సుందర్‌లాల్ బహుగుణ – చిప్కో ఉద్యమం (1973)

 

  • ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారులు సుందర్‌లాల్ బహుగుణ కొవిడ్‌తో మరణించారు.
  • 94ఏళ్ల వయసున్న సుందర్‌లాల్ బహుగుణ ఇటీవలి కాలం వరకు హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడారు.
  • 1970ల్లో ప్రారంభించిన చిప్కో ఉద్యమానికి నేతృత్వం వహించారు.
  • 1980ల్లో తెహ్రీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ద్వారా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
  • కేంద్ర ప్రభుత్వం ఆయనని 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
  • ఇది అడవుల నరికివేతకు (Deforestation) వ్యతిరేకంగా సాగిన ఉద్యమం
  • చిప్కో అనగా చెట్లను హత్తుకోవడం
  • ఇది ఉత్తరాఖండ్‌లోని గర్‌వాల్ హిమాలయ ప్రాంతంలో గల ఛమోలి జిల్లాలోని మండల్ గ్రామంలో ప్రారంభమైంది.
  • దీనిలో పాల్గొన్న ఉద్యమకారులు – సుందర్‌లాల్ బహుగుణ, చండీ ప్రసాద్ భట్
  • సుందర్‌లాల్ బహుగుణ ఒక గాంధేయవాది, తత్త్వవేత్త
  • ఈ ఉద్యమంలో ఛిర్‌ఫైన్ (పైనస్ రాక్స్ బర్గై) అనే వృక్షాల నరికివేతను అడ్డుకున్నారు.
  • మొదటిసారిగా పర్యావరణ సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపట్టారు.
  • ఇందులో అనేక సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొనడం వల్ల ఒక నూతన భావన. ‘Eco feminism’ వెలుగులోకి వచ్చింది.
  • ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ – గౌరీదేవి (Mahila Mangal Dal)
  • దీనిలో పాల్గొన్న ఇతర మహిళలు – ధూమ్ సింగ్ నేగి, బచ్‌నీ దేవి.
  • దీని పాల్గొన్న సంస్థ – దసోలి గ్రామ స్వరాజ్య సంఘ
  • అప్పటి యూపీ సీఎం హేమవతి నందన్ బహుగుణ వేసిన కమిటీ ఉద్యమకారులకు అనుకూలంగా నివేదికను ఇచ్చింది.
  • దీనివల్ల తర్వాత దేశంలో వచ్చిన అనేక ఉద్యమాలకు చిప్కో స్ఫూర్తినిచ్చింది.
  • ఈ ఉద్యమం వల్ల చండీప్రసాద్ భట్‌కు వచ్చిన అవార్డ్ – రామన్ మెగసెసె (1982)
  • ఈ ఉద్యమం వల్ల సుందర్‌లాల్ బహుగుణకు వచ్చిన అవార్డ్ – పద్మ భూషణ్ (2009)
  • చిప్కో ఉద్యమానికి వచ్చిన అవార్డ్ – Right Livelihood Awared
  • చిప్కో ఉద్యమంపై పాటను రాసిన కవి – ఘన్‌శ్యామ్ రాథూరి