రక్తసంబంధాలకు చెందిన చిత్రాలు గీయడంలో ఉపయోగించే ముఖ్యమైన
పరీక్షల్లో అడిగే వరుసలు
* అమ్మ సోదరి - పెద్దమ్మ/చిన్నమ్మ(ఆంటీ)
* నాన్న సోదరి - అత్త (ఆంటీ)
* అమ్మ సోదరుడు - మామ (అంకుల్)
* నాన్న సోదరుడు - పెదనాన్న / చిన్నాన్న (అంకుల్)
* సోదరుడు లేదా సోదరి - తోడపుట్టినవారు / అమ్మా, నాన్న పిల్లలు అమ్మ లేదా నాన్నల సోదరుడు లేదా సోదరి పిల్లలు - కజిన్
* బావ/బావమరిది - భార్య లేదా భర్త సోదరుడు లేదా సోదరి భర్త
* వదిన/మరదలు- భార్య లేదా భర్త సోదరి లేదా
* సోదరుని భార్య
1. ఒక కుటుంబంలో Q, P, R, S, T అనే అయిదుగురు వ్యక్తులు ఉన్నారు....
I. P, S లు పెళ్లయిన జంట.
II. S పురుషుడు కాదు.
III. T అనే వ్యక్తి P కుమారుడు, Q కుమారుడు P.
IV. T సోదరి R. అయితే S, Q కు ఏమవుతుంది?
ఎ) మనుమరాలు బి) కోడలు సి) కుమార్తె డి) తల్లి
సమాధానం: బి
వివరణ:
I. నుంచి P, S లు పెళ్లయిన జంట, కాబట్టి వారిని కింది విధంగా సూచించవచ్చు.
II. నుంచి S పురుషుడు కాదు. అంటే S స్త్రీ కాబట్టి
III. నుంచి T అనే వ్యక్తి P కుమారుడు, Q కుమారుడు P. ఈ సంబంధాన్ని కింది విధంగా సూచించవచ్చు.
IV. నుంచి T సోదరి R కాబట్టి, మొత్తం కుటుంబ చిత్రాన్ని కింది విధంగా సూచించవచ్చు.
పక్క చిత్రం ఆధారంగా, S, Q కుమారుడి భార్య, కాబట్టి S, Q కు కోడలు అవుతుంది.
2. A, B కు సోదరి. C, B కు తల్లి. D, C కు తండ్రి. E, D కు తల్లి. అయితే A, D కు ఏమవుతారు?
ఎ) మనుమరాలు బి) కుమార్తె సి) అత్త డి) తండ్రి
సమాధానం: ఎ
వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా మొత్తం కుటుంబ చిత్రాన్ని ఈ విధంగా సూచించవచ్చు.
3. P, Q, R, S, T, U అనే పిల్లలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. వారిలో P, T లు సోదరులు. T సోదరి U. P పినతండ్రి ఒకేఒక కుమారుడు R. Q, S లు R తండ్రి ఒకేఒక సోదరుడి కుమార్తెలు. అయితే R, U కు ఏమవుతారు?
ఎ) సోదరి బి) సోదరుడు సి) కుమారుడు డి) మామయ్య
సమాధానం: బి
వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా మొత్తం కుటుంబ చిత్రాన్ని పై విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం ఆధారంగా R, U కు సోదరుడు అవుతాడు.
4. P కుమారుడు Q. Q కుమార్తె X. X మేనత్త R. R కుమారుడు L. అయితే L, P కు ఏమవుతారు?
ఎ) మనుమడు బి) మనుమరాలు సి) కుమార్తె డి) మేనకోడలు
సమాధానం: ఎ
వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా కుటుంబ చిత్రాన్ని ఈ విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం ఆధారంగా L, P కు మనుమడు అవుతాడు.
5. Q తండ్రి B. B కు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. R సోదరుడు Q. P కుమార్తె R. P మనుమరాలు A. A తండ్రి S. అయితే S, Q కు ఏమవుతాడు?
ఎ) కుమారుడు బి) అల్లుడు సి) సోదరుడు డి) బావ
సమాధానం: డి
వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా, Q తండ్రి B. B కు ఇద్దరు పిల్లలు, R సోదరుడు Q. ఈ సంబంధాలను తెలిపే చిత్రాన్ని ఈ విధంగా రూపొందించవచ్చు.
చిత్రం నుంచి P, B లు భార్యాభర్తలు. P మనుమరాలు A. A తండ్రి S. కాబట్టి మొత్తం కుటుంబ చిత్రాన్ని ఈ విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం నుంచి S, Q కు బావ అవుతాడు.
6. A, Q, Y, Z లు వేర్వేరు వ్యక్తులు. Q తండ్రి Z. Y కుమార్తె A. Z కుమారుడు Y. Y కుమారుడు P. P సోదరుడు B అయితే .....
ఎ) B, Y లు సోదరులు బి) B సోదరి A సి) B మామయ్య Z డి) Q, Y లు సోదరులు
సమాధానం: బి
వివరణ: పై దత్తాంశం ఆధారంగా కుటుంబ చిత్రాన్ని కింది విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం ఆధారంగా B సోదరి A అనేది సరైంది.
7. K సోదరుడు D, సోదరి M. T అనే వ్యక్తి R తండ్రి, M సోదరుడు R. K తల్లి F. అయితే T, F లకు కనీసం ఎంతమంది కుమారులు ఉంటారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) చెప్పలేం
సమాధానం: ఎ
వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా కుటుంబ చిత్రాన్ని కింది విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం నుంచి R, M, K, D లు T, F ల పిల్లలు. ఇచ్చిన దత్తాంశం ఆధారంగా K లింగాన్ని నిర్దిష్టంగా పేర్కొనలేదు. D, R లు T, F మగ సంతానం. కాబట్టి T, F లు కనీసం ఇద్దరు మగ సంతానాన్ని కలిగి ఉంటారు.