15 ఆర్థిక సంఘం నివేదిక – సిఫారసులు

             రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం భారత రాష్ట్రపతి 15వ ఆర్థిక సంఘాన్ని 2017, నవంబర్ 17న ఎన్‌కే సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఇది 2020, ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా 5ఏండ్ల కాలానికి సిఫార్సులను 2019, అక్టోబర్‌లో అందించాల్సి ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో కొన్ని అనూహ్య సంఘటనల కారణంగా 2020-21 సంవత్సరానికి మధ్యంతర సిఫార్సులను 2020, ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందు ఉంచెను. తుది నివేదిక 2021-26 సంవత్సరానికి సంబంధించిలో 2020, అక్టోబర్ ఇవ్వాల్సి ఉన్నది.

సభ్యులు: ఎన్‌కే సింగ్ (చైర్మన్)
అరవింద్ మెహతా (కార్యదర్శి)

  1. అనూప్‌సింగ్ 2. అశోక్‌లహరీ 3. రమేశ్ చంద్ 4. అజయ్ నారాయణ ఝా (ఆర్థిక శాఖ కార్యదర్శి)
    నోట్: ఆర్థిక కార్యదర్శి శక్తికాంత్‌దాస్‌ను ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమించడంతో ఆర్థిక సంఘం సభ్యుడిగా 2018, డిసెంబర్‌లో రాజీనామా చేశారు. ఆయన స్థానంలో 2019 మార్చిలో అజయ్ నారాయణ ఝాను నియమించారు.
    తొలి నివేదిక (2020-21)లోని ముఖ్యాంశాలు
  2. కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నులు బదిలీ
    80వ రాజ్యాంగ సవరణ తర్వాత కేంద్ర పన్నుల్లో మొత్తంగా రాష్ట్రాలకు కొంత వాటా ఇవ్వాలి. 2019 జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ రాష్ట్రం జమ్ముకశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. పన్నుల్లో 0.85 వాటా జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి వెళ్లేది. ప్రస్తుతం ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాల భద్రత, ఇతర ప్రత్యేక అవసరాలకు పన్నుల్లో 1శాతం వాటా అవసరమవుతుంది. కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యత కేంద్రానిదే. కాబట్టి 14వ విత్త సంఘం సూచించిన 42శాతం నుంచి 1శాతం తగ్గించి 15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్లే పన్నుల వాటాను 41శాతంగా సూచించింది.
  3. రాష్ట్రాల మధ్య పంపిణీ – ప్రాతిపదిక
    కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల్లో వాటా నిర్ణయించిన తర్వాత, ఆ మొత్తాన్ని రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలి నిర్ణయించాలి. గత కమిష‌న్‌లు కొన్ని కోశ అవసరాలు, సమత్వం, సామర్థ్యానికి ప్రాధాన్యత ఇచ్చెను. మరొకొన్ని కోశ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చాయి.
    2021 Criteria and Weights for devolution

  4. Discription               14th Fc(2015-20)    15th Fc(2020-21)
    Population(1971)     17.5                          –
    Population(2011)     10                             15
    Area                         15                             15
    Forest Cover            7.5                             –
    Forest and Ecology  –                              10
    Income Distance     50                             45
    Demographic
    performance             –                              12.5
    Tax effort                 –                               2.5

 

 

సిఫారసులు

  • పన్నుల్లో రాష్ట్రాల వాటాను 2021-22 నుంచి 2025-26 వరకు ప్రస్తుతం ఉన్న 41శాతంగానే కొనసాగించాలని ఆర్థిక సంఘం సూచించింది. రాష్ట్రాలు మరిన్ని అప్పులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని కూడా పేర్కొంది. విద్యుత్తు రంగంలో సంస్కరణలకు సంబంధించిన పనితీరును అందుకు ప్రాతిపదికగా తీసుకోవాలని సిఫారసు చేసింది.
  • 2021-22లో ద్రవ్యలోటు 6శాతం, 2022-23లో 5.5శాతం, 2023-24లో 5శాతం, 2024-25లో 4.5శాతం, 2025-26లో 4శాతం ఉండవచ్చని అంచనా.
  • 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం పన్ను వసూళ్లు రూ.135.2లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. సెస్సులు, సర్‌చార్జిల వంటివి మినహాయిస్తే ఈ మొత్తం రూ.103లక్షల కోట్లకు తగ్గుతుంది. అందులో 41శాతం రాష్ట్రాలకు దక్కాలి.
  • వచ్చే ఐదేళ్లలో అన్ని రాష్ట్రాలకు కలిపి పన్నుల్లో వాటా కింద రూ.42,24,760 కోట్లు పంచాల్సి వస్తుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది.
  • 14వ ఆర్థిక సంఘంతో పోలిస్తే 15వ ఆర్థిక సంఘం కాలంలో వచ్చే పన్నులు, గ్రాంట్ల వాటా తగ్గింది. క్రితంసారి అన్ని రాష్ట్రాలకు కలిపి పన్నులు, గ్రాంట్ల రూపంలో రూ.59,63,484 కోట్లు కాగా, ఈసారి రూ.52,41,422కోట్లకు పరిమితమైంది. ఇదివరకు జమ్ముకశ్మీర్ రాష్ట్రాల జాబితాలో ఉండేది. కాబట్టి 29 రాష్ట్రాలు ఉండేవి. అది ఈ జాబితాలో లేకపోవడంతో ఈసారి రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గింది.
  • ఇదివరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద రూ.39,48,187కోట్లకు సిఫారసు చేయగా, ఇప్పుడది రూ.42,24,760కోట్లకు చేరింది.
  • క్రితంసారి రెవెన్యూలోటు కింద రూ.1,94,821కోట్లు ఇవ్వాలని చెప్పగా, ఇప్పుడది రూ.2,94,514కోట్లక పెరిగింది.
  • 14వ ఆర్థిక సంఘం తొలి ఏడాది రెవెన్యూలోటు రాష్ట్రాలు 10 ఉండగా, చివరి ఏడాదికి ఆ సంఖ్య 7కి తగ్గింది. కానీ, ఇప్పుడు ఆ రాష్ట్రాల సంఖ్య 17కి చేరింది. అందువల్లే రెవెన్యూ లోటు కింద అత్యధిక మొత్తం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో అత్యధికంగా పశ్చిమబెంగాల్ (రూ.40,115కోట్లు), కేరళ (రూ.37,814కోట్లు), హిమాచల్‌ప్రదేశ్(రూ.37,199), ఆంధ్రప్రదేశ్ (రూ.30,497)కు వెళ్తున్నది. క్రితంసారి రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో రూ.18,20,476కోట్లు రాగా, ఈసారి అది రూ.7,22,148కే పరిమితమైంది.

 

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా
రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం 15 ఆర్థిక సంఘం 2020-21కి బదిలీ (రూ.కోట్లలో)
ఆంధ్రప్రదేశ్ 4.31% 4.111 35,156
తెలంగాణ 2.43% 2.133 18,241
ఉత్తర్‌ప్రదేశ్ 17.95% 17.931 1,52,342
గోవా 0.38% 0.386 3301
సిక్కిం 0.36% 0.388 3318

ఎక్కువ పన్నుల వాటా ఉత్తర్‌ప్రదేశ్ (17.931శాతం) కాగా తక్కువ వాటా గోవా (0.386)కి వెళ్తున్నది
నోట్: గతంలో చివరి స్థానంలో సిక్కిం ఉండేది