- కింజల్ అంటే రష్యన్ భాషలో పిడిబాకు.
- ‘కేహెచ్–47ఎం2 కింజల్’గా పిలిచే ఈ అత్యాధునిక క్షిపణులను రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018 మార్చి నెలలో ఆవిష్కరించారు. వీటిని ఐడియల్ వెపన్ (ఆదర్శ ఆయుధం)గా అభివర్ణించారు. ఇతర ఆధునిక క్షిపణులతో పోలిస్తే కింజల్ వేగం, కచ్చితత్వం చాలా ఎక్కువ.
- కింజల్ మిస్సైళ్లను గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగిస్తారు. ధ్వనివేగం కంటే 10 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్లగలవు. ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకునే సామర్థ్యం వీటి సొంతం. అడ్డొచ్చే క్షిపణులను, ఆయుధాలను నిర్వీర్యం చేస్తూ దూసుకెళ్తాయి.
- గంటలో ఏకంగా 12,350 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. భూమి లోతుల్లోకీ చొచ్చుకెళ్లగలవు.
- 1,500 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి.
- 480 కిలోల బరువైన సంప్రదాయ లేదా అణు పేలోడ్లను మోసుకెళ్తాయి. ఇది రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన ఫ్యాట్‌మ్యాన్ బాంబు బరువు కంటే 33 రెట్లు ఎక్కువ!
- టూ–22ఎం3 లేదా మిగ్–31కే ఇంటర్‌సెప్టర్ల నుంచి వీటిని ప్రయోగిస్తారు.
- ఇస్కాండర్–ఎం షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను అభివృద్ధి చేసి కింజల్ క్షిపణులను రూపొందించిందని రక్షణ నిపుణుల అంచనా.
- ఉక్రెయిన్‌పై యుద్ధంలో తొలిసారిగా కింజల్ హైపర్‌సోనిక్ ఏరో బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా