిని మూలధన ఉత్పత్తి నిష్పత్తితో భాగిస్తే వచ్చేది ఏమిటి?
    1) స్థూల జాతీయోత్పత్తికి వృద్ధిరేటు
    2) వ్యయార్హ ఆదాయ వృద్ధిరేటు
    3) జనాభా వృద్ధిరేటు
    4) తలసరి ఆదాయ వృద్ధిరేటు
  10. మార్కెట్‌ కారకాల ధరలకు, ఉత్పత్తి కారకాల ధరలకు మధ్య వ్యత్యాసం?
    1) ద్రవ్యోల్బణం 2) తరుగుదల
    3) నికర పరోక్ష పన్నులు
    4) బదిలీ చెల్లింపులు

 

 1-3,     2-4,     3-2,     4-2,     5-3,

6-2,     7-1,     8-3,     9-1,     10-3