డేటా
ఇంటర్‌ప్రిటేషన్ (దత్తాంశాల అన్వయం) నుంచి పట్టికలు, రేఖా చిత్రాలు,
బొమ్మల రూపంలో ఇచ్చిన దత్తాంశాల నుంచి నిర్ణయాలు తీసుకోవడం లాంటి ప్రశ్నలు
వస్తాయి. ఇందులో భాగంగా బార్‌గ్రాఫ్స్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి అభ్యర్థులు సునిశిత పరిశీలన, అవగాహన, సాధన ద్వారా ఈ సమస్యలను
సాధించవచ్చు.
నమూనా-1
కింది చిత్రాన్ని పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి?
1. 1991 నుంచి 2001 వరకు జనాభాలో పెరుగుదల శాతం ఎంత?
సాధన: పెరుగుదల శాతం =
= 24.8%
2. ముందు సంవత్సరంతో పోలిస్తే ఏ సంవత్సరంలో జనాభా పెరుగుదల శాతం అత్యల్పంగా ఉంది?
సాధన: పై సమాచారం నుంచి 1971లో పెరుగుదల శాతం అత్యల్పం
3. ముందు సంవత్సరంతో పోలిస్తే ఏ సంవత్సరంలో జనాభా పెరుగుదల శాతం అధికంగా ఉంది?
సాధన: ముందు సంవత్సరం కంటే పెరుగుదల శాతం
= 24.82%
2001లో జనాభా పెరుగుదల శాతం అత్యధికం
4. 1951 నుంచి 2001 వరకు సరాసరి జనాభా పెరుగుదల శాతం ఎంత?
సాధన: 1951 నుంచి 2001 వరకు సరాసరి జనాభా పెరుగుదల
5. 2001లో జనాభా, 1951 సంవత్సరంలో కంటే ఎన్నిరెట్లు అధికంగా ఉంది?
నమూనా-2
కింది రేఖా చిత్రాన్ని పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి. 1998, 1999 సంవత్సరాల్లో ఒక కంపెనీ ఎగుమతి చేసిన వివిధ రకాలైన మొత్తం వాహనాల సంఖ్యను (లక్షల్లో) బార్ గ్రాఫ్ ద్వారా చూపారు.
1. 1998, 1999 సంవత్సరాల్లో మొత్తం ఎగుమతుల్లో ఏయే రకాల వాహనాల సంఖ్య సమానంగా ఉంది?
సాధన: 1998, 1999 సంవత్సరాల్లో మొత్తం ఎగుమతులు
A : 20 + 25 = 45 E : 25 + 20 = 45
A, E రకానికి చెందిన వాహనాల సంఖ్య సమానం.
2. 1998లో ఎగుమతి చేసిన E రకం వాహనాల సంఖ్యకు సమాన సంఖ్య ఉన్న ఏ రకం వాహనాలను 1999లో ఎగుమతి చేశారు?
సాధన: A, C
3. ఏ రకమైన వాహనాల్లో 1998 నుంచి 1999 మధ్యకాలంలో ఎగుమతైన వాహనాల్లో పెరుగుదల/ తగ్గుదల శాతంలో మార్పు అత్యల్పం?
సాధన: 1998లో కంటే 1999లో పెరుగుదల/ తగ్గుదల శాతం
D రకానికి చెందిన వాహనాల్లో మార్పు అత్యల్పం
4. 1999లో ఎగుమతిచేసిన E రకం వాహనాలు, 1998లో ఎగుమతిచేసిన D రకం వాహనాల్లో ఎంతశాతం?
సాధన: కావలసిన శాతం =
5. 1999 లో B ,C రకం వాహనాల సరాసరికి సమానంగా 1998 లో ఏరకమైన వాహనాలు ఎగుమతి చేశారు?
సాధన: 1999లో B, C రకానికి చెందిన వాహనాల సరాసరి
కాబట్టి 1998లో C రకానికి చెందిన వాహనాలకు సమానం.
నమూనా - 3
చిత్రాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి?
వివిధ సంవత్సరాల్లో వివిధ రకాలైన ఆటలు ఆడేవారి సంఖ్యను ఇక్కడున్న బార్‌గ్రాఫ్ తెలుపుతుంది.
1. 2006లో క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ మూడు ఆటలనూ ఆడేవారి సంఖ్యలో టెన్నిస్ ఆడేవారి శాతం ఎంత?
సాధన: 2006లో టెన్నిస్ ఆడేవారి సంఖ్య = 175 మిలియన్‌లు
క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ మూడూ ఆడేవారి సంఖ్య
= 300 + 275 + 175 = 750 మిలియన్‌లు.
టెన్నిస్ ఆడేవారి శాతం =
2. 2001 నుంచి 2006 సంవత్సరం వరకు ఫుట్‌బాల్ ఆడేవారి మొత్తం సంఖ్య ఎంత?
సాధన: 2001 నుంచి 2006 సంవత్సరం వరకు పుట్‌బాల్ ఆడేవారి మొత్తం
= (375 + 400 + 300 + 200 + 250 + 275) మిలియన్‌లు
= 1800 మిలియన్‌లు
3. 2006లో కంటే 2005లో టెన్నిస్ ఆడేవారి సంఖ్య ఎన్ని మిలియన్‌లు తక్కువ?
సాధన: 2006 లో టెన్నిస్ ఆడేవారి సంఖ్య = 175 మిలియన్‌లు
2005లో టెన్నిస్ ఆడేవారి సంఖ్య = 275 మిలియన్‌లు
2006, 2005 సంవత్సరాల్లో టెన్నిస్ ఆడేవారి సంఖ్యల మధ్య తేడా = 275 - 175 = 100 మిలియన్‌లు
100 మిలియన్‌లు తక్కువ.
4. 2003లో క్రికెట్, టెన్నిస్ ఆడేవారి నిష్పత్తి ఎంత?
సాధన: 2003 లో క్రికెట్, టెన్నిస్ ఆడేవారి నిష్పత్తి
= 375 : 325
= 15 : 13
5. 2001 నుంచి 2006 వరకు క్రికెట్ ఆడేవారి మొత్తం సంఖ్య ఎంత?
సాధన: 2001 నుంచి 2006 వరకు క్రికెట్ ఆడేవారి మొత్తం సంఖ్య
= (400 + 375 + 375 + 250 + 350 + 300)
= 2050 మిలియన్‌లు
నమూనా - 4
కింది దత్తాంశంలో ఒక పరీక్షకు సంబంధించిన గ్రేడులు ఉన్నాయి. ఈ
దత్తాంశానికి పౌనఃపున్య బహుభుజిని నిర్మించి, కింద ఇచ్చిన ప్రశ్నలకు
సమాధానాలివ్వండి?
పరీక్షా గ్రేడులు:
73, 92, 57, 89, 70, 95, 75, 80, 47, 88, 47, 48, 64, 86, 79, 72, 71, 77, 93, 55, 75,
50, 53, 75, 85, 50, 82, 45, 40, 82, 60, 55, 60, 89, 79, 65, 54, 93, 60, 83, 59
సాధన:
గ్రేడులు పౌనఃపున్యం
40 - 50 5
50 - 60 8
60 - 70 5
70 - 80 10
80 - 90 9
90 -100 4
i) 87 కంటే ఎక్కువ ఉన్న పరీక్షా గ్రేడులెన్ని?
సాధన: 87 కంటే ఎక్కువ వచ్చే పరీక్షా గ్రేడులు = 7
ii) 83 కంటే ఎక్కువ ఉన్న పరీక్షా గ్రేడుల శాతం ఎంత?
సాధన: 83 కంటే ఎక్కువ వచ్చే పరీక్షా గ్రేడుల శాతం =
iii) 72 కంటే తక్కువ ఉండే పరీక్షా గ్రేడుల శాతం ఎంత?
సాధన: 72 కంటే తక్కువ వచ్చే పరీక్షా గ్రేడుల శాతం =
iv) 72, 79 మధ్యలో ఉండే పరీక్షా గ్రేడుల శాతం ఎంత? (వీటితో కలిపి)
సాధన: 72, 79ల మధ్య (వాటితో కలిపి) వచ్చే పరీక్షా గ్రేడుల శాతం =