ECONOMY PRACTICE BITS 7

  1. అల్పాభివృద్ధి ఉండే దేశాల్లో ఆదాయ అసమానతలు ఏ రంగంలో కనిపిస్తాయి?
    ఎ. ప్రాథమిక రంగం బి. ద్వితీయ రంగం
    సి. సేవల రంగం
    1) ఎ 2) ఎ, బి
    3) ఎ, బి, సి 4) సి
  2. ఆర్థికవృద్ధి అనే భావన ఏ దేశాలకు సరిగ్గా సరిపోతుంది?
    1) అల్ప అభివృద్ధి దేశాలు
    2) అభివృద్ధి చెందుతున్న దేశాలు
    3) అభివృద్ధి చెందిన దేశాలు
    4) సుసంపన్న దేశాలు
  3. రాష్ర్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా నీతిఆయోగ్‌ ఏర్పాటు చేసిన 3 ఉపసంఘాల్లో సరైనది గుర్తించండి?
    1) కేంద్రప్రాయోజిత పథకాల సబ్‌ గ్రూప్‌
    2) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సబ్‌ గ్రూప్‌
    3) స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ సబ్‌ గ్రూప్‌
    4) పైవన్నీ
  4. ఒక దేశ ప్రజలు ఇంకొక దేశంలో అధికంగా పెట్టుబడి పెట్టి విపరీత లాభాలు సాధిస్తే..?
    1) దీనిని స్వదేశంలో ఆర్థికాభివృద్ధిగా పరిగణించరాదు
    2) వీటిని అంచనా వేయలేం
    3) దీనిని స్వదేశంలో ఆర్థికాభివృద్ధిగా పరిగణించవచ్చు
    4) దీనికి స్వదేశీ ఆర్థికాభివృద్ధితో ఎలాంటి సంబంధం ఉండదు
  5. తలసరి ఆదాయంలో భేదాలు ఏ అంశాన్ని తెలియజేస్తాయి?
    1) జీవితకాలం 2) జీవన ప్రమాణం
    3) పోషకలోపం 4) సమాజ పోకడలు
  6. అభివృద్ధి చెందిన దేశాల లక్షణం?
    1) అవస్థాపన సౌకర్యాల కొరత
    2) అభిలషణీయ వనరుల వినియోగం
    3) మూలధన కొరత
    4) వ్యవసాయ రంగ ఆధిపత్యం
  7. సరైనది గుర్తించండి?
    ఎ. 1955లో ఐసీఐసీఐ బ్యాంకును ఏర్పాటు చేశారు
    బి. 2002లో ఐసీఐసీఐని ఏర్పాటు చేశారు
    1) ఎ 2) బి
    3) ఎ, బి 4) ఏదీకాదు
  8. 7వ ప్రణాళిక కాలం 1990 మార్చి 31న ముగియగా 8వ ప్రణాళిక 1992 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో ప్రణాళికలు ప్రారంభించకపోవడానికి కారణాలు?
    ఎ. గల్ఫ్‌ యుద్ధం
    బి. విదేశీ మారక నిల్వల కొరత
    సి. ప్రభుత్వం ప్రణాళిక వ్యవస్థ రద్దుకు సిఫారసు
    డి. ద్రవ్యోల్బణం
    1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
    3) బి మాత్రమే 4) బి, డి, ఎ
  9. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
    1) బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలు
    – నరసింహం కమిటీ
    2) పారిశ్రామిక రంగ సంస్కరణలు
    – వాంఛూ కమిటీ
    3) బీమా రంగ సంస్కరణలు
    – మల్హోత్రా కమిటీ
    4) పెట్టుబడులు ఉపసంహరణ
    – రంగరాజన్‌ కమిటీ
  10. షుంపీటర్‌ ఆర్థికాభివృద్ధిలో దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు?
    1) నవకల్పనలు 2) పరపతిదారులు
    3) ఎంటర్‌ప్రెన్యూర్స్‌ 4) నూతన కల్పితాలు

 1-3,     2-3,     3-4,     4-1,     5-2, 

6-2,     7-3,     8-4,     9-2,     10-1