POLITY PRACTICE BITS 1


  1. కింది స్టేట్‌మెంట్లల్లో సరైనవి గుర్తించండి?
    భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వేటి అకౌంట్ల ఆడిట్‌కు బాధ్యత వహిస్తారు
    1) కేంద్రప్రభుత్వం 2) రాష్ట్రప్రభుత్వం
    3) కేంద్రపాలిత ప్రాంతాలు
    4) పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు
    1) 1, 2, 3 2) 2, 3, 4
    3) 1, 3, 4 4) 1, 2, 4
  2. కింది వాటిని జతపర్చండి
    ఎ. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌
    1. రాజ్యసభ ఎన్నుకొంటుంది
      బి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌
    2. లోక్‌సభ ఎన్నుకొంటుంది
      సి. ప్రభుత్వ ఖాతాల సంఘం చైర్మన్‌
    3. లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తాడు
    4. రాష్ట్రపతి నియమిస్తాడు
      1) ఎ-1, బి-2, సి-3
      2) ఎ-1, బి-3, సి-4
      3) ఎ-2, బి-3, సి-4
      4) ఎ-4, బి-1, సి- 3
  3. కింది వారిలో జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
    1) ముఖ్యమంత్రి 2) కేంద్ర హోంమంత్రి
    3) గవర్నర్‌ 4) ఎన్నికైన శాసనసభ్యుడు
  4. కేంద్రమంత్రి మండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?
    1) రాష్ట్రపతి 2) ప్రధానమంత్రి
    3) లోక్‌సభ 4) ప్రజలు
  5. కింది వారిలో రాష్ట్రపతులుగా పనిచేసిన వారిని సరైన వరుస క్రమంలో అమర్చండి?
    1) జాకీర్‌ హుస్సేన్‌ 2) సర్వేపల్లి రాధాకృష్ణన్‌
    3) ఫక్రుద్దీన్‌ అలీఅహ్మద్‌ 4) వీవీ గిరి
    1) 1, 3, 4, 2 2) 3, 2, 4, 1
    3) 4, 1, 2, 3 4) 2, 1, 4, 3
  6. సర్కారియా కమిషన్‌ను వేటిపై పరిశీలనకు నియమించారు?
    1) పరిపాలన సంస్కరణలు
    2) ఎలక్ట్రోరల్‌ సంస్కరణలు
    3) ఆర్థిక సంస్కరణలు
    4) కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
  7. సర్వే ఆఫ్‌ ఇండియా ఏ మంత్రిత్వశాఖకు సంబంధించినది?
    1) రక్షణశాఖ 2) పర్యావరణ, అటవీశాఖ
    3) హోంశాఖ 4) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  8. ఆర్థికమంత్రులుగా పనిచేసినవారిని సరైన క్రమంలో గుర్తించండి?
    1) వీపీ సింగ్‌ 2) ఆర్‌ వెంకట్రామన్‌
    3) వైబీ చౌహాన్‌ 4) ప్రణబ్‌ ముఖర్జీ
    1) 1, 2, 3 2) 1, 3, 4
    3) 2, 4 4) 1, 2, 3, 4
  9. హేతువు (ఏ): కేంద్రమంత్రి మండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది
    కారణం (ఆర్‌): కేంద్రమంత్రులుగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఇద్దరూ కావచ్చు
    1) ఏ, ఆర్‌ సరైనవి. ఏ కు ఆర్‌ సరైన వివరణ
    2) ఏ, ఆర్‌ సరైనవి. ఏ కు ఆర్‌ సరైన
    వివరణ కాదు
    3) ఏ వాస్తవం, ఆర్‌ అవాస్తవం
    4) ఏ అవాస్తవం, ఆర్‌ వాస్తవం
  10. కింది వాటిలో పార్లమెంట్‌లో కోరం ఎంత?
    1) మొత్తం సభ్యుల్లో 1/5 వంతు
    2) మొత్తం సభ్యుల్లో 1/6 వంతు
    3) మొత్తం సభ్యుల్లో 1/8 వంతు
    4) మొత్తం సభ్యుల్లో 1/10 వంతు
  11. కేంద్రపాలిత ప్రాంతాలు వాటి హైకోర్టులు కలిగిన ప్రాంతాలు జతపర్చండి
    ఎ. పాండిచ్చేరి 1. మద్రాస్‌
    బి. అండమాన్‌ నికోబార్‌ దీవులు 2. కలకత్తా
    సి. లక్షద్వీప్‌ 3. కేరళ
    డి. డామన్‌ డయ్యూ 4. బొంబాయి
    1) ఎ-1, బి-2, సి-3, డి-4
    2) ఎ-2, బి-1, సి-3, డి-4
    3) ఎ-2, బి-1, సి-4, డి-3
    4) ఎ-1, బి-2, సి- 4, డి-3
  12. జతపర్చండి?
    రిట్‌పేరు జారీచేయబడేది
    ఎ. మాండమస్‌ 1. ఆదేశం
    బి. ప్రొహిబిషన్‌ 2. నిషేధం
    సి. సెర్షియోరరీ 3. న్యాయస్థానాల
    పరిశీలన అధికారం
    డి. కోవారెంటో 4. ఏ అధికారంతో
    1) ఎ-1, బి-2, సి-4, డి-3
    2) ఎ-1, బి-3, సి-2, డి-4
    3) ఎ-1, బి-4, సి-3, డి-2
    4) ఎ-1, బి-2, సి- 3, డి-4
  13. ఒక రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ జీతభత్యాలను నిర్ణయించేది?
    1) రాష్ట్రపతి 2) శాసన సభ
    3) గవర్నర్‌ 4) పార్లమెంట్‌
  14. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కింది వివరణలను పరిశీలించండి?
    1) ముఖ్యమంత్రి గవర్నర్‌ ద్వారా నియమితులవుతారు
    2) ముఖ్యమంత్రి, మంత్రిమండలి
    సమష్టిగా గవర్నర్‌కు బాధ్యత వహిస్తారు
    3) రాష్ట్రపరిపాలన వ్యవహారాలు, శాసన ప్రతిపాదనలకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి విధిగా గవర్నర్‌కు తెలియజేయాలి
    4) ఒక మంత్రి ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకున్నా దానిపై మంత్రిమండలి పరిశీలించకపోతే, మంత్రి మండలి పరిశీలనకు గవర్నర్‌ కోరిన విధంగా ముఖ్యమంత్రి
    సమర్పించాలి
    1) 1, 2, 3, 4 2) 4
    3) 1, 3, 4 4) 2, 3
  15. రాజ్యాంగంలోని షెడ్యూల్‌లో సరిగా జతపర్చనిది?
    1) 8వ షెడ్యూల్‌- అధికార భాషలు
    2) 2వ షెడ్యూల్‌- పదవీ ప్రమాణ స్వీకారం
    3) 4వ షెడ్యూల్‌- రాజ్యసభ సీట్ల కేటాయింపు
    4) 10వ షెడ్యూల్‌- పార్టీ ఫిరాయింపుల చట్టం

 

1-1,     2-4,     3-2,     4-1,     5-4, 

6-4,     7-4,     8-3,     9-2,     10-4, 

11-1,     12-4,     13-3,     14-3,     15-2.