సేఫ్ గాడ్స్

        పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం పేర్కొన్న 14 అంశాలను మోటార్స్ ఏ పేరుతో ఏ, బి, సి, డి, ఇ అనే అంశాలు గా విభజించి 1956 ఆగస్టు 10న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
a) ప్రాంతీయ స్టాండింగ్ కమిటీ (ప్రాంతీయ స్థాయి సంఘం) Regional Standing Committee:
తెలంగాణ ప్రాంతం కోసం రాష్ట్ర శాసనసభకు చెందిన  ఒక ప్రాంతీయ స్థాయి సంఘం ఉంటుంది దీనిలో ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు, రాష్ట్ర శాసన సభ్యులు ఉంటారు ముఖ్యమంత్రికి దీనిలో స్థానం ఉండదు. ప్రత్యేక అంశాలకు సంబంధించి చట్టం చేయడం కోసం ప్రాంతీయ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయవచ్చు.
ప్రాంతీయ సంఘం ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే గవర్నర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి
b) స్థానిక నియమాలు(Local Recruitment):
సబార్డినేట్ సర్వీసు లు భర్తీ విషయంలో తెలంగాణను ఒక యూనిట్ గా పరిగణలోకి తీసుకునే విధంగా ఐదేళ్లపాటు తాత్కాలికంగా  ఏర్పాటు చేయాలి
c) ఉర్దూ దాని స్థానం(Status of Urdu Language):
ప్రస్తుత పాలనా వ్యవస్థలో ఉర్దూస్థానాన్ని రాబోయే ఐదు సంవత్సరాల పాటు పదిలంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలపై భారత ప్రభుత్వం సూచనలు ఇస్తుంది.
d) నూతన రాష్ట్రం ఏర్పాటు వల్ల మిగులు ఉద్యోగాల తొలగింపు(Retrenchment of surplus personnel in new state):
మిగులు ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ఉమ్మడి రాష్ట్రంలోనే ఉద్యోగులకు సమానంగా ఆ తొలగింపు వర్తిస్తుంది
e) తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య మేయాల పంపిణీ(Distribution of Expenditure between Andhra and Telangana):సాధారణ పరిపాలన కోసం కొత్త రాష్ట్రం వెచ్చించే వ్యయాన్ని రెండు ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. ఆదాయంలో మిగులును మాత్రం తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి


ప్రాంతీయ సంఘం పనితీరు

        తెలంగాణ ప్రాంతీయ సంఘం మిగులు నిధులకు సంబంధించి 1956 నుండి 1959 వరకు తెలంగాణలో చేయవలసిన దానికన్నా తక్కువ వ్యయం చేసిందని మిగులు నిధులను తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయాలని తీర్మానించింది.
        ఈ తీర్మానం వల్ల 1961-1962 వరకు మిగులు నిధులతో వివిధ పథకాలను రూపొందించి అమలు చేశారు

        ఉద్యోగుల అంశం గురించి హయగ్రీవాచారి ప్రాంతీయ సంఘం చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక అడ్హాక్(Adhoc Committee) కమిటీ ని ఏర్పాటు చేసాడు

        తెలంగాణ ప్రాంతంలో నియమించిన స్థానికేతర ఉద్యోగులను సమీక్షించాలని 1968లో తెలంగాణ ప్రాంతీయ సంఘం చైర్మన్ ప్రభుత్వాన్ని కోరారు.  దీనికి స్పందనగా ప్రభుత్వం నియమాలను అతిక్రమించి నియమించిన స్థానికేతరులను తొలగించాలని అన్ని శాఖాధిపతుల ను ఆదేశించింది.

        హెచ్ ఒ డి, సెక్రటేరియట్ లోని ప్రతి మూడు ఉద్యోగాలలో రెండవ ఉద్యోగం తెలంగాణకు ఇవ్వాలని ఉండగా మిగతా రెండు ఉద్యోగాలు ఆంద్రావారికి  రిజర్వు అని చెప్పి పూర్తిగా రూల్స్ ను వక్రీకరించి ఆ రెండు ఉద్యోగాలలో ఆంధ్ర వారిని భర్తీ చేశారని Adhoc  కమిటీ 1969లో నివేదిక సమర్పించింది

        విద్యారంగంలో ప్రాంతీయ ప్రయోజనాల రక్షణలలో కూడా ప్రాంతీయ సంఘం కీలక పాత్రను పోషించింది

        1969 అష్టసూత్రం పథకం ప్రకారం ప్రాంతీయ కమిటీ అధికారాలు మరింతగా విస్తృతం అయ్యాయి కానీ 1972 జై ఆంధ్ర ఉద్యమం వల్ల ప్రాంతీయ సంఘం రద్దు అయింది.



 Violations of Safeguards - రక్షణల ఒప్పందం-ఉల్లంఘనలు

పెద్ద మనుషుల ఒప్పందంనకు ఆంధ్ర పాలకులు అనేక తూట్లు పొడిచి ఉల్లంఘించారు(Violated the Safeguards).

1. తెలంగాణ మిగులు నిధులు(Surplus of Telangana)
తెలంగాణ మిగులు నిధుల పై నియమించిన భార్గవ కమిటీ తెలంగాణ మిగులు నిధులు ఆంధ్రాకు తరలించబడ్డాయి అని పేర్కొన్నది.  
2. ముల్కీ నిబంధనలు (Mulki Rules)
పెద్ద మనుషుల ఒప్పందం కంటే ముందు ఉన్న 17 సంవత్సరాల స్థానికతను స్థానికతను పెద్దమనుషుల ఒప్పందంలో 12 సంవత్సరాలకు కుదించారు కానీ Note on Safe guards లో ఈ 12 సంవత్సరాల స్థానికతను ఐదు సంవత్సరాల తాత్కాలిక సౌకర్యంగా మార్చి వేశారు.
3. తెలంగాణకే ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కానీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ నాయకుడికి ఉపముఖ్యమంత్రి పదవి లేదు.
4. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Hyderabad Congress Pradesh Committee)
తెలంగాణకు కల్పించిన రక్షణల ప్రకారం హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ కొనసాగించాలి. కాని తెలంగాణలో రాజకీయ నాయకత్వం ఎదగకుండా ఆంధ్రా నాయకులు దీన్ని రద్దు చేశారు.
5. కొత్త రాష్ట్రం పేరు
ఆంధ్ర-తెలంగాణ గా పెట్టుటకు కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఈ పేరు పెట్టడానికి అందరూ అంగీకరించారు కానీ పార్లమెంటులో రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదించినప్పుడు ఈ పేరును ఆంధ్రప్రదేశ్ గా మార్చారు.
6. తెలంగాణేతరులకు ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములను అమ్మటం నిషేధం(Related to Agricultural Lands)
ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో భూముల అమ్మకాలు తెలంగాణ ప్రాంతీయ సంఘం నియంత్రణలో ఉండాలి కానీ తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దు తర్వాత భూములను ఆంధ్ర వారు కొనుగోలు చేశారు.
7. వ్యవసాయ రంగంలో, నీటిపారుదల రంగంలో చాలా వరకు ఉల్లంఘనలు జరిగాయి.