ద్వీపదేశాలు

        ఒకటి లేదా ఎక్కువ దీవులు లేదా ద్వీపభాగాలను కలిగి ఉన్న దేశాన్ని ద్వీపదేశం అంటారు. దీన్ని ఇంగ్లిష్‌లో ఐలాండ్‌ కంట్రీ అంటారు. కొన్ని ద్వీపదేశాలు, వాటి రాజధానులు తదితర వివరాలు.

పలావ్‌ (Palau)

  • ఇది పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలోని ఒక ద్వీపదేశం. ఇది సుమారు 500 దీవులను కలిగి ఉంది.
  • ఇందులో అత్యధిక జనాభా కలిగిన ద్వీపం కొరోర్‌.
  • ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియాలతో సముద్ర సరిహద్దులను కలిగి ఉంది.
  • దీని రాజధాని జెరుల్ముద్‌. జనాభా 18,214
  • అధికార భాషలు: పలవాన్‌, ఇంగ్లిష్‌.
  • గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు: జపనీస్‌, సోన్సోరోలిస్‌, టోబియన్‌
  • కరెన్సీ: యూఎస్‌ డాలర్‌.
  • అధ్యక్షుడు: సురాంజెల్‌ విప్స్‌

 

కిరిబతి

  • ఇది సెంట్రల్‌ పసిఫిక్‌లో గణతంత్ర ద్వీప రాజ్యం.
  • దీని రాజధాని తరావా.
  • అధికార భాషలు: ఇంగ్లిష్‌, గిల్బర్టీస్‌
  • కరెన్సీ: ఆస్ట్రేలియర్‌ డాలర్‌, కిరిబతి డాలర్‌.
  • జనాభా 1.19 లక్షలు.
  • అధ్యక్షుడు: టనేటి మామౌ

 

సింగపూర్‌

  • ఇది 704 చ.కి.మీ. (272 చ.మై) విస్తీర్ణంతో దక్షిణాసియాలోని చిన్న దేశం.
  • మతం: జనాభాలో 51 శాతం ప్రజలు బౌద్ధమతం, థాయిజం అవలంబిస్తున్నారు.
  • 15 శాతం క్రిస్టియన్లు, 14 శాతం ముస్లింలు, 15 శాతం ఏ మతం అవలబించనివారు కాగా, మిగతా శాతం సిక్కు, హిందూ, బహాయి మతంవారు ఉన్నారు.
  • భాషలు: జాతీయ భాష మలయ్‌.
  • అధికార భాషలు: మలయ్‌, మాండరిన్‌, ఇంగ్లిష్‌, తమిళం.
  • జాతీయ గీతం: మజులా సింగపుర
  • జనాభా: సుమారు 56.9 లక్షలు
  • అధ్యక్షుడు: హలిమా యాకోబ్‌

 

పపువా న్యూగినియా

  • ఇది నైరుతి పసిఫిక్‌లోని ద్వీపదేశం.
  • ఇది 1949 జూలై 1న ఆస్ట్రేలియా నుంచి స్వాతంత్య్రం పొందింది.
  • రాజధాని: పోర్ట్‌ మోర్స్‌బి
  • ఇక్కడి ప్రజలు 850కి పైగా భాషలు మాట్లాడుతారు.
  • విస్తీర్ణం: 4,62,840 చ.కి.మీ.
  • జనాభా: సుమారు 89.5 లక్షలు.
  • కరెన్సీ: పపువా న్యూగినియా కినా (పీజీకే)
  • ప్రధానమంత్రి: జేమ్స్‌ మరపే.

 

నౌరూ

  • ఇది సెంట్రల్‌ పసిఫిక్‌లోని ద్వీప దేశం.
  • రాజధాని: యరెన్‌
  • జనాభా: 10,834
  • కరెన్సీ: ఆస్ట్రేలియన్‌ డాలర్‌
  • అధికార భాషలు: నౌరుయన్‌, ఇంగ్లిష్‌
  • అధ్యక్షుడు: లియోనెల్‌ అయింజిమీ

 

ఐస్‌లాండ్‌

  • ఇది నార్త్‌ అట్లాంటిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశం.
  • జనాభా: సుమారు 3.66 లక్షలు.
  • రాజధాని: రెక్జావిక్‌
  • కరెన్సీ: ఐస్‌ల్యాండ్‌ క్రోనా
  • అధికార భాష: ఐస్‌ల్యాండిక్‌
  • అధ్యక్షుడు: గుయోని థోరియోసియస్‌ జొహాన్నెసన్‌

 

న్యూజిలాండ్‌

  • ఇది పసిఫిక్‌ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్నది.
  • రాజధాని: వెల్లింగ్టన్‌
  • పెద్ద నగరం: ఆక్లాండ్‌
  • అధికార భాషలు: మవోరి, ఇంగ్లిష్‌, న్యూజిలాండ్‌ సైన్‌ లాంగ్వేజ్‌.
  • జనాభా: సుమారు 50.8 లక్షలు
  • కరెన్సీ: న్యూజిలాండ్‌ డాలర్‌
  • ప్రధానమంత్రి: జసిండా అర్డెర్న్‌

 

ఫిజీ

  • ఇది దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో వసువటుకు తూర్పున, టోంగాకు పశ్చిమాన ఉంది.
  • అసలు పేరు: రిపబ్లిక్‌ ఆఫ్‌ ఫిజీ ఐలాండ్స్‌
  • రాజధాని: సువా
  • అధికార భాషలు: ఫిజియన్‌, ఇంగ్లిష్‌, ఫిజి హిందీ
  • జనాభా: సుమారు 8.96 లక్షలు
  • కరెన్సీ: ఫిజియన్‌ డాలర్‌
  • అధ్యక్షుడు: విలియమే కటొనివెరె

సమోవా

  • ఇది దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్నది.
  • రాజధాని: అపియా
  • అధికార భాషలు: సమోవా, ఇంగ్లిష్‌
  • జనాభా: సుమారు 1.98 లక్షలు
  • కరెన్సీ: సమోవాన్‌ టాల
  • ప్రధానమంత్రి: ఫ్లేమ్‌ నవోమి మట అఫా

 

సోలోమాన్‌ ఐలాండ్స్‌

  • ఇది పసిఫిక్‌ మహాసముద్రంలో పపువా న్యూగినియాకు తూర్పున, వనువటుకు వాయవ్య ప్రాంతంలో 900కి పైగా చిన్న ద్వీపాలను కలిగి ఉన్న దేశం.
  • రాజధాని: హొనియారా
  • జనాభా: 6.87 లక్షలు
  • అధికార భాష: ఇంగ్లిష్‌
  • కరెన్సీ: సోలోమన్‌ ఐలాండ్స్‌ డాలర్‌
  • ప్రధానమంత్రి: మనసెహ్‌ సొగొవరే

తువాలు

  • ఇది పసిఫిక్‌ మహాసముద్రంలో హవాయి, మధ్య ఆస్ట్రేలియాలకు తూర్పు ఈశాన్యం, నౌరు, కిరిబతిలకు పశ్చిమాన ఉంది.
  • రాజధాని: ఫునఫుటి
  • అధికార భాషలు: తువాలుయన్‌, ఇంగ్లిష్‌
  • దీని జనాభా 11,792
  • కరెన్సీ: తువాలుయన్‌ డాలర్‌, ఆస్ట్రేలియన్‌ డాలర్‌
  • ప్రధానమంత్రి: కౌసీ నతనో

 

మార్షల్‌ ఐలాండ్స్‌

  • ఇది పసిఫిక్‌ మహాసముద్రంలో భూమధ్యరేఖ సమీపంలో ఉన్న దేశం.
  • రాజధాని: మజురో
  • అధికార భాషలు: మార్షలీస్‌, ఇంగ్లిష్‌
  • జనాభా: 59,194
  • కరెన్సీ: యూఎస్‌ డాలర్‌
  • అధ్యక్షుడు: డేవిడ్‌ కబువా

 

ఇండోనేషియా

  • ఇండియా, పసిఫిక్‌ మహాసముద్రాల మధ్య ఉంది.
  • ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశం.
  • రాజధాని: జకార్త
  • అధికార భాష: ఇండోనేషియన్‌
  • జనాభా: 27.35 కోట్లు
  • కరెన్సీ: ఇండోనేషియా రూపియా
  • అధ్యక్షుడు: జొకొ విడొడొ

 

వనువటు

  • ఇది పసిఫిక్‌ మహాసముద్రంలో న్యూగినియాకు తూర్పున, సోలమన్‌ దీవులకు ఆగ్నేయ, ఫిజీకి పశ్చిమాన ఉంది.
  • రాజధాని: పోర్ట్‌ విలా
  • అధికార భాషలు: బిస్లామా, ఫ్రెంచ్‌, ఇంగ్లిష్‌
  • జనాభా: 3.07 లక్షలు
  • కరెన్సీ: వనువటు వటు
  • అధ్యక్షుడు: తలిస్‌ ఒబెడ్‌ మోసీ

 

ఫిలిప్పీన్స్‌

  • పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో సుమారు 7,641 ద్వీపాలను కలిగి ఉంది.
  • రాజధాని: మనీలా
  • అధికార భాషలు: ఫిలిపినో, ఇంగ్లిష్‌
  • జనాభా: 109,035,343
  • కరెన్సీ: పెసో
  • అధ్యక్షుడు: రొడింగో డుటెర్టీ
  • టోంగా
  • ఇది దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో 169 ద్వీపాలను కలిగి ఉంది.
  • రాజధాని: నుకు అలోఫా
  • అధికార భాషలు: టోంగన్‌, ఇంగ్లిష్‌
  • జనాభా: 1.06 లక్షలు
  • కరెన్సీ: టోంగన్‌ పాంగా
  • రాజు: టెపౌ-6

 

మాల్టా

  • ఇది మధ్యదరా సముద్రంలో ఉంది.
  • రాజధాని: వలెట్టా
  • అధికార భాషలు: మాల్టీస్‌, మాల్టీస్‌ సైన్‌ లాంగ్వేజ్‌, ఇంగ్లిష్‌
  • జనాభా: 5.25 లక్షలు
  • కరెన్సీ: యూరో
  • ప్రెసిడెంట్‌: జార్జ్‌ వెల్లా

 

యునైటెడ్‌ కింగ్‌డమ్‌

  • అట్లాంటిక్‌ మహాసముద్రం, ఉత్తర సముద్రం, ఇంగ్లిష్‌, ఐరిష్‌ సముద్రంతో ఆవరించి ఉన్న ద్వీప దేశం ఇది.
  • రాజధాని: లండన్‌
  • అధికార భాష: ఇంగ్లిష్‌
  • జనాభా: 6.72 కోట్లు
  • కరెన్సీ: పౌండ్‌ స్టెర్లింగ్‌
  • ప్రధానమంత్రి: బోరిస్‌ జాన్సన్‌

 

సైప్రస్‌

  • రిపబ్లిక్‌ ఆఫ్‌ సైప్రస్‌గా పిలిచే ఈ దేశం మధ్యదరా సముద్రంలో ఉంది.
  • రాజధాని: నికోషియా
  • అధికార భాషలు: గ్రీక్‌, టర్కిష్‌
  • జనాభా: 12.1 లక్షలు
  • కరెన్సీ: యూరో
  • ప్రెసిడెంట్‌: నికోస్‌ అనస్టసియాడెస్‌

 

బ్రూనై

  • దీనిని స్టేట్‌ ఆఫ్‌ బ్రూనై దారుస్సలామ్‌ లేదా నేషన్‌ ఆఫ్‌ దారుస్సలామ్‌, ది అబోడ్‌ ఆఫ్‌ పీస్‌గా పిలుస్తారు.
  • ఇది మలేషియా, దక్షిణ చైనా సముద్రం (పసిఫిక్‌ మహాసముద్రంలోని కొంతభాగం)లో చైనాకు అభిముఖంగా ఉంది.
  • రాజధాని: బందర్‌ సెరి బెగవాన్‌
  • అధికార బాషలు: మలయ్‌, ఇంగ్లిష్‌
  • జనాభా: 4.37 లక్షలు
  • కరెన్సీ: బ్రూనై డాలర్‌
  • ప్రధానమంత్రి: హసనల్‌ బొల్కియా

 

బహ్రెయిన్‌

  • కింగ్‌డమ్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ అని పిలిచే ఇది మిడిల్‌ ఈస్ట్‌లోని పర్షియన్‌ గల్ఫ్‌ పశ్చిమతీరంలో ఉంది.
  • రాజధాని: మనామా
  • అధికార భాష: అరబిక్‌
  • జనాభా: 17 లోలు
  • కరెన్సీ: బహ్రెయిన్‌ దినార్‌
  • ప్రధానమంత్రి: సల్మాన్‌ బిన్‌ హమద్‌ అల్‌ ఖలీఫా

 

ఐర్లాండ్‌

  • రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌గా పిలిచే ఇది అట్లాంటిక్‌ మహాసముద్రం చుట్టూ, సెల్టిక్‌ సముద్రం దక్షిణాన, ఆగ్నేయ దిశగా సెయింట్‌ జార్జ్‌ చానల్‌, తూర్పున ఐరిష్‌ సముద్రంతో ఉంది.
  • రాజధాని: డబ్లిన్‌
  • అధికార భాషలు: ఐరిష్‌, ఇంగ్లిష్‌
  • జనాభా: 49.9 లక్షలు
  • కరెన్సీ: యూరో
  • ప్రెసిడెంట్‌: మైఖేల్‌ డి. హిగ్గిన్స్‌

 

న్యూ క్యాలిడోనియా

  • ఇది దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో చాలా ద్వీపాలను కలిగి ఉంది.
  • రాజధాని: నౌమియా
  • అధికార భాష: ఫ్రెంచ్‌
  • జనాభా: 2.72 లక్షలు
  • కరెన్సీ: సీఎఫ్‌పీ ఫ్రాంక్‌
  • ప్రెసిడెంట్‌: లూయిస్‌ మపౌ

 

ఆస్ట్రేలియా

  • ఇది భూగోళం దక్షిణ భాగంలో, పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల మధ్య ఉంది.
  • రాజధాని: కాన్‌బెర్రా
  • అధికార భాష: ఇంగ్లిష్‌
  • జనాభా: 2.57 కోట్లు
  • కరెన్సీ: ఆస్ట్రేలియన్‌ డాలర్‌
  • ప్రధానమంత్రి: స్కాట్‌ మోరిసన్‌

 

నార్తర్న్‌ ఐర్లాండ్‌

  • ఇది యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో భాగం.
  • రాజధాని: బెల్‌ఫ్రాస్ట్‌.
  • అధికార భాష: ఇంగ్లిష్‌. స్థానిక భాషలు ఐరిష్‌, ఉస్తెర్‌ స్కాట్స్‌.
  • జనాభా: 18.9 లక్షలు
  • కరెన్సీ: పౌండ్‌ స్టెర్లింగ్‌.

 

గువామ్‌

  • ఇది పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలోని, యూఎస్‌ స్టేట్స్‌ అన్‌ఇన్‌కార్పొరేటెడ్‌, వ్యవస్థీకృత భూభాగం.
  • రాజధాని: హగట్నా
  • అధికార భాషలు: ఇంగ్లిష్‌, చమొరో
  • జనాభా: 1.69 లక్షలు
  • కరెన్సీ: యూఎస్‌ డాలర్‌
  • ప్రెసిడెంట్‌: జో బైడెన్‌