రేఖా చిత్రాలు

           డేటా ఇంటర్‌ప్రిటేషన్ (దత్తాంశాల అన్వయం) నుంచి పట్టికలు, రేఖాచిత్రాలు, బొమ్మల రూపంలోని దత్తాంశం నుంచి నిర్ణయాలు తీసుకోవడం లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో భాగంగా రేఖాచిత్రాలు (గ్రాఫ్స్) నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వీటిపై సునిశిత పరిశీలన, అవగాహన, సాధన ద్వారా పట్టు సాధించవచ్చు.

 

నమూనా - 1:

          1981 నుంచి 86 వరకు ఒక ఫ్యాక్టరీ ఉత్పత్తి(టన్నుల్లో)అమ్మకం టర్నోవర్లు(వేలల్లో) కింది గ్రాఫ్ తెలియజేస్తోంది.

1. పై వివరాలను పట్టిక రూపంలో తెలపండి.
2. 1981 నుంచి1986 వరకు సగటు ఉత్పత్తి ఎంత?
3. గ్రాఫ్‌లో చూపిన కాలానికి అమ్మకం టర్నోవర్ సరాసరి ఎంత?
4. ఉత్పత్తి, అమ్మకాల టర్నోవర్‌లను పోల్చి ఏ సంవత్సరంలో గరిష్ఠ లాభం పొందిందో తెలపండి.

 

సాధన: 1. జ)

2 జ) 1981 నుండి 86 వరకు సగటు ఉత్పత్తి

  = 3,00,000 కేజీలు


 

3 జ) 1981 నుంచి 86 వరకు సగటు అమ్మకం

= 661.66 × 1000  రూ.
= రూ. 6,61,666

 

4 జ) 1981లో అమ్మకం = రూ. 600 × 1000 = రూ. 6,00,000
        300 టన్నులకు లభించిన సొమ్ము = రూ.6,00,000
       టన్నుకు లభించిన సొమ్ము   
  1982లో 200 టన్నులకు లభించిన సొమ్ము = 500 × 1000 = రూ.5,00,000
       టన్నుకు లభించిన సొమ్ము  

      టన్నుకు లభించిన సొమ్ము = రూ. 2,500 
      1983లో 500 టన్నులకు లభించిన సొమ్ము = 720 × 1000 = రూ.7,20,000
      టన్నుకు లభించిన సొమ్ము  
      1984లో 100 టన్నులకు లభించిన సొమ్ము = 600 × 1000 = రూ. 6,00,000 

              1985లో 300 టన్నులకు లభించిన సొమ్ము = 750 × 1000 = రూ. 7,50,000
      టన్నుకు లభించిన సొమ్ము =   
     1986లో 400 టన్నులకు లభించిన సొమ్ము = 800 × 1000 = రూ.8,00,000
      టన్నుకు లభించిన సొమ్ము  
         1984 లో ఉత్పత్తి, అమ్మకం టర్నోవర్లను పోల్చితే గరిష్ఠ లాభం వచ్చింది.

నమూనా -2
           కింది రేఖా చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇచ్చినప్రశ్నలకు సమాధానాలివ్వండి.

1. 2004లో A, B కంపెనీల ఖర్చు సమానం. అయితే A, B కంపెనీల ఆదాయాల నిష్పత్తి?
2. 2007లో కంపెనీ A లాభం రూ.1.5 లక్షలు. అయితే ఆ సంవత్సరంలో ఖర్చు ఎంత?
3. కంపెనీ B అన్ని సంవత్సరాల్లో సరాసరి లాభశాతమెంత?
4. 2008లో A , B కంపెనీల రాబడి సమానం. అయితే ఆ సంవత్సరంలో ఆ కంపెనీల ఖర్చుల నిష్పత్తి ఎంత?
5. 2009లో కంపెనీ A, B ల లాభాల నిష్పత్తి ఎంత?

 

సాధన:
 

1. జ) 2004 లో A, B కంపెనీల ఖర్చు I అనుకోండి 
A కంపెనీ రాబడి = I1
B కంపెనీ రాబడి = I2 అయితే
కంపెనీ A                          కంపెనీ B 


                                     

2 జ) 2007 లో కంపెనీ A ఖర్చు రూ.x లక్షలు అనుకుంటే..

3 జ) కంపెనీ  B సరాసరి లాభశాతం (అన్ని సంవత్సరాల్లో)

4 జ) కంపెనీ A, B ల రాబడి 2008 లో రూ.x లక్షలు అనుకుంటే కంపెనీ A ఖర్చు E1, కంపెనీ B ఖర్చు E2 అయితే
కంపెనీ A                                 కంపెనీ B

కాబట్టి 2008 లో కంపెనీ A , B ల ఖర్చుల నిష్పత్తి = 13 :15

5 జ) ఈ ప్రశ్నను సాధించడానికి దత్తాంశంలోని  వివరాలు సరిపోవు.
 

నమూనా - 3:
 

          కింది రేఖా చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇచ్చినప్రశ్నలకు సమాధానాలివ్వండి.

1. కార్పెంటర్ x, కార్పెంటర్ y ఇద్దరూ కలిసి ఒక కుర్చీని ఎన్ని రోజుల్లో తయారుచేయగలరు?
2. కార్పెంటర్ x, కార్పెంటర్ y, కార్పెంటర్ z ముగ్గురూ కలిసి ఒక టేబుల్‌ను ఎన్ని రోజుల్లో తయారుచేయగలరు?
3. పై నాలుగు వస్తువులను ఒక్కొక్కటి తయారుచేయడానికి కార్పెంటర్ z కు ఎన్ని రోజులు పడుతుంది?

 

సాధన:
1 జ) x, y లు ఇద్దరూ కలిసి 1 రోజులో ఒక కుర్చీ తయారు చేయడానికి చేయగల పని = 

       కాబట్టి కుర్చీ తయారు చేయడానికి   రోజులు పడుతుంది 
2 జ) x, y, z లు ముగ్గురూ కలిసి 1 రోజులో ఒక టేబుల్ తయారుచేయడానికి చేయగల పని = 

       ముగ్గురూ కలిసి టేబుల్‌ను 1 రోజులో చేయగలరు.

నమూనా - 4:
 

            కింది రేఖాచిత్రాల్లో ఇచ్చిన ఒక కంపెనీకి చెందిన వివరాలను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలివ్వండి.

1. ఆ కంపెనీ సంవత్సరంలో చేసే సరాసరి ఖర్చు ఎంత?
2. ఏయే సంవత్సరాల్లో కంపెనీ లాభం గరిష్ఠం?
3. 1997లో లాభం 25 శాతం అయితే ఆ సంవత్సరంలో ఖర్చు ఎంత?
4. ముందు సంవత్సరంతో పోల్చితే ఏ సంవత్సరంలో లాభశాతంలో పెరుగుదల/ తరుగుదల కనిష్ఠం?
5. 1994లో కంపెనీ ఖర్చు ఎంత?

 

సాధన:
 

1 జ) మొత్తం ఖర్చు
       = (1-0.075)120 + (1-0.15)160 + (1-0.225)125 + (1-0.175)170 + (1-0.20)190 + (1-0.275)150
       = (0.925 × 120) + (0.85× 160) + (0.775 × 125) + (0.85 × 170) + (0.8 × 190) + (0.725 × 150)
       = రూ. 744.875
సరాసరి ఖర్చు   
                        = రూ. 124.15

 

2 జ) 1993 : 0.075 × 120 = రూ.9 లక్షలు 
        1994 : 0.15 × 160 = రూ.24 లక్షలు
        1995 : 0.225 × 125 = రూ.28.125 లక్షలు

       1996 : 0.175 × 170 = రూ.29.75 లక్షలు
       1997 : 0.20 × 190 = రూ.38 లక్షలు
       1998 : 0.275  × 150 = రూ.41.25 లక్షలు
       1998లో లాభం గరిష్ఠం

 

3 జ) 1997లో లాభం 25% అయితే ఖర్చు = (1-0.25)190 = రూ.142.5 లక్షలు

4 జ) లాభశాతంలో పెరుగుదల/ తరుగుదల
       1994 : 15 - 7.5 = 7.5
       1995 : 22.5 - 15 = 7.5
       1996 : 17.5 - 22.5 = -5
       1997 : 20 - 17.5 = 2.5
       1998 : 27.5 - 20 = 7.5
       1997లో గత సంవత్సరంతో పోల్చితే లాభశాతం కనిష్ఠం

 

5 జ) 1994లో కంపెనీ ఖర్చు = (1-0.15) × 160 = రూ.136 లక్షలు.