కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా నిర్ణయించే రేట్ల ప్రకారం జీ.ఎస్.టీ వసూలు చేస్తారు. జీ.ఎస్.టీ మండలి సిఫారసుల మేరకు ఈ రేట్లను నోటిపై చేస్తారు.
ఆర్టికల్ 279A ప్రకారం, కేంద్రం మరియు రాష్ట్రాల ఉమ్మడి వేదికగా ఉండే GST కౌన్సిల్ కింది సభ్యులను కలిగి ఉంటుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి - చైర్‌పర్సన్
కేంద్ర రాష్ట్ర మంత్రి, ఆర్థిక రెవెన్యూ ఇన్‌ఛార్జ్ - సభ్యుడు
ఆర్థిక లేదా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన మంత్రి - సభ్యులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ దిగువ అంశాలపై మండలి సిఫారసులు చేస్తుంది.
- జీఎస్టీ పరిధిలో విలీనమయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు విధించే పన్నులు సెస్లు, సర్చార్జీలు
- జీఎస్టీ పరిధిలోకి వచ్చే లేక మినహాయింపు పొందే సరుకులు, సేవలు
- పెట్రోలియం ముడిచమురు, హైస్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్ (దీనినే పెట్రోల్ అని పిలుస్తారు), సహజవాయువు, విమానాలలో ఉపయోగించే టర్బైన్ ఇంధనంపై జీఎస్టీ విధించే తేదీ
- నమూనా జీఎస్టీ చట్టాలు, సుంకాలకు సంబంధించిన సూత్రాలు, ఐజీఎస్టీ పంపిణీ, సరఫరా జరిగే ప్రాంతంలో పాటించాల్సిన సూత్రాలు
- జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన టర్నోవర్ పరిమితి
- పన్నురేట్లు, జీఎస్టీ బ్యాండ్స్తో కూడిన మౌలిక రేట్లతో సహా
- ప్రకృతి విపత్తులు లేదా ఉత్పాతాల సందర్భంగా నిర్ణీత కాలవ్యవధిలో అదనపు వనరుల సేకరణకు విధించే ప్రత్యేక రేటు లేదా రేట్లు
- ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు
- కౌన్సిల్ అభీష్టం మేరకి చేపట్టే మరే ఇతర అంశాలు
కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య, రాష్ట్రాల మధ్య జీస్టీకి సంబంధించి సంతులనం పాటించడం జీఎస్టీ మండలి యంత్రాంగం బాధ్యతగా ఉంటుంది. జీఎస్టీ వ్యవస్థలో సంతులన నిర్మాణం ఏర్పరచాల్సిన ఆవశ్యకత మరియు సరుకులు, సేవలకు జాతీయ మార్కెట్ సమన్వయపరచడం జీఎస్టీ మండలి నిర్వహించే వివిధ విదుల లక్ష్యంగా ఉంటుందని రాజ్యాంగ (నూటా ఒకటవ సవరణ) చట్టం సూచిస్తున్నది.
జీఎస్టీ మండలి ప్రతి నిర్ణయం సమావేశానికి హాజరై ఓటింగ్ లో పాల్గొన్న సభ్యుల వెయిటెడ్ ఓట్లలో 3/4 శాతం మొజారిటీతో జరగాలని రాజ్యాంగ (నూటా ఒకటవ సవరణ) చట్టం సూచిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఓటు వెయిటేజీ మొత్తం పడిన ఓట్లలో 1/3 వంతులు ఉంటుంది. అలాగే మొత్తం అన్ని రాష్ట్రాల ఓటింగ్ వెయిటేజీ ఆ సమావేశంలో పడిన మొత్తం ఓట్ల విలువలో 2/3 వంతులు ఉంటుంది. మొత్తం జీఎస్టీ మండలి సభ్యుల్లో సగం మంది హాజరైన పక్షంలో సమావేశానికి కోరం ఉన్నట్టుగా భావిస్తారు.