తెలంగాణ-ఖనిజ వనరులు

ఖనిజం: భూమి లోపల నుంచి తవ్వితీసే దాన్ని ఖనిజం అంటారు. నీరు కూడా ఒక ఖనిజమే.

ఖనిజ వనరులు

  • భూమిలోపల సహజసిద్ధంగా లభించే రాతి సమ్మేళనాలను ఖనిజ వనరులు అంటారు.
  • ఖనిజ వనరుల అధ్యయనాన్ని మినరాలజీ అంటారు.
  • ఖనిజాలు పునరుత్పత్తి చేయలేని వనరులు.
  • 1958, నవంబర్‌లో ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ను ఏర్పాటు చేశారు.
  • తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎండీసీ)ను 2014, అక్టోబర్ 8న ఏర్పాటు చేశారు.
  • దేశంలో ఖనిజ సంపద (నిల్వలు) ద్వీపకల్ప పీఠభూమి, కొండలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నది.
  • ఖనిజ నిల్వలు గంగా సింధు, బ్రహ్మపుత్ర మైదానాల పరివాణాల్లో తక్కువగా కేంద్రీకృతమై ఉన్నది.
    గమనిక: 1993-94లో నూతన జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారు.
  • దేశంలో చోటానాగ్‌పూర్ పీఠభూమిని మినరల్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
  • దేశంలో ఖనిజ ఎక్స్‌ప్లోటేషన్ వల్ల అధిక రెవెన్యూను ఆర్జిస్తున్న రాష్ట్రం- ఒడిశా
  • మైనింగ్, ఖనిజాల రంగం నుంచి 2016-17లో రూ. 2687.87 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. (2016 డిసెంబర్ నాటికి రూ. 1712 కోట్లు సాధించింది)
  • 2015-16 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 3.3 శాతం.
  • 2016-17 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగంవాటా 3.1 శాతం.

 

ఖనిజాల వర్గీకరణ

     ఖనిజాలను ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..

1. లోహ ఖనిజాలు
-ఫెర్రస్ ఖనిజాలు: ఇనుము, మాంగనీస్, కోబాల్ట్, నికెల్
-నాన్ ఫెర్రస్ ఖనిజాలు: రాగి, సీసం, తగరం, జింక్, బాక్సైట్
-విలువైన ఖనిజాలు: బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు

2. అలోహ ఖనిజాలు:
-మైకా, సున్నపురాయి (లైమ్‌స్టోన్), ముగ్గురాయి (బెరైటీస్), ఆస్‌బెస్టాస్ (రాతినార), గ్రాఫైట్, గ్రానైట్.

3. ఇంధన ఖనిజాలు:
-బొగ్గు, పెట్రోలియం

4. అణు ఖనిజాలు:
-యురేనియం, థోరియం, జిర్కోనియం, ఇల్మనైట్

 

లోహ ఖనిజాలు

ఇనుము: 

    ఇనుప ఖనిజాన్ని నాణ్యత ఆధారంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి…
1. మాగ్నటైట్- ఫెర్రస్ శాతం 72 (కనిష్టం)
2. హెమటైట్- ఫెర్రస్ శాతం 70 (గరిష్టం)
3. లిమోనైట్- ఫెర్రస్ శాతం 60
4. సెడిరైట్- ఫెర్రస్ శాతం 50
-దేశంలో, రాష్ట్రంలో ఇనుము ఎక్కువగా హెమటైట్ రూపంలో లభిస్తుంది. మాగ్నటైట్ రూపంలో తక్కువగా లభిస్తుంది.
-దేశంలో మొదటి ఇనుపగని జార్ఖండ్‌లోని సింగ్భమ్.
-దేశంలో ఇనుప ఖనిజం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్.
-అతిపెద్ద ఇనుపగని ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లాలో ఉంది. బైలదిల్ల అంటే ఎద్దు మూపురం అని అర్థం.

ఉత్పత్తి..

-ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా, దేశంలో అధికంగా కర్ణాటకలోని కుద్రేముఖ్‌లో, తెలంగాణలో బయ్యారం (మహబూబాబాద్)లో ఇనుప ఖనిజం లభిస్తుంది. కుద్రేముఖ్ అంటే గుర్రం ముఖం అని అర్థం.

-రాష్ట్రంలో ఇనుప నిక్షేపాలు ఉమ్మడి ఆదిలాబాద్, కొత్తగూడెం, బయ్యారం, కరీంనగర్, చెరువుపురం, నావపాడులో ఉన్నాయి.
గమనిక: చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రేవు ద్వారా ఇనుప ఖనిజం జపాన్, దక్షిణ కొరియాలకు ఎగుమతి అవుతుంది.
-గోవాలోని ఇనుప ఖనిజం మర్మగోవా ఓడరేవు ద్వారా స్పాంజ్ ఐరన్ రూపంలో జపాన్‌కు వెళ్తుంది.

 
మంగనీస్:

    దీన్ని విమానాల తయారీలో, ఫుడ్ ప్యాకేజింగ్‌కు వాడే వస్తువుల తయారీలో, ఉక్కు, బ్యాటరీలు, పెయింట్స్ తయారీలో ఉపయోగిస్తారు.

ఉత్పత్తి

-మాంగనీస్ ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది.
-దేశంలో మధ్యప్రదేశ్ (చింద్వారా బెల్ట్), ఒడిశా (అత్యధిక నిల్వలు) తొలి రెండు స్థానాల్లో ఉండగా, రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ మొదటి స్థానంలో ఉంది.

 

రాగి

-ఇది రెండో అత్యుత్తమ విద్యుత్ వాహకం.

ఉత్పత్తి

-ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా, దక్షిణాఫ్రికా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో కర్ణాటక (ఉత్పత్తి) ప్రథమ స్థానంలో ఉండగా, రాజస్థాన్ (నిల్వలు అధికం) రెండో స్థానంలో ఉంది.
-రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైలారంలోని దార్వార్ అధికంగా ఉత్పత్తి చేస్తున్నది.
-తెలంగాణలో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రాగి నిక్షేపాలు ఉన్నాయి.

 
బంగారం

-బంగారం ఆకుపచ్చ, తెలుపు, పసుపు అని మూడు రకాలుగా ఉంటుంది.
-వీటిలో ఆకుపచ్చ బంగారంలో అధికశాతం బంగారం ఉంటుంది.
-ఇది క్వార్ట్ శిల నుంచి లభిస్తుంది.
-ప్రపంచంలో బంగారాన్ని అధికంగా ఉపయోగిస్తున్న దేశం భారత్.

ఉత్పత్తి

-ప్రపంచంలో దక్షిణాఫ్రికా (పింట్ వాటర్స్‌రాండ్) మొదటి స్థానంలో ఉన్నది.
-దేశంలో కర్ణాటకలో బంగారం అధికంగా లభిస్తున్నది.
-రాష్ట్రంలో బంగారం నిల్వలు కిన్నెరసాని, గోదావరి నదులు కలిసే ప్రదేశం (భద్రాద్రి కొత్తగూడెం), మంగంపేట (జయశంకర్ భూపాలపల్లి), గద్వాల శిలా బెల్ట్‌లలో విస్తరించి ఉన్నాయి.

 

వజ్రాలు

-వజ్రం 100 శాతం స్వచ్ఛమైన కార్బన్‌ను కలిగి ఉంటుంది.
-క్లింబారైట్ రాతి పొరల్లో లభిస్తుంది.

ఉత్పత్తి

-ప్రపంచంలో దక్షిణాఫ్రికా (కింబర్లీ), భారత్‌లో మధ్యప్రదేశ్ (పన్నా)లో వజ్రాలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి.
-తెలంగాణలో మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలోని కోయిలకొండ-దేవరకద్ర ప్రాంతాల్లో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి (పైపులైను పనుల్లో).

 

వెండి

ఇది అత్యుత్తమ విద్యుత్ వాహకం.

ఉత్పత్తి

-దేశంలో కర్ణాటక, రాజస్థాన్‌లలో అధికంగా ఉత్పత్తి అవుతున్నది.

 
నికెల్

-నికెల్ ఎక్కువగా ఒడిశాలో ఉత్పత్తి అవుతున్నది.

 

అలోహ ఖనిజాలు

ముగ్గురాయి (బెరైటీస్):
-దీన్ని రంగులు, రబ్బరు వస్తువులు, పేపర్లు, రసాయనాల పరిశ్రమల్లో వాడుతారు.
-రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ముగ్గురాయి నిక్షేపాలు అధికంగా ఉన్నాయి.
-ప్రపంచంలోనే నాణ్యమైన, అధిక పరిమాణంలో బెరైటీస్ నిల్వలు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా మంగంపేట వద్ద ఉన్నాయి.

 
సున్నపురాయి:

-బొగ్గు నిల్వల తర్వాత రాష్ట్రంలో అధికంగా విస్తరించిన ఖనిజం.

ఉత్పత్తి

-రాష్ట్రంలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్నది.
-దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక (అధిక నిల్వలు)లు మొదటి స్థానాల్లో ఉన్నాయి.
-రాష్ట్రంలో వికారాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అధికంగా విస్తరించి ఉన్నది.

 
అభ్రకం (మైకా):

-దీన్ని విద్యుత్ బంధకంగా ఉపయోగిస్తారు.

ఉత్పత్తి

-ప్రపంచంలో భారత్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది.
-దేశంలో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉన్నది.

 

గ్రానైట్:

-గ్రానైట్ బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ (టాన్‌బ్రౌన్ గ్రానైట్)గా లభిస్తుంది.
-తెలంగాణలో టాన్‌బ్రౌన్ గ్రానైట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా ఉత్పత్తి అవుతున్నది.
-నల్ల గ్రానైట్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఖమ్మం.

ఉత్పత్తి

-రాష్ట్రంలో బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్లు విస్తరించిన జిల్లాలు కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల

 

గ్రాఫైట్:

-భారత్‌లో తమిళనాడు అధికంగా ఉత్పత్తి చేస్తున్నది.
-దేశంలో అత్యధిక నిల్వలు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.
-రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం అధికంగా ఉత్పత్తి చేస్తున్నది.
-గ్రాఫైట్‌ను నల్లసీసం (Black Lead) అని కూడా పిలుస్తారు.
-దీన్ని పెన్సిళ్లు, రంగులు, పూసల తయారీలో ఉపయోగిస్తారు.

 

ఇంధన ఖనిజాలు (Fuel Minerals)

1. బొగ్గు 2. పెట్రోలియం 3. సహజ వాయువు

1. బొగ్గు

-ఇదొక హైడ్రోకార్బన్
-రాష్ట్రంలో లభించే బొగ్గు ఖనిజం- గొండ్వానా శిలలు
-బొగ్గులో ఉండే కార్బన్ శాతం ఆధారంగా బొగ్గును నాలుగు రకాలుగా విభజించవచ్చు.
 

బొగ్గు రకం కార్బన్ శాతం

1. ఆంథ్రసైట్ 92 -98 శాతం ఇది నాణ్యమైన బొగ్గు
2. బిట్యుమినస్ 70- 80 శాతం ఇది ఇండియాలో అధికంగా లభిస్తుంది
3. లిగ్నైట్ 65 శాతం ఇది తమిళనాడులోని నైవేలిలో లభిస్తుంది
4. పీట్ 35 శాతం ఇది అంతగా నాణ్యత లేని బొగ్గు
గమనిక: తెలంగాణలో లభించే బొగ్గు రకం – సెమీ బిట్యుమినస్

ఉత్పత్తి

-ప్రపంచంలో అత్యధిక చైనా, ఆతర్వాత అమెరికా, ఇండియా ఉత్పత్తి చేస్తున్నాయి.
-దేశంలో అత్యధికంగా జార్ఖండ్, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ ఉత్పత్తి చేస్తున్నాయి.
-తెలంగాణలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్పత్తి చేస్తున్నది
-అధిక బొగ్గు నిల్వలు – తెలంగాణలోని జిల్లాలు – మంచిర్యాల, పెద్దపల్లి