టోక్యో పారాలింపిక్స్‌ 2021

 

 టోక్యోలో పారాలింపిక్స్‌ను ఆగస్ట్‌ 24 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు నిర్వహించారు. 

దీనిలో 207 పతకాలు సాధించి చైనా అగ్రస్థానంలో నిలిచింది.  96 స్వర్ణ, 60 రజత, 51 కాంస్య పతకాలు సాధించింది. 

పతకాల పట్టికలో భారత్‌ 24వ స్థానంలో ఉంది.


భారత్‌: ప్రారంభ వేడుకల్లో టెక్‌ చంద్‌ పతాకధారి కాగా, ముగింపు ఉత్సవాలకు అవని లేఖరా పతాకధారిగా నిలిచారు.


స్వర్ణ పతకాలు

  • సుమిత్‌ అంటిల్‌ :అథ్లెటిక్స్‌
  • ప్రమోద్‌ భగత్‌ :బ్యాడ్మింటన్‌ (పురుషుల సింగిల్స్‌)
  • కృష్ణ నగర్‌ :బ్యాడ్మింటన్‌ (పురుషుల సింగిల్స్‌)
  • మనీష్‌ నర్వాల్‌:షూటింగ్‌
  • అవని లేఖరా :షూటింగ్‌

 

రజతం

  • యోగేశ్‌ కతునియా: డిస్కస్‌ త్రో
  • నిషాద్‌ కుమార్‌: అథ్లెటిక్స్‌
  • మరియప్పన్‌ తంగవేలు :అథ్లెటిక్స్‌
  • ప్రవీణ్‌కుమార్‌ :అథ్లెటిక్స్‌
  • దేవేంద్ర జారియా: అథ్లెటిక్స్‌
  • సుహాస్‌ యతిరాజ్‌: బ్యాడ్మింటన్‌
  • సింగ్‌రాజ్‌ అధానా: షూటింగ్‌
  • భవీన పటేల్‌ :టేబుల్‌ టెన్నిస్‌

 

కాంస్యం

  • హర్విందర్‌ సింగ్‌ :ఆర్చరీ
  • శరద్‌ కుమార్‌ :అథ్లెటిక్స్‌
  • సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ :అథ్లెటిక్స్‌
  • మనోజ్‌ సర్కార్‌ :బ్యాడ్మింటన్‌
  • సింగ్‌రాజ్‌ అధానా :షూటింగ్‌
  • అవని లేఖరా :షూటింగ్‌