POLITY PRACTICE BITS 9

1. కింది వానిలో రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలు ఏవి?
ఎ. భారతదేశ పౌరుడై ఉండాలి
బి. 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
సి. లో‌క్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి తగిన అర్హతలను కలిగి ఉండాలి
డి. పైవన్నీ
సమాధానం: డి

2. కిందివానిలో ఎవరు త్రివిధ దళాలకు అధిపతిగా వ్యవహరిస్తారు?
ఎ. రాష్ట్రపతి
బి. ప్రధాన మంత్రి
సి. పార్లమెంట్
డి. ఉపరాష్ట్రపతి
సమాధానం: ఎ

3. కిందివానిలో ఎవరికి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది?
ఎ. పార్లమెంట్‌కు
బి. రాష్ట్రపతికి
సి. సుప్రీంకోర్టుకు
డి. వాటిని సవరించలేం
సమాధానం: ఎ

4. కింది వానిలో ఎవరు కేంద్ర కార్యనిర్వాహకశాఖగా వ్యవహరిస్తారు?
ఎ. కేంద్ర మంత్రి మండలి
బి. రాష్ట్రపతి
సి. క్యాబినెట్ మంత్రులు
డి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, అటార్నీ జనరల్
సమాధానం: డి

5. కింది వానిలో ఏ విధానం ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది?
ఎ. పరోక్ష విధానం
బి. ప్రత్యక్ష విధానం
సి. ప్రత్యక్ష, పరోక్ష విధానం
డి. ఏదీకాదు
సమాధానం: ఎ

6. కింది వారిలో ఎవరు 2012 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు?
ఎ. అశోక్‌మెహతా
బి. వినోద్‌రాయ్
సి. జె.ఎం.లింగ్డో
డి. వివేక్ కుమార్ అగ్నిహోత్రి
సమాధానం: డి

7. కింది వానిలో రాష్ట్రపతి ఎన్నిక గురించి సరైన దానిని గుర్తించండి?
ఎ. రాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులు కచ్చితంగా ఓటు వేయాలనే నిబంధన లేదు
బి. రాజకీయ పార్టీలు విప్ జారీ చేయరాదు
సి. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద పేర్కొన్న అనర్హత నిబంధనలు వర్తించవు
డి. పైవన్నీ
సమాధానం: డి

8. రాజ్యాంగంలోని 17వ నిబంధన దేనిని నిషేధిస్తుంది?
ఎ. వెట్టిచాకిరి
బి. మత ప్రచారాన్ని
సి. అంటరానితనం
డి. పైవన్నీ
సమాధానం: సి

9. కిందివానిలో ఎవరు రిట్‌లను జారీ చేస్తారు?
ఎ. సుప్రీంకోర్టు మాత్రమే
బి. అన్ని న్యాయస్థానాలు
సి. రాష్ట్రపతి
డి. సుప్రీంకోర్టు, హైకోర్టులు
సమాధానం: డి

10. కిందివానిలో ఏ రకమైన వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు?
ఎ. పాకెట్ వీటో
బి. సస్పెనిసివ్ వీటో
సి. క్వాలిఫైడ్ వీటో
డి. అబ్సల్యూట్ వీటో