శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో మార్చి 14న నిర్వహించిన అతిచిన్న ఎస్ఎస్ఎల్వీ (Small Satellite Launch Vehicle) రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో రాకెట్ కు భూస్థిర పరీక్ష నిర్వహించారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో ఇవాళ నిర్వహించిన అతిచిన్న రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో ఎస్ఎస్ఎల్వీ (Small Satellite Launch Vehicle) రాకెట్‌కు భూస్థిర పరీక్ష నిర్వహించారు.
వాహనం వివరాలు
(A) కొలతలు
- ఎత్తు: 34 మీటర్లు
- వ్యాసం: 2 మీటర్లు
- బరువు: 120 టన్నులు
(B) ప్రొపల్షన్
- ఇది నాలుగు దశల లాంచింగ్ వాహనం.
- మొదటి మూడు దశలు హైడ్రాక్సిల్-టెర్మినేటెడ్ పాలీబుటాడైన్ (HTPB) ఆధారిత సాలిడ్ ప్రొపెల్లెంట్‌ను ఉపయోగిస్తాయి, నాల్గవ టెర్మినల్ దశ వెలాసిటీ-ట్రిమ్మింగ్ మాడ్యూల్ (VTM)గా ఉంటుంది.
చిన్న ఉప గ్రహాలను చిన్న రాకెట్లతో ఉపయోస్తే ఖర్చు తగ్గే అవకాశం ఉందని ఇస్రో ఎస్ఎస్ఎల్వీకి రూపకల్పన చేసింది. 500 కిలోల బరువు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేలా దీన్ని తయారు చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ తయారీలో పది శాతం ఖర్చుతో ఎస్ఎస్ఎల్వీని రూపొందించారు.
ప్రవేశ పెట్ కక్ష్య
- లో ఎర్త్ ఆర్బిట్ (500 కి.మీ)కి 600 కిలోలు లేదా
- సన్-సింక్రోనస్ ఆర్బిట్ (500 కి.మీ) కి 300 కిలోలు