ECONOMY PRACTICE BITS 6

 

  1. దేశంలో లఘు, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడంలో లక్ష్యం?
    ఎ. మూలధన పెంపు బి. ఉద్యోగాల కల్పన
    సి. వలసల నివారణ
    1) ఎ 2) ఎ, బి
    3) బి, సి 4) బి
  2. 1991 సంస్కరణల తర్వాత అమలైన నూతన ఆర్థిక విధానంలో మన దేశం కింది వాటిలో దేనిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది?
    1) బ్యాంకింగ్‌ రంగం
    2) ఎగుమతులను ప్రోత్సహించడం
    3) దిగుమతి ప్రత్యామ్నాయాలు
    4) స్వయం సమృద్ధి సాధించడం
  3. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013కు సంబంధించి సరికానిది ఏది?
    1) లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ
    2) మధ్యాహ్న భోజన పథకం
    3) అందరికి ఆహారం పంపిణీ చేయడం
    4) సమీకృత బాలల అభివృద్ధి
  4. ఆదాయ మదింపు పద్ధతి (Income Method)కి గల మరొక పేరు?
    1) నికర ఆదాయ పద్ధతి
    (Net Income Method)
    2) ప్రతిఫలాల పంపిణీ పద్ధతి
    (Factor Distribution)
    3) కారకాల చెల్లింపు పద్ధతి
    (Factor Payment Method)
    4) పైవన్నీ
  5. అదనంగా ఒక శ్రామికుడిని నియమిస్తే మొత్తం ఉత్పత్తికి అదనంగా ఏమి చేర్చలేని పరిస్థితిని ఏమంటారు?
    1) అల్ప ఉద్యోగిత
    2) ప్రచ్ఛన్న నిరుద్యోగం
    3) రుతు సంబంధ నిరుద్యోగం
    4) సాపేక్ష నిరుద్యోగం
  6. మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరైనది గుర్తించండి?
    1) కేంద్ర గణాంక సంస్థ ఏర్పాటు
    2) కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు
    3) జాతీయ అటవీ విధానం
    4) పైవన్నీ
  7. జతపర్చండి
    1) Head count Ratio
    ఎ. దండేకర్‌& రథ్‌
    2) P-Index
    బి. గౌరవదత్‌& రావెల్లిన్‌
    3) Poverty Gap Index
    సి. అమర్త్యసేన్‌
    4) Gini Index
    డి. గిని& లారెంజ్‌
    1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
    2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
    3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
    4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  8. కిందివాటిలో హరితవిప్లవానికి దోహదం చేసిన పథకం?
    1) సామాజిక అభివృద్ధి కార్యక్రమం (CDP)
    2) క్షామపీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం (DPAP)
    3) సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం (IAAP)
    4) అధిక దిగుబడి విత్తనాల కార్యక్రమం (HYVP)
  9. ఆర్థికాభివృద్ధిలో ద్వంద్వత్వం అంటే?
    1) ద్వంద్వ ధరల విధానం
    2) వ్యవస్థాగతమైన& అవ్యవస్థాగతమైన వ్యవస్థలు ఉండటం
    3) ప్రభుత్వ & ప్రైవేటు రంగాలు సమకాలికంగా ఉండటం
    4) కేంద్రీకృత& వికేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థలు ఉండటం
  10. దేశంలో లార్డ్‌ కార్న్‌వాలిస్‌ ప్రవేశపెట్టిన భూస్వామ్య పద్ధతి?
    1) జమిందారీ పద్ధతి
    2) రైత్వారీ పద్ధతి
    3) మున్సబ్‌దారీ పద్ధతి
    4) మహల్వారీ పద్ధతి

 1-3,     2-2,     3-3,     4-4,     5-2, 

6-4,     7-3,     8-1,     9-2,     10-1