సంగెం లక్ష్మీబాయమ్మ

 జననం: 1911 

స్వస్థలం: ఘట్‌కేసర్‌ (హైదరాబాద్‌ ఈస్ట్‌ తాలూకా, ప్రస్తుత రంగారెడ్డి జిల్లా) 

తండ్రి: రామయ్య 


 

         1928లో సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించిన ఫలితంగా వెల్లూర్‌ జైల్లో ఒక సంవత్సరం జైలు జీవితం గడిపారు.

        1930లో ఉప్పు సత్యాగ్రహంలో ఈమె పాల్గొన్నారు. 

        1932లో సివిల్‌ డిస్‌ ఒబిడియన్స్‌ ఉద్యమంలో పాల్గొన్నందుకు 1933లో జైలుకు వెళ్లారు. ఇమ్రోజ్‌ పత్రికా సంపాదకుడు షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు కాల్చి చంపగా అతని కుటుంబ సభ్యులను వారి ఇంటికెళ్లి ఓదార్చిన ధీరవనిత. 

       1951లో ఆచార్య వినోబా భావె తెలంగాణలో ప్రారంభించిన భూదానోద్యమంలో పాల్గొన్నారు. 

       1952లో హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఇందిరా సేవా సదన్‌ ద్వారా అనాథ బాలికల విద్యావ్యాప్తికి కృషి చేశారు. 

      1952లో హైదరాబాద్‌ శాసనసభకు ఎన్నుకోబడి బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలో ఉపమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

        1957-71 సంవత్సరంలో లోక్‌సభ సభ్యురాలిగా పనిచేశారు. 

       1972లో తామ్రపత్ర పురస్కారం భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు.