విశాఖలోని తూర్పునౌకాదళ సాముద్రిక ఆడిటోరియంలో మిలాన్-22ను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్
feb 26 న ప్రారంభించారు. అంతర్జాతీయ సముద్ర జలాలను అన్ని దేశాలు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు స్వేచ్ఛగా
వినియోగించుకునే పరిస్థితులు ఉండాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆకాంక్షించారు.
భారత
నౌకాదళం నిర్వహిస్తున్న ‘మిలాన్-22’ కార్యక్రమం మహోజ్వల ఘట్టమని, 1995లో నాలుగు దేశాలతోనే
ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం 39 దేశాల నౌకాదళాల ప్రతినిధులు, 13 విదేశీ యుద్ధనౌకలు వచ్చాయన్నారు.
కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి ‘స్పెషల్ డే కవర్’, మిలాన్‌పై లఘు చిత్రాలను విడుదల చేశారు.