అశోకుని శిలాశాసనాలు

 

1వ శిలాశాసనం: ఈ శాసనంలో జంతుబలిని, విందులు, వినోదాలను నిషేధించారు. (ఈ శాసనంలో ప్రియదస్సి అనే పేరు కనిపిస్తుంది. ప్రియదస్సి అనగా దేవుని ప్రేమకు నోచుకున్న వారు అని అర్థం)
2వ శిలాశాసనం : మనుషులకు, జంతువులకు వైద్య సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, నీటిబావుల తవ్వకం, రోడ్లకిరువైపులా చెట్లను నాటడం ముఖ్యంగా ఔషధాలకు అవసరమయ్యే మొక్కలు పెంచడం మొదలైన ప్రజాహిత కార్యక్రమాలు పేర్కొన్నారు. (తమిళ రాజ్యాలైన చోళ, పాండ్యరాజ్యాల గురించి ప్రస్తావించారు)
3వ శిలాశాసనం : అశోకుడు బ్రాహ్మణులకు, శ్రమణులందరికీ సమానమైన గౌరవం ఇచ్చినట్లు తెలుపుతుంది. దీనిద్వారా అశోకుని మత సహన విధానం గురించి తెలుస్తుంది.
4వ శిలాశాసనం : అశోకుని ధర్మవిధానం గురించి ప్రధానంగా వివరించారు. ఈ ధర్మవిధానం వల్లనే అశోకుడు దేవానాం ప్రియ, ప్రియదర్శి అనే బిరుదులకు తగినవాడుగా చెప్పారు. ఇందులో అశోకుడు ధర్మభేరిని మోగించినట్లు, ధర్మభేరి, ధర్మప్రచారాన్ని సూచిస్తుంది. జంతువుల పట్ల ఆదరణ, బంధువుల పట్ల ప్రేమ, అహింస పాటించాలని పేర్కొన్నారు.

5వ శిలాశాసనం : అశోకుని సంక్షేమ చర్యలు తెలియ జేస్తాయి. వాటిలో ప్రధానంగా యజమాని సేవకుల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఖైదీలను సరిగా చూడాలని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారులను నియమించాడు. ధర్మ మహామాత్యుల ద్వారా ప్రజల సాంఘిక జీవనంలో ప్రభుత్వ జోక్యం ఆరంభమైనట్లు భావించచ్చు.
6వ శిలాశాసనం : అశోకుడు బౌద్ధ సంఘంలో చేరినట్లు బౌద్ధ సన్యాసిగా 250 రాత్రులు గడిపినట్లుగా ఉంది. అన్ని సమయాల్లో అనగా అంతఃపురంలో ఉన్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు అధికారులు ప్రజా సమస్యలను తమకు నివేదించవచ్చునని ప్రకటించారు. ఈ శిలాశాసనంలో అశోకుడు ప్రజలందరూ నా బిడ్డలే అని పేర్కొన్నాడు.
7వ శిలాశాసనం : ప్రజలలో ఐకమత్యం సాధించాలని ఆశించారు. తెగలు, వర్గాల మధ్య పరస్పరం సహనం ఉండాలని పేర్కొన్నారు.
8వ శిలాశాసనం : ధర్మయాత్రల ద్వారా గ్రామీణులతో నిత్యసంబంధం కలిగి ఉండాలని తెలిపారు.
9వ శిలాశాసనం : అశోకుడు నిరాడంబరతను ప్రతిపాదించాడు. అర్థం లేని ఖర్చుతో కూడిన క్రతువుల పట్ల వ్యతిరేకత ప్రదర్శించాడు.
10వ శిలాశాసనం : తన ప్రజలందరూ (ధర్మాన్ని) సత్ప్రవర్తనను అలవరుచుకోవాలని కోరాడు.
11వ శిలాశాసనం : అశోకుడు నిరాడంబర జీవనానికి ప్రాధాన్యమిస్తూ తాను ఏర్పరిచిన ధర్మం సర్వామోదమైనదిగా తెలిపాడు. ఈ శాసనంలో కుటుంబ జీవనం, సంఘ జీవనం ఎంతో ప్రశాంతంగా ఉండాలని అశోకుడు భావించాడు. దమ్మను విస్తరించాలని తెలిపాడు.

12వ శిలాశాసనం: మతసహనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు.
13వ శిలాశాసనం : కళింగ యుద్ధం గురించి పేర్కొన్నాడు. కళింగ యుద్ధానంతరం అశోకునిలో వచ్చిన మార్పు భేరీఘోషకు బదులు ధర్మఘోష వినిపించాలని దండయాత్రలకు బదులు ధర్మయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు.

-ఆంధ్రుల గురించి ఈ శాసనంలో పేర్కొన్నారు.
14వ శిలాశాసనం : ఇందులో రెండు ప్రత్యేక శిలాశాసనాలు ఉన్నాయి.
-న్యాయంగా నిష్పాక్షికంగా వ్యవహరించాలని అధికారులను కోరాడు.
-కొండజాతి ప్రజల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, యువరాజులకు సలహాలు ఇచ్చాడు.

 

ఇతర శాసనాలు

1. కాందహార్ శాసనం: అశోకుని ధర్మవిధానం చేపలు పట్టేవారు, ఆటవికులను వ్యవసాయం చేసేటట్లు చేసిందని తెలియజేస్తుంది. ఇది రెండు భాషల్లో (గ్రీకు, అరామిక్) చెక్కారు.
2.రుమ్మిందై స్తంభశాసనం : సింహాసనం అధిష్టించిన 20 ఏండ్లకు లుంబిని ప్రాంతాన్ని అశోకుడు సందర్శించినట్లు ఉంది. లుంబిని ప్రాంతం నుంచి 1/8వ వంతు శిస్తు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
3.సాగర్‌స్తంభ శాసనం: కొనకమన బుద్ధ స్తూపాన్ని అశోకుడు రెట్టింపు చేసిన విషయం తెలియజేస్తుంది.
4. బబ్రూ శాసనం : బౌద్ధం పట్ల విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
5. దౌళి, జౌగడ శాసనాలు : హింసా వ్యతిరేకత, యుద్ధం పట్ల విముఖత.

-అశోకుడు అందరూ నా బిడ్డలే అని పేర్కొన్నాడు.
6. ఎర్రగుడి శాసనం: విద్యార్థుల్లో కూడా ధర్మాసక్తి కలిగించాలని అశోకుడు ఉపాధ్యాయులకు సూచించారు.
7. అలహాబాద్/ రాణిశాసనం: కారువాకి, తివరల గురించి పేర్కొన్నారు.
8.మహాస్థానా: కరువు సమయంలో తీసుకొనే చర్యలను ప్రస్తావించారు.
9. సోపారా : అశోకుడి లౌకిక విధానాన్ని తెలియజేస్తుంది.