- విభిన్న రకాల నైసర్గిక స్వరూపంతో భౌగోళికంగా, రాజకీయంగా ప్రత్యేక ఉనికిని, విశిష్ఠతను కలిగి ఉంది.
- భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమి తాను రాసిన ది గైడ్ టు జియోగ్రఫి గ్రంథంలో తైలంగులు అనే తెగను గురించి పేర్కొన్నాడు. తైలంగులు నివసించే ప్రాంతంలోని నదిని తెలివాహ నది అని తెలిపాడు. అదే గోదావరి నది.
- కాకతీయుల అనంతరం ఢిల్లీ సుల్తాన్‌ల వజీరు మాలిక్ మక్బూల్ పరిపాలించిన వరంగల్ ప్రాంతాన్ని త్రిలింగాన్ అని పిలిచారు. త్రిలింగాన్ పేరుమీదుగా తెలంగాణ అనే పేరు వచ్చినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
- తెలంగాణ ప్రాంతం పౌరాణిక వాజ్ఞయంలో దక్షిణాపథంలో ఉండేది అని పేర్కొన్నారు. దక్షిణాపథం అంటే నర్మద-తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం అని, దక్షిణ భారతేదేశానికి మార్గం అని అర్థం.
- తెలంగాణ ఉనికి రీత్యా ఉన్న గోళార్ధం- ఉత్తరార్ధ గోళం
- తెలంగాణ ఉనికి రీత్యా ఉన్న ప్రాంతం- దక్షిణాసియా
- తెలంగాణ ఉనికి రీత్యా ఉన్న భారతప్రాంతం- దక్షిణ భారతదేశం
- తెలంగాణ ఉనికి రీత్యా విస్తరించిన పీఠభూమి- దక్కన్ పీఠభూమి
- దక్కన్ పీఠభూమి అతిపురాతన అగ్ని, నీస్, సిస్ట్ శిలలతో ఏర్పడింది.
- గమనిక: బౌద్ధమతానికి ప్రసిద్ధిగాంచిన బౌద్ధస్థూపం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఉంది. ఈ ప్రాంతాన్ని టాలమీ తన గ్రంథంలో నెల్‌సిండాగా పేర్కొన్నాడు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అంశాలు..
- తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం- 2014, ఫిబ్రవరి 6
- తెలంగాణ బిల్లు లోక్‌సభలో ప్రవేశం- 2014, ఫిబ్రవరి 13
- తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం- 2014, ఫిబ్రవరి 18 (కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే)
- రాజ్యసభలో ఆమోదం- 2014, ఫిబ్రవరి 20 (డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్)
- తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర- 2014, మార్చి 1
- తెలంగాణ గెజిట్ ప్రకటన- 2014, మార్చి 2
- తెలంగాణ అపాయింటెడ్ డే (ఆవిర్భావ దినం) జూన్ 2గా ప్రకటన- 2014, మార్చి 4
- ఫలితంగా 2014, జూన్ 2న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
- జూలై 17న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు.
- కుకునూరు, కూనవరం, వేలేరుపాడు, వరరామచంద్రపురం, చింతూరు మండలాలను ఎన్‌డీఏ ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపివేసింది.
- పాక్షికంగా కోల్పోయిన మండలాలు భద్రాచలం, బూర్గంపహాడ్.
- భద్రాచలం పట్టణం మినహా, భద్రాచలం మండలం నుండి 73 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామపంచాయతీలను బూర్గంపహాడ్ మండలం నుంచి 6 రెవెన్యూ గ్రామాలు, 4 గ్రామపంచాయతీలను కోల్పోవడం జరిగింది.
- దీనిప్రకారం తెలంగాణ 327 రెవెన్యూగ్రామాలను, 87 గ్రామపంచాయతీలను కోల్పోయింది.
- దీని ప్రకారం 2.76 లక్షల హెక్టార్ల విస్తీర్ణం, ఇందులో 2 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం, 1.90 లక్షల జనాభాను తెలంగాణ కోల్పోయింది.
- దీంతో భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ.గా ఉంది.
తెలంగాణ విస్తరణ
- భారతదేశ ద్వీపకల్పంలో తెలంగాణ అక్షాంశాల దృష్ట్యా 150 50| ఉత్తర అక్షాంశాల మధ్య, రేఖాంశాల దృష్ట్యా 770 15| నుంచి 810 19| తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
- అక్షాంశాల మధ్య విస్తృతి దక్షిణాన గద్వాల జిల్లా నుంచి ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లాల మధ్య విస్తరించి ఉంది. రేఖాంశాల దృష్ట్యా విస్తృతి పడమర మహబూబ్ నగర్ జిల్లా నుంచి తూర్పున భద్రాది కొత్తగూడెం జిల్లాల మధ్య విస్తరించి ఉంది.
- తెలంగాణకు తీరరేఖ, అంతర్జాతీయ సరిహద్దులు లేవు. అందువల్ల దీన్ని భూ పరివేష్టిత రాష్ట్రం (La-d Locked State) అని పిలుస్తారు.
- ఇది దేశంలో 5వ భూపరివేష్టిత రాష్ట్రం.
- తెలంగాణలో చివరగా 1978, ఆగస్టు 15న (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది.
- ప్రస్తుతం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.
- కొత్త జిల్లాల ఏర్పాటు కోసం 2016, ఆగస్టు 10న ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అయిన మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయ్యింది. దీనిప్రకారం పాత 10 జిల్లాలకు అదనంగా 17 జిల్లాలను సూచిస్తూ ముసాయిదాను ప్రకటించారు.
- ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అదనంగా కావాల్సిన జిల్లాల ఏర్పాటుపై రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఆధ్వర్యంలో హైపర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, జీ జగదీశ్వర్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
- ఈ కమిటీ ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న జిల్లాలు కాకుండా అదనంగా 4 జిల్లాల (రాజన్న సిరిసిల్ల, జనగామ, జోగుళాంబ గద్వాల, కుమ్రం భీం ఆసిఫాబాద్)ను సిఫారసు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 31కి చేరింది.
- కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలు 2016, అక్టోబర్ 11 (దసరా)న అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జిల్లాలు విభజించిన విధానం…
- వరంగల్ జిల్లాను అత్యధికంగా 5 జిల్లాలుగా విభజించారు. అవి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్
- కరీంనగర్ జిల్లాను కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలుగా విభజించారు.
- ఆదిలాబాద్ జిల్లాను విభజించి ఆదిలాబాద్‌తోపాటు కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేశారు. అవి.. నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్.
- మహబూబ్‌నగర్ జిల్లాను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, బోగుళాంబ గద్వాల జిల్లాలుగా విభజించారు.
- నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలను ఏర్పాటు చేశారు.
- రంగారెడ్డి జిల్లాను విభజించి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలను ఏర్పాటు చేశారు.
- మెదక్ జిల్లాలో కొత్తగా సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి మెదక్ మొత్తం మూడు జిల్లాలుగా ఏర్పాటైంది.
- నిజామాబాద్ జిల్లాలో కొత్తగా కామారెడ్డిని జిల్లాగా ఏర్పాటు చేశారు.
- ఖమ్మం జిల్లాను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా విభజించారు.
- హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగించారు.
- అత్యధికంగా కొత్త జిల్లాలు: వరంగల్ నుంచి 4
- అత్యల్పంగా కొత్త జిల్లాలు: నిజామాబాద్, ఖమ్మం నుంచి 1 చొప్పున ఏర్పడ్డాయి.
- ఎటువంటి మార్పులకు లోనుకాని జిల్లా: హైదరాబాద్
జిల్లాలు-రెవెన్యూ డివిజన్లు
- పాతవి కొత్తవి మొత్తం
- జిల్లాలు 10 21 31
- రెవెన్యూ డివిజన్లు 43 25 68
- మండలాలు 459 125 584
- గ్రామ పంచాయతీలు 8695
- రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య: 68
- అధిక రెవెన్యూ డివిజన్లు కలిగిన జిల్లా: రంగారెడ్డి (4)
- తక్కువ రెవెన్యూ డివిజన్ల జిల్లాలు: వరంగల్ అర్బన్ (1), వనపర్తి (1), రాజన్న సిరిసిల్ల (1), జోగుళాంబ గద్వాల (1)
- రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య: 584
- అత్యధిక మండలాలు గల జిల్లాలు: నల్లగొండ (31), రంగారెడ్డి (27), నిజామాబాద్ (27)
- అత్యల్ప మండలాలు గల జిల్లాలు: వరంగల్ అర్బన్ (11), జోగుళాంబ గద్వాల (12)
- రాష్ట్రంలో మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య: 8695
- అత్యధిక గ్రామపంచాయతీలుగల జిల్లాలు: నల్లగొండ (502), సంగారెడ్డి (472)
- అతి తక్కువ గ్రామపంచాయతీలుగల జిల్లా: మేడ్చల్ మల్కాజిగిరి (77)
- గ్రామ పంచాయతీలు లేని జిల్లా: హైదరాబాద్
ప్రజాప్రతినిధులు
- రాష్ట్రంలోని మండల ప్రజాపరిషత్‌లు- 438
- ఎంపీటీసీలు- 6476
- ఎంపీపీలు- 438
- రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్‌లు- 9
- జెడ్‌పీటీసీలు- 438
- జిల్లా పరిషత్ లేని జిల్లా- హైదరాబాద్
- లోక్‌సభ స్థానాలు- 17
- రాజ్యసభ స్థానాలు- 7
- మొత్తం శాసనసభ్యుల సంఖ్య (ఎమ్మెల్యేలు)- 119+1 (ఒక సభ్యుడిని గవర్నర్ నామినేట్ చేస్తారు)
- శాసనమండలి స్థానాల సంఖ్య- 43
- పట్టణ స్థానిక సంస్థలు- 68
- మున్సిపల్ కార్పొరేషన్లు- 6 (హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం)
- మున్సిపాలిటీలు- 37
- నగర పంచాయతీలు- 25
తెలంగాణతో సరిహద్దు కలిగిన రాష్ర్టాలు
- పశ్చిమ, నైరుతి దిశలో- కర్ణాటక
- వాయవ్య, ఉత్తర, ఈశాన్య దిశలో- మహారాష్ట్ర
- తూర్పున ఛత్తీస్‌గఢ్
- ఆగ్నేయ, దక్షిణ, నైరుతి దిశలో- ఆంధ్రప్రదేశ్
- గమనిక: ఖమ్మం జిల్లాలోని మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల ఒడిశాతో సరిహద్దును కోల్పోయింది.
- కర్ణాటకతో సరిహద్దుగల జిల్లాలు (5): జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి
- మహారాష్ట్రతో సరిహద్దు గల జిల్లాలు (7): కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి
- ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు గల జిల్లాలు (7): జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
- ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు గల జిల్లాలు (2): జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం