విపత్తు నిర్వహణ - గతంలో అడిగిన ప్రశ్నలు

1. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎక్స్ అఫీషియో ఛైర్మన్? (2011, గ్రూప్ 2)

Answer: ప్రధానమంత్రి

 

2. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఎవరి నిర్వహణలో ఉంటుంది? (2016, గ్రూప్ 2)

Answer: హోంమంత్రి

 

3. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP)ను ప్రధాని ఎప్పుడు విడుదల చేశారు? (2016 డిప్యూటీ సర్వేయర్)

Answer: 2016, జూన్ 1

 

4. సార్క్ విపత్తు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4)

Answer: కాఠ్‌మాండూ

 

5. నేషనల్ సివిల్ డిఫెన్స్ సర్వీస్ కాలేజ్ ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4; 2013, పంచాయతీ సెక్రటరీ)

Answer: నాగ్‌పుర్

 

6. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? (2011, గ్రూప్ 1)
Answer: 2005, డిసెంబరు 23

 

7. క్షామం వల్ల ఎవరు ఎక్కువగా బాధపడతారు? (గ్రూప్-4, 2012)

Answer: మహిళలు

 

8. భారతదేశంలో కరవు దేనితో ముడిపడి ఉంది? (పంచాయతీ కార్యదర్శి - 2013)

Answer: రుతు పవనాలు

 

9. భారతదేశంలో వరదలకు గురయ్యే ప్రదేశం సుమారు ఎంత శాతం ఉంది? (గ్రూప్-2, 2012)

Answer: 12%

 

10. 2016 కరవు నిర్వహణ కరదీపిక ప్రకారం దీర్ఘకాలిక కరవును ఎంత వర్షపాతం ఉంటే ప్రకటిస్తారు? (గ్రూప్-1, 2017)

Answer: 750 mm కంటే తక్కువ