ECONOMY PRACTICE BITS 1

 

  1. ‘నీతి ఆయోగ్‌’ ఎలా ఏర్పాటయ్యింది?
    1) పార్లమెంట్‌ చట్టం ద్వారా
    2) కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా
    3) రాష్ట్రపతి సూచన ద్వారా
    4) రాజ్యాంగబద్ధత ద్వారా
  2. తలసరి ఆదాయంలోని భేదాలు ఏ అంశాన్ని తెలియజేస్తాయి?
    1) జీవితకాలం 2) పోషకలోపం
    3) జీవన ప్రమాణం 4) ఏదీకాదు
  3. కింది వాటిలో స్థూలదేశీయోత్పత్తి (GDP)కి సంబంధించి సరికానిది గుర్తించండి?
    1) దీనిలో విదేశీ వ్యాపారం ఉండదు
    2) ఇతర దేశాల్లో ఉన్న మన దేశ పౌరుల ఆదాయం ఉండదు
    3) ఇది ఆ దేశ ప్రాంతానికి సంబంధించిన అంతిమ వస్తు సేవల విలువ
    4) మన దేశంలోని విదేశీ పౌరుల ఆదాయం ఉండదు
  4. భారత్‌ను ‘జనాభా సంబంధిత డివిడెండ్‌’ దేశంగా గుర్తిస్తారు. కారణం?
    1) మొత్తం జనాభాలో స్త్రీ జనాభా అధిక శాతంలో ఉండటం
    2) 15 ఏండ్ల లోపు వయస్సు గల జనాభా అధిక శాతంలో ఉండటం
    3) 15-64 ఏండ్ల మధ్య వయస్సు గల జనాభా అధిక శాతంలో ఉండటం
    4) 65 ఏండ్ల పై బడిన వయస్సు గల జనాభా అధికం శాతంలో ఉండటం
  5. తొలి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, అవి ఉన్న ప్రదేశాలతో జతపర్చండి?
    ఎ. హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌
    1. బెంగళూర్‌, కర్ణాటక
      బి. హిందుస్థాన్‌ కేబుల్‌ పరిశ్రమ
    2. మైసూర్‌, కర్ణాటక
      సి. హిందుస్థాన్‌ మిషన్‌ టూల్స్‌
    3. దుర్గాపూర్‌, పశ్చిమ బెంగాల్‌
      డి. భారతీయ టెలిఫోన్‌ ఫ్యాక్టరీ
    4. విశాఖపట్నం, ఏపీ
      1) ఎ-4, బి-3, సి-2, డి-1
      2) ఎ-4, బి-2, సి-3, డి-1
      3) ఎ-4, బి-3, సి-1, డి-2
      4) ఎ-3, బి-4, సి-1, డి-2
  6. బీహార్‌లోని రైతులతో నిర్బంధంగా నీలిమందును సాగుచేయించేవారు ఈ విధానాన్ని ఏమని పిలుస్తారు?
    1) రాయితీ 2) తీస్‌ఖతియా
    3) ఢెకా 4) ఆర్జ్‌
  7. జతపర్చండి
    ఎ. రైత్వారీ పద్ధతి
    1. విలియం బెంటింక్‌, మెకంజి
    బి. జమీందారీ పద్ధతి 2. థామస్‌ మన్రో
    సి. మహల్వారీ పద్ధతి 3. కారన్‌ వాలీస్‌
    1) ఎ-2, బి-1, సి-3
    2) ఎ-1, బి-3, సి-2
    3) ఎ-2, బి-3, సి-1
    4) ఎ-3, బి-2, సి-1
  8. వ్యష్టి ఆదాయం, జాతీయాదాయం మధ్య గల వ్యత్యాసం?
    1) పరోక్ష పన్నులు- సబ్సిడీలు
    2) తరుగుదల
    3) నికర విదేశీ వ్యాపార మిగులు
    4) చేతికి అందిన సంపాదించని ఆదాయం- సంపాదించిన చేతికి అందని ఆదాయం
  9. ఎవరి నమూనా ఆధారంగా నాలుగో ప్రణాళిక (1969-74) రూపొందింది?
    1) డీఆర్‌ గాడ్గిల్‌
    2) అలెన్‌ మన్నె, అశోక్‌ రుద్ర
    3) వకీల్‌, బ్రహ్మానందం
    4) మహలనోబిస్‌
  10. భూసంస్కరణల ముఖ్య లక్ష్యం?
    1) వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం
    2) రైతులకు మేలు చేయడం
    3) భూస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడం
    4) 1, 2
  11. భూ సమీకరణ, భూసేకరణ మధ్య గల భేదం?
    1) భూసమీకరణ, భూసేకరణ రెండూ స్వచ్ఛందం కాదు
    2) భూసమీకరణ స్వచ్ఛందమైనది, భూసేకరణ స్వచ్ఛందమైనది కాదు
    3) భూసమీకరణ స్వచ్ఛందమైనది కాదు, భూసేకరణ స్వచ్ఛందమైనది
    4) భూసమీకరణ, భూసేకరణ రెండూ స్వచ్ఛందమైనవి
  12. దేశంలో అమలైన ఆర్థిక సంస్కరణల్లో లేని అంశం ఏది?
    1) ప్రభుత్వరంగ సంస్థల సంస్కరణలు
    2) విత్తరంగ సంస్కరణలు
    3) కార్మిక సంస్కరణలు
    4) పారిశ్రామిక రంగ సంస్కరణలు
  13. భారత ఉక్కు పరిశ్రమ పితామహుడు ఎవరు?
    1) స్వామినాథన్‌ 2) జంషెడ్‌జీ టాటా
    3) విక్రం సారాభాయ్‌
    4) హోమీ జహంగీర్‌ బాబా
  14. హరిత విప్లవం- ప్రణాళికలకు సంబంధించి సరైనది?
    1) హరిత విప్లవాన్ని రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు
    2) భారత్‌లో హరితవిప్లవం ప్రవేశపెట్టినప్పుడు వార్షిక ప్రణాళికలు అమల్లో ఉన్నాయి
    3) మూడో ప్రణాళిక కాలంలో హరితవిప్లవం అమలు చేశారు
    4) మొదటి ప్రణాళిక కాలంలోనే హరితవిప్లవం అమలు చేశారు
  15. 8వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో సరైనది?
    1) అటవీ ప్రాంత విస్తరణ అంశాలను 8వ ప్రణాళిక ఉపేక్షించింది
    2) భారత్‌లో అటవీ ప్రాంత విస్తరణ అనేది ప్రధాన అంశం కాదని 8వ ప్రణాళిక తెలిపింది
    3) అటవీ ప్రాంత విస్తరణ పథకాల అమలును 8వ ప్రణాళిక ప్రశంసించింది
    4) అటవీప్రాంత విస్తరణ పథకాల్లోని కొన్ని లోపాలను 8వ ప్రణాళిక ఎత్తిచూపింది

 

 

 1-2,     2-3,     3-4,     4-3,     5-1, 

6-2,     7-3,     8-4,     9-2,     10-4, 

11-2,     12-3,     13-2,     14-2,     15-4.