జాగీర్లను మొత్తం 9 రకాలుగా వర్గీకరించారు. అవి..
1) తనఖా జాగీర్లు
2) జత్ జాగీర్లు
3) పైగా జమియత్ జాగీర్
4) ఇలాహత్ జాగీర్
5) అల్ తమ్లా జాగీర్
6) మదద్-ఇ-మాష్ జాగీర్
7) మష్‌రూత్ జాగీర్
8) సర్ఫ్-ఇ-ఖాస్ జాగీర్
9) ఇలాకస్ జాగీర్
తనఖా జాగీర్: ఇంటిలెజెన్స్ సర్వీస్, మిలిటరీ, బాడీగార్డ్ పనులు చేసేవారికి జీతాలకు బదులుగా ఇచ్చే భూమిని తనఖా జాగీర్ అనేవారు.
జత్ జాగీర్: తమ జీవితకాలం మొత్తంలో నవాబులకు, నిజాంలకు, రాజులకు సేవలు చేసేవారికి ఇచ్చే భూములు. ఇలాంటి భూమిపై ఎలాంటి పన్నులు కానీ, శిస్తులు కానీ ఉండేవి కావు. అయితే ఇది రానురాను వారి వంశపారపర్య అనుయాయులకు బదిలీ అయ్యింది.
పైగా జమియత్ జాగీర్: నిజాం సంస్థానంలో గుర్రపు సైన్యాన్ని నిర్వహించిన వారసులకు ఇచ్చే భూమి ఇది. దీన్నే జగిరిత్-ఇ-నిగ్ధాస్టి జామతి అని అనేవారు.
వీళ్లలోనే ఆసామి జాహి, ఖర్షీద్ జాహి, వికాస్-ఉల్-ఉమ్రా అనే రకరకాల పైగా జమియత్‌లు ఉండేవారు.
ఇలాహత్ జాగీర్: వీరినే ఉమ్రా-ఇ-అజాన్ అనేవారు. నిజాం కుటుంబానికి వ్యక్తిగతంగా సేవలందించేవారికి ఈ భూములను ఇచ్చేవారు.
అల్ తమ్లా జాగీర్: నిజాంకు ఉన్న ప్రత్యేక సేవకులకు ఈ
భూములను ఇచ్చేవారు. ఇది వారసత్వంగా సంక్రమింపజేసుకోవచ్చు. కానీ వేరేవారికి
అమ్మడంకానీ, దానంగా ఇవ్వడం కానీ చేయొద్దు.
మదద్-ఇ-మాష్ జాగీర్: దివ్యాంగులు, అనాథలు మొదలైనవారికి స్వచ్చందంగా సేవలు చేస్తున్నవారికి ఇచ్చే భూములు.
మష్‌రూత్ జాగీర్: మతపర వ్యవస్థలకు సేవ చేసేవారికి ఇచ్చే భూమి.
సర్ఫ్-ఇ-ఖాస్: ఇది నిజాం ప్రభువు సొంత జాగీర్.
ఇలాకాలు: పైగా జాగీర్ల కింద ఉండేవారిని ఇలాకాలు అంటారు. వీరినే ఉమ్ర-ఇ-ఒజ్జం అని అంటారు.
నిజాం కోసం తమ జీవితాన్ని దారపోసినవారిని ఖూన్ బహా జాగీర్ అనేవారు